మెగాహీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడప వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనక ఓ కారణముంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం మ్యూజిక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈయన మూడు నెలల క్రితం రామ్ చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్.. రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)
కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్.. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ని తీసుకొస్తానని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
'ఏఆర్ రెహమాన్.. ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని మూడు నెలల ముందే చెప్పారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు)
#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan pic.twitter.com/4l7CSysAtq
— Rajesh Manne (@rajeshmanne1) November 18, 2024
Comments
Please login to add a commentAdd a comment