ప్రధాన వార్తలు

ఎంత పని సేచ్చి వయ్యా జగనూ..!
ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని ఆయనకు.. సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్‌కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న

తిరుమల లడ్డూ కేసు: సిట్ దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట లిస్టు చేయాలని జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో సిట్ రాజకీయ ప్రేరేపిత దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించేందుకు.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నేరుగా నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం(జులై 14) ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. సిట్ పని విధానంపై స్టేటస్ కో కొనసాగించాలి. సిట్ సేకరించిన రికార్డులన్నీ పరిశీలించాలి. సిట్‌కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నిర్దేశించాలి. సిట్ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. దర్యాప్తు సమయంలో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తోపాటు అడ్వకేటును అనుమతించాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి అని కోర్టును కోరారు.పిటిషన్లో ఏముందంటే.. తిరుమల లడ్డు కేసులో సిట్ రాజకీయ కక్షతో, దురుద్దేశంతో దర్యాప్తు జరుపుతోంది. కదురు చిన్నప్పన్న నుంచి బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ కు అనుగుణంగా స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. నన్ను, మాజీ ఈవోను ఈ కేసులో ఇరికించి.. అరెస్టు చేసే విధంగా బలవంతంగా సాక్షాలను చెప్పిస్తున్నారు. సిట్ పారదర్శకంగా పనిచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈ కేసులో కదురు చిన్నప్పన్నను భయపెట్టి బలవంతపు స్టేట్మెంట్లు తీసుకుంటున్నది. ఆయన ఆస్తులను జప్తు చేస్తామని భయపెడుతోంది. రాజకీయ జోక్యంతో సిట్ దర్యాప్తు గాడి తప్పింది. రాజకీయాల కతీతంగా దర్యాప్తు జరపాల్సిన సిట్ వాటికి తిలోదకాలు ఇచ్చిందిరాష్ట్ర ప్రభుత్వ అధికారుల మితిమీరిన జోక్యంతో సిట్ దర్యాప్తుపై ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. సిట్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. సిట్ కాంపోజిషన్ లో బ్యాలెన్స్ తప్పింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుండడంతో సెలెక్టివ్ గా విచారణ చేసి, అనేక అంశాలను తొక్కి పెడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిట్ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఈ నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలి.

ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత
ప్రముఖ నటి, అభినయ సరస్వతి బి.సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం (జూలై 14న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి (1959), జగదేక వీరుని కథ, సీతారామ కల్యాణం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, శకుంతల, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, సీతారామ వనవాసం, దాన వీర శూర కర్ణ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.200కి పైగా సినిమాలుబీ సరోజాదేవి (B.Saroja Devi) 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. "అభినయ సరస్వతి" అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభమైంది. పాండురంగ మహత్యం (1957) ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. నాడోడి మన్నన్ (1958) ఆమెను తమిళ చిత్రసీమలో స్టార్‌గా నిలిపింది. హిందీలో పైఘామ్ (1959), ససురాల్ (1961) వంటి చిత్రాల్లో నటించారు.1955 నుండి 1984 వరకు 161 సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆమె కెరీర్లో.. కిట్టూరు రాణి చెన్నమ్మ (1961) దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో ఆమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) పురస్కారాలతో సత్కరించింది. అలాగే సరోజా దేవికి కలైమామణి పురస్కారం దక్కింది. అంతేకాకుండా బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.కుటుంబ నేపథ్యంసరోజా దేవి తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అని పేర్లు పెట్టి పోషించారు.చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, ఇంతలోనే సిట్టింగా?

చిక్కుల్లో షేక్ హసీనా కూతురు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు డాక్టర్ సైమా వాజెద్(Saima Wazed) చిక్కుల్లో పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్-ఈస్ట్ ఏషియా ప్రాంతానికి(SEARO) ఆమె రీజియనల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సంగతి తెతలిసిందే. అయితే సొంత దేశంలో అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడంతో.. డబ్ల్యూహెచ్‌వో ఆమెను నిరవధిక సెలవులపై పంపింది.ఇప్పటికే భారత్‌లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పలు అభియోగాలను నమోదు చేసింది. అయితే తాజాగా ఆమె తనయ సైమా వాజెద్పైనా అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆమెను సెలవులపై పంపించిన డబ్ల్యూహెచ్‌వో.. సైమా స్థానంలో డాక్టర్ కాథరినా బూమీ ఇన్ఛార్జిగా కొనసాగుతారని వెల్లడించింది. అయితే ఆమె సెలవుల వ్యవహారంపై ప్రశ్న ఎదురుకాగా.. అదనంగా స్పందించేందుకు డబ్ల్యూహెచ్‌వో నిరాకరించింది. డబ్ల్యూహెచ్‌వో నిర్ణయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసిన ఓ అధికారి.. ఆమెను శాశ్వతంగా తప్పించాలని ఐక్యరాజ్య సమితి విభాగానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూహెచ్‌వో రీజీయనల్ ఆఫీస్ న్యూఢిల్లీలోనే ఉంది. కాథరినా జులై 15వ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. సైమా వాజెద్‌పై అధికార దుర్వినియోగం, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులను బంగ్లాదేశ్ యాంటీ కరప్షన్ కమిషన్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.1972 డిసెంబర్ 9న డా. ఎం.ఎ. వాజేద్ మియా (న్యూక్లియర్ సైంటిస్ట్), షేక్ హసీనా దంపతులకు సైమా వాజెద్ జన్మించారు. ఫ్లోరిడా(అమెరికా) బ్యారీ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో డిగ్రీ, పీజీ చేశారు. ఆర్గనైజేషనల్ లీడర్‌షిప్‌లో డాక్టరల్ చేశారు. స్కూల్ సైకాలజీలో స్పెషలిస్ట్ అయిన ఆమె.. ఆటిజం, మానసిక ఆరోగ్యంపై ఆమె చేసిన ప్రచారాలు అంతర్జాతీయ స్థాయిలో మార్పులకు దారితీశాయి. డబ్ల్యూహెచ్‌వో ఆమె నేతృత్వంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఆమె భర్త ఖండకర్ మస్రూర్ హుస్సేన్ మితు. ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ జంటకు నలుగురు పిల్లలు. అయితే వీళ్లు విడిపోయారంటూ ఆ మధ్య ప్రచారం జరిగినా.. అధికారికంగా ఇద్దరిలో ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: టారిఫ్ వార్‌లో వెనక్కి తగ్గిన ఈయూ?

మహమ్మారి వస్తుంది.. అగ్ని ప్రమాదాలు ఎక్కువే: స్వర్ణలత భవిష్యవాణి
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు ‘రంగం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. తన బిడ్డలను కాపాడుకుంటానని తెలిపారు. అలాగే.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు.అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా పుష్పలత..‘బాలబాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నాను. కానీ ప్రతీ ఏడాది జరిగనట్టే ఈ ఏడాది కూడా ఆటంకం కలిగించారు. ప్రతీ సంవత్సరం చెప్పినప్పటికీ నన్ను లెక్క చేయడం లేదు. నా కోరికను ప్రతీ ఏడాది పక్కన పెడుతున్నారు. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. పూజలు జరిపించకపోతే.. నా కోపానికి మీరు బలి అవుతారు. నా బిడ్డలే కాబట్టి నేను కోపం చూపించడం లేదు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు, నేను అడ్డురాను.నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు. నాకు రక్తం బలి ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఆరగిస్తారు. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు. నాకు సరిగ్గా పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చస్తారు. అందుకే మరణాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త ఉండాలి. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయి’ అని చెప్పారు.

ఏది విధ్వంసం? ఏది ద్రోహం?
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికార తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు సంధించిన ప్రశ్నలు అర్థవంతంగా ఉన్నాయి. గత ముఖ్యమంత్రి జగన్ పేషీలో పనిచేసిన అధికారులు పలువురిపై రాజకీయ ముద్ర వేసి పోస్టింగ్‌లు కూడా ఇవ్వని టీడీపీ ప్రభుత్వం అప్పటి ప్రముఖ కాంట్రాక్టర్లను మాత్రం ఎలా పక్కన బెట్టుకు తిరుగుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూటమి పెద్దలు జవాబు ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రముఖ కాంట్రాక్టర్ మేఘా సంస్థ అధినేత పి.కృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తన హెలికాప్టర్లో తన స్వగ్రామానికి తీసుకెళ్లారని వార్తలొచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా పోలవరం కాంట్రాక్టును నవయుగ సంస్థ నుంచి తప్పించి మేఘాకు ఇచ్చినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. అంతెత్తున విమర్శలు చేసిన వ్యక్తి అధికారం రాగానే ఎలా దగ్గరైపోయాడన్నది బుగ్గన ప్రశ్న!. అందుకే ఆయన దీన్ని ఏ రాజకీయం అంటారో కేశవ్ చెబుతారా? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ నేతృత్వంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇతర ప్రభుత్వ అధికారులు ఏం తప్పు చేశారని ఇప్పుడు వేధిస్తున్నారని నిలదీశారు బుగ్గన. కాంట్రాక్టర్లు.. కొంతమంది పెట్టుబడిదారులతో మాత్రం ఎందుకు అలయ్ బలయ్ నడుపుతున్నారు? ఆర్థిక బంధమే బలమైందన్న విమర్శలకు వీరు ఆస్కారం ఇవ్వడం లేదా! అని మరో విషయాన్ని బుగ్గన ప్రశ్నించారు. ప్రభుత్వ అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే దేశద్రోహం అవుతుందన్న కేశవ్ వ్యాఖ్యలను ప్రస్తావించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులను నిలదీశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కొందరు వైఎస్సార్సీపీ పాలనలో కులాలు, మతాల మధ్య తగాదాలు పెట్టేలా ప్రచారం చేసేవారని, అప్పుడు రాజద్రోహం కేసు పెడితే గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక అక్రమాలపై ప్రశ్నిస్తే దేశద్రోహం అంటున్నారని విమర్శించారు.గత టర్మ్‌లో ఆలయాల వద్ద రచ్చ చేయడం, అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ విషయంలో సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇవేవీ తప్పు కావని కూటమి నేతలు భావిస్తే భావిస్తుండవచ్చు. కానీ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారు చేసిన ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి రూ.1.70 లక్షల కోట్ల అప్పులు చేసిందని అంచనా. దారుణమైన షరతులకైనా ఓకే చెప్పేసి అందుకు అనుగుణంగా జీవోలు ఇచ్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ట్రెజరీ ఖాతాను తాకట్టు పెట్టారు. అది ఎంతవరకు సమర్థనీయమని బుగ్గన, తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి కేశవ్‌లు ఎవరూ సమాధానం ఇవ్వలేదు. కేశవ్ దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయవద్దని వైఎస్సార్సీపీ మద్దతుదారులో, కొందరు నేతలో పెట్టుబడిదారులకు ఈ-మెయిల్స్ పంపుతున్నారని, ఇది దేశద్రోహమని, వారిపై కేసులు పెట్టాలని అంటున్నారు.కేశవ్ చాలాకాలం విపక్షంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయన్న సంగతి కూడా ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. ఫిర్యాదులు చేస్తే రుణాలు ఇవ్వడం ఆగిపోతుందా!. ఆయన చెప్పేదే అభ్యంతరకరమైతే, గత టర్మ్‌లో జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసి, అసత్యాలతో కేంద్రానికి, ఆయా వ్యవస్థలకు ఫిర్యాదు చేసిన వారిపై ముందుగా కేసులు పెట్టాలి కదా అన్న వైఎస్సార్సీపీ నేతల ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి.. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై పచ్చి అబద్దాలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ఫిర్యాదు చేసి వచ్చారు కదా?.చంద్రబాబు, పవన్, లోకేశ్ తదితరులు ఏపీ అప్పు రూ.పది లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లంటూ తప్పుడు లెక్కలు ప్రచారం చేశారు కదా? ఆర్థిక విధ్వంసం అని ఊదరగొట్టారు కదా? అవన్నీ ఏపీ ప్రతిష్టను దెబ్బతీసేవి కాదా! ఏపీకి ఎక్కడ రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అందులో చంద్రబాబు 2014 టర్మ్‌లో చేసిన అప్పు ఎంతో ఎందుకు ఏనాడు చెప్పలేదు? బడ్జెట్లో కేవలం రూ.5.5 లక్షల కోట్ల అప్పేనని కేశవ్ ఎందుకు చదివారు? మళ్లీ బయటకు వచ్చి రూ.పది లక్షల కోట్లు అని ఎలా అంటున్నారు? ఇదంతా రాష్ట్రం బ్రాండ్‌ను చెడగొట్టడం కాదా?. ఈ పని చేసినందుకు ముందుగా కూటమి నేతలపై కదా కేసులు పెట్టాల్సింది?. ఆ పని చేయకుండా వైఎస్సార్సీపీ వారిపై ఆరోపణలు చేస్తే సరిపోతుందా!.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, కరోనా సమయంలో జీతాలు ఆలస్యమైతే కూడా హైకోర్టుకు వెళ్లిందెవరు?. జగన్ ప్రభుత్వం దేనికైనా జీవో ఇచ్చిన మరుసటి రోజే ప్రజా ప్రయోజన వాజ్యం పేరుతో హైకోర్టులో ఎన్ని వందల దావాలు వేశారు?. అదంతా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం కాదా? తమ టైమ్‌లో చేసిన అప్పులను సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించామని, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూ.1.70 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. దీనిపై శ్వేతపత్రం ఇవ్వడానికి కేశవ్ సిద్దపడతారా? అన్నిటికి మించి ట్రెజరీని తాకట్టు పెట్టిన చరిత్ర గతంలో ఎన్నడైనా ఉందా అని ఆయన అడుగుతున్నారు.ఏపీఎండీసీ ఏడు వేల కోట్ల అప్పు తీసుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇస్తే, దానిని ఆర్థిక విధ్వంసం అని ప్రచారం చేసిన టీడీపీ పెద్దలు, ఇప్పుడు ఏకంగా తొమ్మిది వేల కోట్ల అప్పును తీసుకున్నారో లేదో చెప్పాలి కదా! ఇందుకోసం రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టారే. అక్కడితో ఆగకుండా పెట్టుబడిదారులకు సకాలంలో వడ్డీ, వాయిదాలు చెల్లించకపోతే నేరుగా రిజర్వు బ్యాంక్ ఖాతా నుంచి తీసుకోవచ్చని జీవో ఇవ్వడం సరైనదేనా అన్న బుగ్గన ప్రశ్నకు కేశవ్ ఎందుకు జవాబు ఇవ్వలేదు.పైగా ఖనిజాభివృద్ది సంస్థ నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రుణం తీసుకుంటే తాము తొమ్మిది వేల కోట్లు తీసుకున్నామని కేశవ్ గొప్పగా సమర్ధించుకున్నారు. అంటే ఇది ఆర్థిక విధ్వంసం కాదా?. ఏపీలో అక్షరాస్యత పెంచడానికి, చదువులను ప్రోత్సహించడానికి జగన్ అమ్మ ఒడి తదితర స్కీములను పెడితే ఆర్థిక విధ్వంసం అని, శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఆ తర్వాత అదే స్కీమును మరింత ఎక్కువ మందికి ఇస్తామని వాగ్దానం చేశారు. ఒక ఏడాది ఎగవేసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నారు. మరి ఇది ఆర్థిక విధ్వంసం అవుతుందా? కాదా? అన్నది కేశవ్ చెప్పాలి కదా!.ఒకవైపు జగన్ స్కీములను కొనసాగిస్తూ.. మరో వైపు జగన్ టైమ్‌లో విధ్వంసం అంటూ ప్రచారం చేయడం కూటమి నేతలకే చెల్లింది. సూపర్ సిక్స్ సహ పలు హామీలు అమలు చేయమని అడగడం దేశద్రోహం అవుతుందా?. ఎన్నికల ప్రణాళికలో వందల కొద్ది హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయాలనుకోవడం ప్రజాద్రోహం అవుతుందా? కాదా? అన్నది కూటమి నేతలే తేల్చుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

వామ్మో రూ.లక్ష! మళ్లీ రికార్డ్ రేటుకు బంగారం
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఈరోజైనా పుత్తడి ధరలు కిందకి చూస్తాయా అని ఆశించినా కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. తులం (10 గ్రాములు) మేలిమి బంగారం ధర ఏకంగా రూ.లక్ష మార్కును దాటింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.👉 ఇదీ చదవండి: బంగారం ధరలు తగ్గనున్నాయా?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

దారి తప్పుతున్న ఆన్లైన్ ట్రోలింగ్!
‘గివ్ హిమ్ నోబెల్’.. గత కొంత కాలంగా ఈ ఒక్క వాక్యం గ్లోబల్ సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలానే కొన్ని వింత వ్యాఖ్యలు చేయగానే, భారతీయ నెటిజన్లు దాన్ని వినోదాత్మకంగా తీసుకుని ట్రోలింగ్ మంత్రంగా మార్చేశారు. ఇలాంటి ట్రోలింగ్ కల్చర్ ప్రస్తుతం అంతర్జాతీయంగానే కాకుండా నగరంలో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా యాప్స్ అతిగా వినియోగిస్తున్న క్రమంలో ఈ ట్రోలింగ్ పుట్టుకొచ్చి నానా హంగామా చేస్తోంది. సెలబ్రిటీలు, సినిమాలు, క్రీడలు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, రాజకీయాలు ఇలా ఒకటేంటి.. ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం పైనా ట్రోలింగ్ జరుగుతోంది. ఇందులో హ్యూమర్, సెటైర్, సోషల్ కామెంటరీ, ఫన్, సూచనలు తదితర అంశాలు సమ్మిళితంగా ఉంటుంది. సాధారణంగా నగరంలో లక్షల మంది సోషల్ మీడియా యాప్స్ వాడుతున్న వారు ఉండటం, అంతర్జాతీయ అంశాలకు సైతం నగరం వేదికగా ఉండటంతో ఇక్కడ కూడా ట్రోలింగ్ స్థాయి కాస్త ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్న మాట. ట్రోలింగ్ ఒక వినోద మాధ్యమంగా ప్రారంభమై, నేడు ఓ సామాజిక ప్రయోగంగా మారింది. అయినా సరే, ఇది బాధ్యతతో వినియోగించాల్సిన సాధనం. హాస్యం చాటుతూనే, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ వంటి డిజిటల్ నగరాలు ఈ మార్పులకు మార్గదర్శకంగా మారాలని నిపుణుల అభిప్రాయం. స్మార్ట్‌ఫోన్ విప్లవం, డేటా వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికల్లో (ఎక్స్, ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మొదలైనవి) ట్రోలింగ్ ఒక మోడ్రన్ కల్చర్‌లా మారింది. హైదరాబాద్‌లోని మిలీనియల్స్, జెన్–జీ తరాలు ప్రత్యేకించి ట్రోల్స్‌ను వినోదంగా తీసుకుంటూ, వాటిని షేర్ చేయడం ద్వారా మీమ్స్, సెటైర్ వంటి కళలను కొత్త రీతిలో వెలుగులోకి తెస్తున్నారు. మూడు నుంచి ఐదు గంటలు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ విడుదల చేసిన 2024 డిజిటల్ యుసేజ్ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 78 శాతం మంది యువత రోజుకు కనీసం 3–5 గంటల వరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్ ఓ ప్రధాన వినోదపు సాధనంగా మారింది. స్థానిక స్థాయిలో జీహెజ్‌ఎంసీ పనితీరు, ట్రాఫిక్ సమస్యలు, మినిస్టర్ స్టేట్మెంట్లు మొదలుకొని అంతర్జాతీయంగా ట్రంప్, పుతిన్, ఎలాన్ మస్్కల వ్యాఖ్యలు కూడా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. అత్యధికంగా సినిమాలపైనే.. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్ చిత్రం విడుదలైనప్పుడు ‘హనుమాన్‌కి వైఫై ఉంద’ని, థియేటర్లో హనుమాన్కు సైతం ఒక సీట్ వదిలేయాలనే ట్రోల్స్ జోరుగా సాగాయి. నాగ్‌చైతన్య, సమంత విడాకుల సమయంలో కూడా ‘వెడ్డింగ్ టార్గెట్ 2.0’ అనే పేరుతో కొందరి ఎడిటెడ్ పోస్టర్లు చక్కర్లు కొట్టాయి. నేషనల్ క్రష్‌గా మారిన రషి్మక మందన సినిమాలో నటిస్తే అది వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని, పూజా హెగ్దే నటిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందని ఇలాంటి వింత వింత ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు.. ఈ మధ్యనే ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ విపరీతంగా ట్రోల్‌కు గురయ్యారు. తన జెర్సీ నెంబర్ 18, ఈ సారి జరిగిన మ్యాచ్ కూడా 18వ మ్యాచ్ కావడంతో ఇక ట్రోఫీ గెలవరని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే దీనికి విభిన్నంగా 18 ఏళ్ల తరువాత మ్యాచ్ గెలవడంతో ఈ ట్రోలింగ్‌కు తెలపడింది. కానీ మరుసటి రోజు బెంగళూరు వేదికగా విజయోత్సవ వేడుకల్లో భాగంగా అపశృతి జరిగి క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో మరణించడంతో మళ్లీ ట్రోలింగ్ పుంజుకుని ఒక వారం పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇదే ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ ఓడినప్పుడు కూడా.. ‘బిర్యానీ తిని ఆట పై దృష్టి సారించలేరనే’ కామెంట్లతో ట్రోల్ చేశారు. సోషల్‌మీడియా రాజకీయం రాజకీయాల పరంగా సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పారీ్టల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిపుణులను సైతం పెట్టుకుని సోషల్ మీడియా ట్రోలింగ్ మీమ్స్ తయారు చేస్తున్నారు. వీటికి ఫేస్బుక్, ఇన్‌స్టా, ఎక్స్ వేదికల్లో ప్రత్యేక ఖాతాలు, గ్రూపులు సైతం ఆవిష్కరించారు. తెలంగాణలో బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య, ఏపీలో వైఎస్ఆర్సీపీ–టీడీపీ మధ్య ట్రోలింగ్ ఎక్కువగా ఉండగా.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా బీజేపీ పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. గ్లోబల్ వేదికగా.. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో.. నువ్వు ఓకే అను ఏసేద్దాం అంటూ పోకిరి సినిమా డైలాగ్స్‌ను భారత్–ఇజ్రాయెల్ మీమ్స్‌గా తయారు చేసి పాక్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ తెలుగు మీమర్స్ చాలా ఉత్సాహంగా, క్రియేటివ్‌గా ఉన్నారు. ఇదే యుద్ధం సందర్భంగా భారత్–పాక్ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అనే ట్రంప్ స్టేట్మెంట్ ఆధారంగా.. ‘గీవ్ హిమ్ నోబెల్’ అనే ట్రోల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఎలన్ మస్క్ ‘ట్విట్టర్’లో మార్పులపై ‘ఇంతలోనే ట్విట్టర్ మేము మిస్ అవుతున్నాం మస్క్ గారు’ అంటూ ట్రోల్స్ చేశారు. ట్రోలింగ్‌లోనూ రెండు రకాలు.. పాజిటివ్ వర్సెస్ నెగెటివ్ ట్రోలింగ్. పాజిటివ్‌లో హ్యూమరస్, సెటైరిక్ ఎక్కువగా ఉంటూ.. సామాజిక అంశాలపై అవగాహన కలిగించేలా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విఫలతలపై క్రియేటివ్‌గా విమర్శలు, పౌరుల చైతన్యం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. నెగెటివ్ ట్రోలింగ్‌లో బులీయింగ్, మోసం వంటి అంశాలను ఎత్తి చూపుతున్నారు. ఇందులో వ్యక్తిగత జీవితాలపై దూషణలు తారా స్థాయికి చేరాయి. ట్రోల్ పేరుతో హేట్‌స్పీచ్ ఎక్కువ వ్యాప్తిచేస్తున్నారు. కుల, మత, భౌగోళిక అంశాలపైన ఈ ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది.

పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్‌లు తరచూ ఈ అంశంపై ఫోన్లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆంక్షలు?రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్‌హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

డార్క్ క్వీన్ సాన్ రేచల్ కన్నుమూత
ప్రముఖ మోడల్ సాన్ రేచల్ (San Rechal) బలవన్మరణానికి పాల్పడింది. పుదుచ్చేరిలో తన నివాసంలో ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ శనివారం కన్నుమూసింది. పుదుచ్చేరిలో పుట్టిపెరిగిన సాన్ రేచల్.. మోడలింగ్ రంగంలో మిస్ డార్క్ క్వీన్‌గా, మిస్ బెస్ట్ ఆటిట్యూడ్‌గా, మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియా లాంటి టైటిల్స్ గెలుచుకున్నారు. మోడలింగ్ మాత్రమే కాదు.. ఆమె మెడిసిన్ విద్యనూ అభ్యసించారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె.. అధిక డోస్‌లో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యుల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె.. రెండు కిడ్నీలు చెడిపోవడంతో జూలై 12వ తేదీన కన్నుమూసినట్లు సమాచారం.రేచల్ తల్లి ఆమె చిన్నతనంలోనే కేన్సర్‌తో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఆమె పెరిగారు. రంగు గురించి తోటి స్నేహితులు, బంధువులు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె కుంగిపోలేదు. ‘‘రంగులో ఏముందిలే.. కరుపు(నలుపు) కూడా అందమే’’ అనే ఆమె మాటలు మోడలింగ్ రంగంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. అయితే.. View this post on Instagram A post shared by San rechal Gandhi / Pageant Coach (@san_rechal_official)సూసైడ్ నోట్లో.. తన మరణానికి భర్త(ఇటీవలె వివాహం జరిగింది), కుటుంబ సభ్యులు కారణం కాదని ఆమె ఒక లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవమానాలను, ట్రోలింగ్‌ను తట్టుకుని మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న రేచల్.. పాతికేళ్లకే ఇలా తనువు చాలించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.. అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com
'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?
Millets ఆరోగ్య సరి
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
చర్లపల్లి, హైదరాబాద్, విశాఖ... ఈ రోజుల్లో రైళ్లు రద్దు
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
పాకిస్థాన్‌లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్
తిరుమల లడ్డూ కేసు: సిట్ దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి
ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి!
Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
కృష్ణమ్మ ఒడిలో ఇంద్రధనస్సు.. సంతోషాన్ని పంచుకున్న మంగ్లీ (ఫోటోలు)
వైభవ్ ఫెయిల్.. టీమిండియా కెప్టెన్ విధ్వంసకర సెంచరీ
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Karthika Nair: రాధ కూతురి బర్త్‌డే.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి! (ఫోటోలు)
ఏంటి బ్రో? కొంచెం కూడా సోయి లేదా?.. రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?
'కోడిని చూస్తూ చికెన్ తినడం'.. ఆ రోల్ కోట చేయాల్సింది కాదు!
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
'జూనియర్' కోసం శ్రీలీల.. అంత రెమ్యునరేషన్ ఇచ్చారా?
Millets ఆరోగ్య సరి
నిమిష కేసు: చేతులెత్తేసిన కేంద్రం! అంతా మంచి జరగాలంటూ..
చర్లపల్లి, హైదరాబాద్, విశాఖ... ఈ రోజుల్లో రైళ్లు రద్దు
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
పాకిస్థాన్‌లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్
తిరుమల లడ్డూ కేసు: సిట్ దర్యాప్తులో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలి
ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
జబ్బొచ్చినా.. జ్వరమొచ్చినా.. నిలువుదోపిడి!
Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
వైభవ్ ఫెయిల్.. టీమిండియా కెప్టెన్ విధ్వంసకర సెంచరీ
అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఏంటి బ్రో? కొంచెం కూడా సోయి లేదా?.. రాజమౌళికి కోపం తెప్పించిన అభిమాని!
ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?
'కోడిని చూస్తూ చికెన్ తినడం'.. ఆ రోల్ కోట చేయాల్సింది కాదు!
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
సవరణపై వివరణ ఇస్తే నమ్ముతారంటారా?
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
సినిమా

ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'
కామెడీ పండిచడం చాలా కష్టమంటుంటారు. కానీ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) అవలీలగా నవ్వించేయగలరు, గణేశ్ లాంటి సినిమాలతో భయపెట్టనూగలరు. ఇవి రెండూ మిక్స్ చేసేలా భయపెడుతూనే నవ్వించగలరు. 750కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు. జూలై 13న ఫిలిం నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది.భగవంతుడు పిలుస్తాడని అప్పుడే అనుకున్నా..నటుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీతారలు భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాత బండ్ల గణేశ్ సైతం కోట ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించాడు. కొద్దిరోజుల క్రితమే ఆయన్ను కలిశానని, అప్పుడు ఆయన పరిస్థితి చూడలేకపోయానన్నాడు. భగవంతుడు పిలుస్తాడని ఆరోజే అనుకున్నానని మీడియాతో మాట్లాడాడు. కోటగారంటే ఇష్టమని, ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందంటూ నటుడి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.బండ్ల గణేశ్ పోస్ట్అయితే అదే రోజు బండ్ల గణేష్ ఓ పోస్ట్ పెట్టగా.. దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలారోజుల తర్వాత స్నేహితులు ఇంటికొచ్చి కలిశారంటూ ఎక్స్ (ట్విటర్)లో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో శ్రీకాంత్, శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ ఉన్నారు. వీళ్లందరూ వినోదం సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. దీంతో ఇది చూసిన నెటిన్లు.. మీరందరూ వినోదం సినిమాకు సీక్వెల్ తీయండి, బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు.నెటిజన్స్ ఫైర్అయితే కొందరు మాత్రం.. పెద్దాయన (కోట శ్రీనివాసరావు) పొద్దున్నే కదా చనిపోయింది. మీరప్పుడే సిట్టింగ్ మొదలుపెట్టారా?, కానీ గ్లాసులు దాచేసి భలే కవర్ చేశారు, అయినా కోటగారు మరణించారన్న బాధ మీకు కాస్తయినా ఉంటే కదా? అని ఆగ్రహిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఫ్రెండ్స్ కలిస్తే తప్పేముందని, దానికి విమర్శలు చేయడమెందుకని బండ్ల గణేశ్‌ను సమర్థిస్తున్నారు.చదవండి: Jr NTR: తెలుగు ఇండస్ట్రీకి కోట శ్రీనివాసరావు ఒక్కరే.. మళ్లీ ఇంకో కోట పుట్టరు, రారు..

ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత
ప్రముఖ నటి, అభినయ సరస్వతి బి.సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం (జూలై 14న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి (1959), జగదేక వీరుని కథ, సీతారామ కల్యాణం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, శకుంతల, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, సీతారామ వనవాసం, దాన వీర శూర కర్ణ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.200కి పైగా సినిమాలుబీ సరోజాదేవి (B.Saroja Devi) 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. "అభినయ సరస్వతి" అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభమైంది. పాండురంగ మహత్యం (1957) ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. నాడోడి మన్నన్ (1958) ఆమెను తమిళ చిత్రసీమలో స్టార్‌గా నిలిపింది. హిందీలో పైఘామ్ (1959), ససురాల్ (1961) వంటి చిత్రాల్లో నటించారు.1955 నుండి 1984 వరకు 161 సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆమె కెరీర్లో.. కిట్టూరు రాణి చెన్నమ్మ (1961) దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో ఆమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) పురస్కారాలతో సత్కరించింది. అలాగే సరోజా దేవికి కలైమామణి పురస్కారం దక్కింది. అంతేకాకుండా బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.కుటుంబ నేపథ్యంసరోజా దేవి తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అని పేర్లు పెట్టి పోషించారు.చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, ఇంతలోనే సిట్టింగా?

మరో కోట శ్రీనివాసరావు పుట్టరు, రారు: ఎన్టీఆర్ ఎమోషనల్
లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం తనను ఎంతగానో కలిచివేసిందంటున్నాడు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోటతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.శకం ముగిసిందిజూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మరణంతో ఒక శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో ఆయనతో కలిసి పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మహనీయుడైన నటుడితో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఎక్కడున్నా తన చల్లని చూపు మనందరిపై ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.కోట శ్రీనివాసరావు ఒక్కరేయాక్టింగ్ ఇండస్ట్రీకి, నటనకు నిలువెత్తురూపం కోట శ్రీనివాసరావుగారు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక్కరే.. మరో కోట పుట్టరు, రారు! అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన మనకు మిగిల్చి వెళ్లిన ఎన్నో అద్భుతమైన పాత్రల్ని, సినిమాలను ప్రేక్షకులు చూసి ఆస్వాదించండి అంటూ తారక్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా 750కి పైగా సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు ఆదివారం (జూలై 13న) కన్నుమూశారు.చదవండి: Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?

షూటింగ్లో ఆర్టిస్ట్ మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్
ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వెట్టువన్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని కిళైయూర్ కావల్ సరగమ్ సమీపంలో విళుందమావడి గ్రామంలో గత మూడు రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం షూటింగ్లో పాల్గొన్న మోహన్ రాజు అనే స్టంట్ కళాకారుడు కారులో నుంచి బయటకు దూకుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.స్టంట్ కళాకారుడు మృతివెంటనే అతన్ని నాగపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రాజు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన స్టంట్ కళాకారుడు మోహన్ రాజు వయసు 52 ఏళ్లు. ఈయన మృతి వెట్టువన్ చిత్ర యూనిట్నే కాకుండా సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టంట్ కళాకారుడు మోహన్ రాజు మృతి పట్ల హీరో విశాల్ (Vishal) సంతాపం ప్రకటించారు.ప్రమాదకర స్టంట్లుసినిమా షూటింగ్లో కారులో నుంచి దూకుతూ స్టంట్ కళాకారుడు రాజు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. రాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎంతో ధైర్యశాలి. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కేవలం ఒక్క ట్వీట్ చేసి నా పని నేను చేసుకోలేను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.ఫైట్ మాస్టర్ ట్వీట్ఫైట్ మాస్టర్ సిల్వ స్టంట్.. రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయాం. స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. అతడిని మిస్ అవుతున్నాం అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు.So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…— Vishal (@VishalKOfficial) July 13, 2025 One of our great car jumping stunt Artist S M Raju Died today while doing car stunts 😭😭RIPOur stunt union and Indian film industry ll be missing Him😭😭 pic.twitter.com/9Qr7Zg8Dbb— silva stunt (@silvastunt) July 13, 2025చదవండి: సకల సినీ పాత్రలకు పెట్టని కోట
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

SL Vs BAN: శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. నిన్న (జులై 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (50 బంతుల్లో 76; ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో.. తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్), షమీమ్ హొసేన్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించారు. వీరు మినహా మిగతా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తంజిద్ హసన్ 5, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 0, మెహిది హసన్ మిరాజ్ 1, జాకెర్ అలీ 3, సైఫుద్దీన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో బినుర ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మహీశ్ తీక్షణ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. బంగ్లాదేశ్ బౌలర్లు ఊహించని రీతిలో రెచ్చిపోవడంతో 15.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కేవలం పథుమ్ నిస్సంక (32), దసున్ షనక (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కుసాల్ మెండిస్ 8, కుసాల్ పెరీరా 0, అవిష్క ఫెర్నాండో 2, అసలంక 5, చమిక కరుణరత్నే 0, వాండర్సే 8, తీక్షణ 6, బినుర 6 పరుగులకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, షోరీఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో 2, ముస్తాఫిజుర్, మెహిది హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టీ20 కొలొంబో వేదికగా జులై 16న జరుగనుంది. కాగా, టీ20 సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లను శ్రీలంక కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో.. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ శ్రీలంకలో పర్యటిస్తుంది.

చరణి శ్రీకారం
ప్రాక్టీస్ సెషన్‌కు అందరికంటే ముందు హాజరవడం... శిక్షణ ముగిసిన తర్వాత కూడా ‘ఇంకొక్క బాల్ వేస్తా’ అంటూ కొనసాగించడం... అనుకున్న స్థానంలో బంతి వేసేంత వరకు అలుపెరగకుండా సాధన సాగించడం... వెరసి ఆ అమ్మాయిని ప్రత్యేకంగా నిలిపాయి! ఏజ్ గ్రూప్ టోర్నీలంటే ఏంటో తెలియకుండా... అండర్–19 ఊసే లేకుండా... నేరుగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆడే అవకాశం దక్కించుకున్న ఆ అమ్మాయి... ఆడింది రెండు మ్యాచ్‌లే అయినా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో జాతీయ జట్టు నుంచి పిలుపు రాగా... అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో కట్టిపడేసింది. భిన్నమైన పిచ్‌లపై మరింత ప్రభావం చూపగలదని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తే ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి టి20 సిరీస్‌లో 10 వికెట్లతో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిపై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడావిభాగం : టి20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై చెప్పుకోదగ్గ రికార్డులేని భారత జట్టు... ఈ పర్యటనలో భాగంగా ఆడిన తొలి టి20లో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టి20లో స్మృతి మంధాన సెంచరీతో చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోరు చేయగా... ఛేదనలో ఇంగ్లండ్ చేతులెత్తేసింది. ‘శత’క్కొట్టిన స్మృతికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా... ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన శ్రీచరణి 4 వికెట్లతో అదరగొట్టింది. అయితే మంధాన మెరుపుల ముందు శ్రీచరణి బౌలింగ్ వాడి వెలుగులోకి రాలేదు. బ్రిస్టల్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ మొదట టీమిండియా మంచి స్కోరు చేయగా... ఛేదనలో ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన ఘనత ఆంధ్ర ప్లేయర్‌దే. 4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు విజయానికి దూరమైంది.మూడో మ్యాచ్‌లోనూ నిలకడ కొనసాగించిన శ్రీ చరణి మరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టి20లోనూ మరో 2 వికెట్లు తీసింది. ఆఖరి పోరులో వికెట్ పడగొట్టలేకపోయినా... ఓవరాల్‌గా ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసిన శ్రీచరణి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం చేసుకుంది. అనూహ్య అవకాశం... ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ ఆరంభానికి ముందు దీప్తి శర్మ, రాధ యాదవ్ వంటి సీనియర్ స్పిన్నర్లు జట్టులో ఉండటంతో శ్రీ చరణికి అసలు తుది జట్టులో చోటు దక్కుతుందా అనే అనుమానాలు రేకెత్తగా... సిరీస్ ముగిసే సమయానికి నైపుణ్యం గల బౌలర్ అనే స్థాయికి ఎదిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి చిన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ప్రారంభించిన ఆట తనను అందలం ఎక్కిస్తుందని ఏ దశలోనూ ఊహించలేదు. జాతీయ జట్టు తరఫున నిలకడగా రాణించడమే తన లక్ష్యమని 20 ఏళ్ల శ్రీచరణి అంటోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్... కెరీర్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్ కావాలని భావించింది. తగినంత ఎత్తు, అందుకు తగ్గ శరీర సౌష్టవం ఆమెను ఆ దిశగా ప్రోత్సహించగా... ఆంధ్రప్రదేశ్ హెడ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఆమెను స్పిన్ వైపు అడుగులు వేయించాడు. అపార ప్రతిభ ఉన్న శ్రీచరణికి ఆరంభంలో ఏదీ కలిసి రాలేదు. దీంతో అండర్–19 జట్టులో ఆమెకు చోటు దక్కలేదు. అయినా ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని ఈ లెఫ్ట్ హ్యాండర్... వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ రోజురోజుకు మరింత మెరుగైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చొరవతో... డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన హైదరాబాద్ మాజీ కెపె్టన్ అనన్య ఉపేంద్రన్ దృష్టిలో పడటంతో శ్రీచరణి దశ తిరిగింది. 2022 టి20 చాలెంజర్ ట్రోఫీలో చరణి బౌలింగ్‌ను గమనించిన అనన్య... ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని ముందే ఊహించింది. ‘ఆ టోర్నీ మొత్తంలో శ్రీచరణి ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది. మెరుగైన బౌలింగ్ యాక్షన్‌కు తోడు... బంతి మీద మంచి నియంత్రణ ఉండటం ఆమె బలం. ఇక మిగిలిన స్పిన్నర్లతో పోల్చుకుంటే కాస్త వేగంగా బంతులు వేస్తుండటంతో... ప్రత్యర్థులు షాట్లు ఆడలేక పోయేవారు. ఇంత ప్రతిభ ఉన్న అమ్మాయిని ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్–19 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి శరీర సౌష్టవం ఉండటంతో గాల్లోనే బంతిని తిప్పగల సహజ ప్రతిభ ఆమెకు అబ్బింది’అని అనన్య వెల్లడించింది. ఆ తర్వాత అనన్య ప్రోత్సాహంతో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అవకాశం దక్కించుకున్న శ్రీచరణి ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టింది. ఈ దెబ్బతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తెలుగమ్మాయి... ముక్కోణపు టోర్నీలో భాగంగా శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో రెండు వికెట్లతో సత్తా చాటింది. ఇప్పటి వరకు 5 వన్డేలు ఆడిన శ్రీచరణి 6 వికెట్లు పడగొట్టి భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. సుదీర్ఘ కాలం ఆడాలనే లక్ష్యంతో... ఈ ఏడాది సొంతగడ్డపై ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు తమ బలాన్ని పెంపొందించుకోవాలని భావిస్తుండగా... అందులో భాగంగా యువ ప్రతిభకు విరివిగా అవకాశాలు ఇస్తోంది. అలా జట్టులోకి వచ్చిన శ్రీ చరణి ఇప్పటి వరకైతే తనమీద పెట్టుకున్న అంచనాలను అందుకుంది. మరి ఏడాది వ్యవధిలో ఇటు వన్డే ప్రపంచకప్ అటు టి20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో శ్రీచరణి ఇదే నిలకడ కొనసాగిస్తే మెగా టోర్నీల్లో పాల్గొనడం ఖాయమే. ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా... ఆమె సాధన చేసే తీరు, బంతిని సంధించే విధానం శ్రీ చరణిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కెరీర్ ఆరంభంలోనే అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లతో కలిసి ఆడటం తనకు కలిసొచ్చిందని చరణి పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పేదని దాని వల్ల తన పని సులువైందని ఆమె వెల్లడించింది. ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీచరణి... పరిస్థితులను త్వరగా ఆకళింపు చేసుకొని అందుకు తగ్గట్లు బంతులు వేస్తుందని భారత మహిళల జట్టు బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ చెప్పాడు. స్వతహాగా సిగ్గరి అయిన శ్రీచరణి అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది.

నాలుగో రౌండ్లో హంపి, దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5తో కులోన్ క్లౌడియా (పోలాండ్)పై, దివ్య 1.5–0.5తో టియోడోరా ఇంజాక్ (సెర్బియా)పై విజయం సాధించారు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్‌లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను ఓడించింది. ఇంజాక్‌తో జరిగిన రెండో గేమ్‌ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌ను హంపి 102 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇంజాక్‌తో జరిగిన గేమ్‌లో దివ్య 39 ఎత్తుల్లో గెలిచింది. మూడో రౌండ్‌లోని రెండు గేమ్‌లు ముగిశాక భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక–స్టావ్‌రూలా (గ్రీస్), వంతిక అగర్వాల్–కాటరీనా లాగ్నో (రష్యా), వైశాలి–కరిస్సా యిప్ (అమెరికా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో ఈరోజు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు.

జ్యోతి యర్రాజీ సర్జరీ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: గాయంతో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.96 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గిన జ్యోతి... ప్రాక్టీస్ సందర్భంగా గాయపడింది. దీంతో పోటీలకు దూరమైన జ్యోతి... తాజాగా యాంటిరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్)కు సర్జరీ చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రముఖ వైద్యుడు దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపింది. ‘గత కొన్ని వారాలు భారంగా గడిచాయి. గాయం కారణంగా అమితంగా ఇష్టపడే అథ్లెటిక్స్‌కు దూరంగా ఉండాల్సి రావడం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ శుక్రవారం సర్జరీ విజయవంతంగా పూర్తైంది. కష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, భారత అథ్లెటిక్స్ సమాఖ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే తిరిగి కోలుకుంటా. రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్‌పై అడుగుపెట్టాలని భావిస్తున్నా’ అని జ్యోతి పేర్కొంది. ఇటీవల నిలకడగా రాణిస్తున్న జ్యోతి... టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని ఆశించినా... ఇప్పుడది సాధ్యపడేలా లేదు. వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ 12.73 సెకన్లు కాగా... జ్యోతి నేరుగా ఈ అవకాశం దక్కించుకోకపోయినా ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమెకు ఈ మెగా టోర్నీలో అవకాశం దక్కేది.
బిజినెస్

హోమ్ ఫైనాన్స్‌కు రూ.858 కోట్ల రుణం
ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) నుంచి రూ.858 కోట్ల (100 మిలియన్లు) రుణాన్ని పొందినట్లు ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ సంస్థ శనివారం తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు సొంతింటి ఏర్పాటు అవకాశాలు మెరుగుపరిచే లక్ష్య సాధనలో ఏబీబీ నుంచి నిధులు అందడం ఒక కీలక ఘట్టం’’ అని ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ సీఈవో మోను రాత్రా తెలిపారు.ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ భాగస్వామ్యం ద్వారా భారత గృహ నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల భవనాలు (గ్రీన్ బిల్డింగ్) ప్రమాణాలు మరింత మెరుగుతాయని ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ గ్రెగొరీ లియు తెలిపారు. ఏఐఐబీ నుంచి పొందిన నిధులు దేశ అఫర్డబుల్ హౌసింగ్ వ్యవస్థలో డిమాండ్‌తోపాటు సరఫరా సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయని ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ భావిస్తోంది.డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోని ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహ రుణ వితరణను మరింత పెంచనుంది. ఇక సప్లయిపరంగా అందుబాటు ధరల్లో గృహాలు అభివృద్ధి చేసే హౌసింగ్ డెవలపర్లకు ఫైనాన్స్ సాయం అందించనుంది.

దేశీ ఫుట్‌వేర్ రంగంపై విదేశీ కన్ను
దేశీ నాన్‌లెదర్ ఫుట్‌వేర్ రంగంలో పెట్టుబడులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు లెదర్ ఎగుమతుల మండలి(సీఎల్ఈ) చైర్మన్ ఆర్కే జలాన్ పేర్కొన్నారు. ప్రధానంగా తైవాన్, వియత్నాం కంపెనీలు ముందున్నట్లు తెలియజేశారు. అయితే ఇందుకు ప్రభుత్వ మద్దతు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. తైవాన్, వియత్నాం దేశాల సంస్థలు చైనా తదితర దేశాల నుంచి షూ సోల్స్, మౌల్డ్స్, మెషీనరీ, ఫ్యాబ్రిక్స్ తదితర ప్రొడక్టులను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.వెరసి ఈ రెండు దేశాల కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలియజేశారు. ఆయా సంస్థలకు మద్దతిస్తే తయారీకి అవసరమయ్యే నాన్‌లెదర్ సంబంధ ఫుట్‌వేర్ ప్రొడక్టులను సులభంగా దిగుమతి చేసుకోగలుగుతాయని వివరించారు. భారత్ నుంచి పటిష్టస్థాయిలో ఎగుమతులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.గతేడాది(2024–25) 5.75 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదైనట్లు ప్రస్తావించారు. వీటిలో యూఎస్‌కు అత్యధికంగా 95.7 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని, వీటి వాటా 20 శాతమని తెలియజేశారు. తదుపరి 11 శాతం వాటాతో యూకే, జర్మనీ నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తే ఎగుమతులు పుంజుకోవడంతోపాటు.. మరింత ఉద్యోగ కల్పనకు వీలుంటుందని వివరించారు.

క్యూ1 ఫలితాలే దిక్సూచి
(క్యూ1) ఫలితాలతోపాటు.. ఇటు ఆర్థిక గణాంకాల ఆధారంగా కదిలే వీలుంది. ఈ వారం పలు టెక్ దిగ్గజాల క్యూ1 పనితీరు వెల్లడికానుండగా.. టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, మార్కెట్లపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... గత వారం చివర్లో డీలా పడిన దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కన్సాలిడేషన్ బాటలో సాగే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు ఆల్మండ్ గ్లోబల్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ నిపుణులు సిమ్రన్‌జీత్ సింగ్ భాటియా తెలియజేశారు. గత వారం ఐటీ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ క్యూ1 పనితీరుతో సీజన్‌కు తెరతీసింది. ఫలితాలు, అంచనాలు నిరాశపరచడంతో వారాంతాన టీసీఎస్సహా ఇతర ఐటీ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఈ వారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రోతోపాటు.. ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్, మెటల్ రంగ బ్లూచిప్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితరాలు క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో మార్కెట్ ఆటుపోట్ల మధ్య ఫలితాల ఆధారంగా కొన్ని కౌంటర్లు వెలుగులో నిలవవచ్చని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ధరల గణాంకాలు.. గత(జూన్) నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(14న) విడుదలకానున్నాయి. మే నెలకు డబ్ల్యూపీఐ 0.39 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో నమోదైన 0.85 శాతంతో పోలిస్తే తగ్గింది. ఈ బాటలో జూన్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం 15న ప్రకటించనుంది. మే నెలలో సీపీఐ 2019 ఫిబ్రవరి తదుపరి కనిష్టంగా 2.82 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో నమోదైన 3.16 శాతంతో పోలిస్తే వెనకడుగు వేసింది. ధరల గణాంకాలు రిజర్వ్ బ్యాంక్ చేపట్టే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. దీంతో వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దేశీయంగా క్యూ1 ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపనుండగా.. ధరల గణాంకాలు సైతం సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ట్రేడ్ డీల్‌పై దృష్టి యూఎస్, భారత్ మధ్య ఇటీవల ప్రారంభమైన వాణిజ్య టారిఫ్‌ల చర్చలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా తదితర పలు దేశాల దిగుమతులపై వివిధ స్థాయిల్లో టారిఫ్‌లను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్, భారత్ వాణిజ్య ఒప్పందంతోపాటు.. ఇతర దేశాలతో ట్రంప్ టారిఫ్ చర్చలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్ల కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వారం యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, చైనా జీడీపీ వివరాలు వెల్లడికానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య టారిఫ్‌ల అనిశి్చతులకుతోడు.. రాజకీయ, భౌగోళిక వివాదాలు కొనసాగుతుండటం సెంటిమెంటును దెబ్బతీయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని అభిప్రాయపడ్డారు.సాంకేతికంగా చూస్తే..గత వారం ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కీలకమైన ఇంటర్మీడియెట్ మద్దతులను కోల్పాయాయి. నిజానికి మొదటి మూడు రోజులు స్థిరంగా కదిలినప్పటికీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలు, టారిఫ్‌లపై అనిశి్చతి, ఎఫ్‌పీఐల అమ్మకాలు దెబ్బతీసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంచనా వేసినట్లు నిఫ్టీ బ్రేకవుట్ సాధించి 25,500కు చేరినప్పటికీ ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. వారాంతాన 25,150కు క్షీణించింది. దీంతో స్వల్ప కాలంలో 24,800–24,700కు నీరసించే వీలుంది. వెరసి 25,400–25,500 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఇదేవిధంగా సెన్సెక్స్ 82,500కు జారింది. దీంతో 81,500–81,000 స్థాయిలో సపోర్ట్ తీసుకునే అవకాశముంది. 82,800–83,050 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చునని నిపుణలు విశ్లేíÙంచారు.గత వారమిలా.. గత వారం(7–11) దేశీ స్టాక్ మార్కెట్లు తొలి అర్ధభాగంలో బలపడినప్పటికీ చివర్లో డీలా పడ్డాయి. వాణిజ్య టారిఫ్ వివాదాలు, నిరుత్సాహకర టీసీఎస్ ఫలితాలు ప్రభావం చూపాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 932 పాయింట్లు(1.1 శాతం) క్షీణించింది. 82,500 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 311 పాయింట్లు(1.2 శాతం) నీరసించింది. 25,150 వద్ద స్థిరపడింది. – సాక్షి, బిజినెస్ డెస్క్

ఔట్ పేషెంట్ ప్లాన్.. నో టెన్షన్!
అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకెళ్తే వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాతే పరిష్కారం సూచిస్తుంటారు. కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు, మందులకు కలిపి ఎంతలేదన్నా రూ.2,000–5,000 మధ్య ఖర్చు చేయాల్సిందే. నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదిలో ఇలా వైద్యుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఊహించలేం. ఈ రూపంలో ఎంత ఖర్చు ఎదురవుతుందో అంచనా వేయలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నా కానీ, కేవలం హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలకే (ఇన్ పేషెంట్ కవర్) అధిక శాతం పాలసీలు కవరేజీ అమలు చేస్తుంటాయి. జీనవశైలి వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయిన తరుణంలో.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) కవరేజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది ఉంటే ఊహించని ఖర్చును కొంత వరకు తట్టుకోవచ్చు. ఓపీడీ ప్లాన్లలో సదుపాయాలు, వీటి కోసం ఎంత ఖర్చవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సగటు ద్రవ్యోల్బణం మించి వైద్యుల కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు పెరుగుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఓపీడీపై దేశ ప్రజలు చేసిన ఖర్చు 37.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని (రూ.3.20 లక్షల కోట్లు సుమారు) ‘ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్’ అంచనా వేసింది. ఈ ఖర్చులో రిటైల్ ఓపీడీ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించింది కేవలం 0.1 శాతమే. అంటే దాదాపు 99.9 శాతం మంది ఓపీడీ కవరేజీకి దూరంగా ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా వాటిల్లో ఓపీడీ కవరేజీ ఒక సదుపాయంగా ఉండదు. ఓపీడీకి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో బీమా కంపెనీలు ఇప్పుడు ఈ కవరేజీని సైతం ఇన్‌పేషెంట్ కవర్‌తోపాటు ఆఫర్ చేస్తున్నాయి. ఓపీడీ ప్లాన్లలో కవరేజీ.. ఓపీడీ కవరేజీ ఇన్‌బిల్ట్‌గా కలిగిన హెల్త్ ప్లాన్లు కొన్నే ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ఓపీడీ కవర్‌ను యాడాన్ కింద అందిస్తున్నాయి. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా.. వైద్యుల వద్దకు వెళ్లి సమస్యల గురించి చెప్పి, తీసుకుని వెళ్లిపోయే చికిత్సా సలహాలు ఓపీడీ కిందకు వస్తాయి. ‘‘ఓపీడీ కవర్ కింద ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల కన్సల్టేషన్ చార్జీ (డాక్టర్ ఫీజు)లను బీమా సంస్థలు చెల్లిస్తాయి. రెగ్యుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పాలసీదారు హాస్పిటల్ పాలైతే తప్పించి వీటికి పరిహారం రాదు’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ పార్థాని ఘోష్ తెలిపారు. కాకపోతే ఇలా వైద్యుల ఫీజులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్స్‌కు చెల్లింపుల పరంగా ఓపీడీ కవర్లో కొన్ని పరిమితులు ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా నగదు రహిత విధానంలో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ ఓపీడీ చెల్లింపులకు బీమా సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. బీమా సంస్థలకు ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. కనుక వీటికి అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి.నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్నా బీమా సంస్థలు అనుమతిస్తుంటాయి. కానీ, నాన్నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో ఓపీడీ చెల్లింపులకు కొన్ని బీమా సంస్థలు అంగీకరించడం లేదు. ఇందులో మోసాల రిస్క్ ఉంటుందని, రీయింబర్స్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఓపీడీ కవరేజీని పూర్తిగా నెట్వర్క్ ఆస్పత్రులకే పరిమితం చేస్తున్నాయి. ప్రీమియం.. పరిమితులు → ఐసీఐసీఐ లాంబార్డ్ ‘ఎలివేట్’ అన్నది ఓపీడీ రైడర్. 35 ఏళ్ల వ్యక్తి రూ.10,000 వార్షిక కవరేజీకి చెల్లించాల్సిన ప్రీమియం రూ.4,980. నగదు రహిత విధానంలో ఈ →పనిచేస్తుంది. ఎలాంటి ఉప పరిమితుల్లేవు. → బజాజ్ అలియాంజ్ ‘హెల్త్ ప్రైమ్’ రూ.15,000 కవరేజీకి రూ.2,062 ప్రీమియంను (35 ఏళ్ల వ్యక్తికి) వసూలు చేస్తోంది. → నివా బూపా ‘అక్యూట్ బెస్ట్ కేర్’ ప్లాన్ సైతం నగదు రహిత, రీయింబర్స్మెంట్ విధానంలో కవరేజీని ఆఫర్ చేస్తోంది. రూ.10,000 కవరేజీకి రూ.4,801 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. → నివా బూపా వెల్ కన్సల్ట్ ఓపీడీ ప్లాన్ 20 శాతం కోపేమెంట్ను రీయింబర్స్‌మెంట్‌కు అమలు చేస్తోంది. → స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ కవర్‌ను.. ప్రమాదాలకు సంబంధించి చికిత్సలకు నగదు రహిత, రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌లను అనుమతిస్తోంది. ఈ ప్లాన్ రూ.25,000 కవరేజీకి రూ.4,802 ప్రీమియం వసూలు చేస్తోంది. ‘‘సంప్రదాయంగా చూస్తే ఓపీడీ ప్లాన్లలో డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లుల పరంగా ఉప పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు ఓపీడీ సమ్ ఇన్సూర్డ్ రూ.20,000 ఉండొచ్చు. అయినప్పటికీ, ఫార్మసీ (ఔషధాలు)కి సంబంధించి రూ.5,000 ఉప పరిమితిగా ఉండొచ్చు. అయితే కవరేజీని తమ అవసరాల మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఉప పరిమితుల్లేని ప్లాన్లను సైతం బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి’’ అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. ఓపీడీ కవర్ తీసుకునే ముందు ఉప పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తమకు అప్పటికే జీవనశైలి వ్యాధులు ఉంటే, వాటికి సైతం చెల్లింపులు చేసే విధంగా చూసుకోవాలి. కొన్ని ఓపీడీ ప్లాన్లలో ఏడాదిలో వైద్యుల కన్సల్టేషన్లు గరిష్టంగా ఇన్ని పర్యాయాలు మాత్రమే అన్న పరిమితులు కూడా ఉంటున్నాయి. కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రులు కాకుండా వేరే చోటు తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు.ఇతర ప్లాన్లు బీమా కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక ఓపీడీ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో లివ్‌లాంగ్ ఇన్సూరెన్స్ ఒకటి. దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థల తరఫున ఓపీడీ కవర్ సేవలను ఆఫర్ చేస్తోంది. రూ.15,000 కవరేజీకి రూ.5,500, రూ.16,000 కవరేజీకి రూ.6,000, రూ.28,800 కవరేజీకి రూ.11,599 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ తరహా సంస్థల ఓపీడీ ప్లాన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఎన్నో ఉచిత ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. లివ్‌లాంగ్ ‘ఎల్డర్‌కేర్’ ఓపీడీ ప్లాన్ కోసం 66 ఏళ్ల గీత ఏడాదికి రూ.12,000 ప్రీమియం చెల్లిస్తోంది. ఇందులో ఔషధాలు, డయాగ్నోస్టిక్స్ చార్జీలకు ఏడాదిలో గరిష్ట చెల్లింపులు రూ.3,000కు పరిమితం. అయినప్పటికీ 83 ప్యారామీటర్లతో కూడిన ఫుల్‌బాడీ చెకప్, వైద్యులు, పోషకాహార నిపుణులతో అపరిమిత కన్సల్టేషన్లు, ఏడాదిలో ఆరు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు ఏడాదిలో రెండు ఉచిత అంబులెన్స్ సరీ్వసులను సైతం వినియోగించుకునే సదుపాయం ఇందులో ఉంది. ‘ఈవెన్ హెల్త్‌కేర్’ కంపెనీ సైతం మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో కలసి ఓపీడీ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది. కాకపోతే దీన్ని విడిగా రైడర్ కింద కాకుండా.. ఇండెమ్నిటీ కవర్‌కు యాడాన్‌గా ఆఫర్ చేస్తోంది. రూ.10 లక్షల వరకు ఓపీడీ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా 35 ఏళ్లలోపు వారికి ఏడాదికి రూ.4,500, 36–49 ఏళ్లలోపు వారికి రూ.10,000, 50 ఏళ్లు మించిన వారికి రూ.19,000 చార్జ్ తీసుకుంటోంది. ఓపీడీలో క్లెయిమ్స్ ఎక్కువ. అందుకే ప్రీమియం కూడా ఎక్కువే. ‘ఓపీడీ కవర్లో ప్రతి రూ.100 రక్షణ కోసం చెల్లించే ప్రీమియం రూ.50 వరకు ఉంటుంది. ఈ మేరకు పొదుపు చేసుకోవచ్చు’ అని సెక్యూర్‌నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. ఉచిత హెల్త్ స్క్రీనింగ్, చెకప్‌ల ద్వారా ఇవి వ్యాధి నివారణను ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఓపీడీ రక్షణ ఉంటే.. ఎన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా నిశ్చింతగా ఉండొచ్చన్నారు.పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్ కొన్ని బీమా సంస్థలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఓపీడీ కవరేజీని గ్రూప్ ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్నాయి. నోయిడాకు చెందిన అన్మోల్ ఓ ఆరి్థక సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేసే సంస్థ నుంచి తనకు, తన తల్లిదండ్రులకు కలిపి ఓపీడీ ప్లాన్ తీసుకున్నాడు. ఏడాదికి కవరేజీ రూ.21,000 కాగా, రూ.11,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అన్మోల్కు 10 శాతం, అతడి తల్లిదండ్రులకు 20 శాతం కో–పే షరతు ప్లాన్‌లో భాగంగా ఉంది. అంటే ప్రతీ బిల్లులోనూ ఈ మేరకు అన్మోల్ సొంతంగా చెల్లించుకోవాలి. అయినప్పటికీ ఏటా రూ.18,000 విలువైన ఓపీడీ ప్రయోజనాలను తాను పొందుతున్నట్టు తెలిపాడు. అంటే ప్రీమియం చెల్లింపులు పోను అతడికి నికర మిగులు రూ.7,000గా ఉందని అర్థమవుతోంది. కొన్ని సంస్థలు అయితే ఉచితంగానే తమ ఉద్యోగులకు ఓపీడీ కవర్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఓపీడీ ప్లాన్లు కళ్లు, దంత సంబంధిత చికిత్సలకు సైతం కవరేజీనిస్తున్నాయి. ఇలా చేస్తే మెరుగు.. → ఓపీడీ కవర్లో భాగంగా వచ్చే ఉచిత హెల్త్ చెకప్‌లు, టెలీ కన్సల్టేషన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. → నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో సులభంగా సేవలు పొందొచ్చు. రీయింబర్స్మెంట్ విధానంలో అయితే అన్ని బిల్లులను జాగ్రత్తపరిచి క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తుంది. నగదు రహిత విధానంలో అయితే ఈ ప్రహసనం తప్పించొచ్చు. → ఉప పరిమితులను జాగ్రత్తగా గమనిస్తూ, గరిష్ట పరిమితి మేరకు ఉపయోగించుకోవాలి. → ఓపీడీ కవర్‌ను రెన్యువల్ సమయంలో సమీక్షించుకోవాలి. కవరేజీ చాలకపోయినా.. ప్లాన్ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు, ఉప పరిమితులు అంత అనుకూలంగా అనిపించకపోయినా మెరుగైన ప్లాన్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఓపీడీ ప్లాన్ తీసుకోవచ్చా..? తరచూ వైద్యుల సలహాలు, చికిత్సల కోసం వెళ్లే వారికి ఓపీడీ ప్లాన్లు ఉపయోగకరం. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు వీటిని తీసుకోవచ్చు. ‘‘ఆరోగ్యవంతులైన వ్యక్తులకు సైతం ఓపీడీ కవర్ ప్రయోజకరమే. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాలను తొలి దశలోనే గుర్తించొచ్చు’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, బిజినెస్ హెడ్ ఆశిష్ యాదవ్ సూచించారు. బీమా సంస్థ ఆఫర్ చేసే నగదు రహిత ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను కూడా చూడాలి. ఓపీడీ ప్లాన్లలో తమకు నచ్చిన వైద్య నిపుణుడి వద్దకు కాకుండా, బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోని వైద్యుల సేవలకు పరిమితం కావాల్సి వస్తుంది. కనుక నెట్వర్క్ జాబితాలో పేరున్న హాస్పిటల్స్ ఉన్నాయేమో పరిశీలించాలి. రీయింబర్స్మెంట్ విధానంలో షరతులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అసలు షరతుల్లేని లేదా పరిమిత షరతులతో మెరుగైన ప్రయోజనాలను ఆఫర్ చేసే ఓపీడీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్‌కు అవకాశం ఉంటే అదే తీసుకోవడం మేలు. తమ అవసరాలకు సరితూగే ఓపీడీ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం అన్నింటికంటే ప్రధానమైనది. వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఓపీడీ ప్లాన్లు, వాటిల్లోని సదుపాయాలు, నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను పోల్చి చూడాలి. మెరుగైన చెల్లింపుల చరిత్రతో సహేతుక ప్రీమియంతో ఉన్న ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
ఫ్యామిలీ

హోమ్ వర్క్ శిక్ష కారాదు
హోమ్ వర్క్ విషయంలో పిల్లలు మారాం చేస్తారు. తల్లిదండ్రులు కోప్పడతారు. చదువు ఘర్షణలా మారుతుంది. ఇది ప్రతిరోజూ, ప్రతి ఇంటిలోనూ జరిగే విషయం. చదువు పట్ల తల్లిదండ్రులకు ఉన్న అపోహే అందుకు కారణమంటే ఆశ్చర్యపోకండి. చదువు అంటే ‘గుర్తుపెట్టుకోవడం’ మాత్రమే అన్న నమ్మకం మన సమాజంలో చాలా బలంగా ఉంది. ఎక్కువసార్లు చదివినా, రాసినా మెదడులో నిలుస్తుందన్న అపోహలో ఉన్నాం. దాంతో హోమ్ వర్క్‌ను ఒక నిల్వ ప్రక్రియలాగా చూస్తున్నాం. పిల్లల మెదడు నిజంగా ఎలా నేర్చుకుంటుందో తెలుసుకోవడమే హోమ్ వర్క్ సమస్యకు అసలైన పరిష్కారం. దృక్పథం మారాలిచదువు అంటే ఒత్తిడి కాదు, ఉత్సాహం. హోమ్ వర్క్ అంటే పనిభారం కాదు, పునఃచింతన. ఇది జరగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మానసిక దృక్పథమే మారాలి. హోమ్ వర్క్‌ను సరికొత్తగా చూడాలి. అది భావోద్వేగ అనుభూతి, ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, సంబంధాల మధ్య ఒక వారధిలా ఉండాలి. పిల్లల మెదడును డౌన్లోడ్ చేయడం కాదు, డెవలప్ చేయాలి. పరీక్షల కోసం కాదు, జీవితానికి నేర్చుకోవాలి.⇒ మెదడు భావోద్వేగాల ద్వారా నేర్చుకుంటుంది, రిపిటీషన్ ద్వారా కాదని న్యూరో సై¯Œ ్స పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి నేర్చుకోవడాన్ని అడ్డుకుంటుంది. కాని, భావోద్వేగ సంబంధిత విషయాలు మెదడులో బలమైన న్యూరల్ కనెక్షన్లు ఏర్పరుస్తాయని డాక్టర్ జుడీ విల్లిస్ అనే న్యూరాలజిస్ట్ చెబుతున్నారు.⇒ జాన్ స్వెల్లర్ కాగ్నిటివ్ లోడ్ థియరీ ప్రకారం ప్రతి పిల్లవాడికి వర్కింగ్ మెమరీ పరిమితంగా ఉంటుంది. మన మెదడు ఒక్కసారిగా 4–7 అంశాలు మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఈ పరిస్థితిలో, పెద్ద పెద్ద హోమ్ వర్క్‌లు ఇచ్చినప్పుడు వాళ్లు నేర్చుకోకపోగా; అలసటకు, నిరాశకు లోనై హింసలా భావిస్తారు.⇒ ఒకేసారి గంటలకు గంటలు ఒత్తిడితో చేసే హోమ్ వర్క్ కన్నా, విరామం తీసుకుంటూ చదివినప్పుడు లేదా హోమ్ వర్క్ చేసినప్పుడు మెదడు ఎక్కువగా నేర్చుకుంటుందని డాక్టర్ రాబర్ట్ బిజోర్క్ చెబుతున్నారు. ⇒మంచి నిద్ర జ్ఞాపకశక్తిని పెంచుతుందని డాక్టర్ మాథ్యూ వాకర్ అనే నిద్ర శాస్త్రజ్ఞుడు చెబుతున్నారు. మంచి నిద్ర లేని పిల్లలు ఎంత రాసినా, ఎంత చదివినా లాంగ్ టర్మ్ మెమరీలో నిలవదు. కాబట్టి పిల్లలకు మంచి నిద్ర ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సంప్రదాయ హోమ్ వర్క్‌లో లోపాలు⇒ప్రతి పిల్లవాడి శైలి వేరు. కొందరు వింటూ, మరికొందరు రాసుకుంటూ, ఇంకొందరు చూసి నేర్చుకుంటారు. ఎవరి శైలిలో వారిని చేయనివ్వాలి. ఒక్కటే హోమ్ వర్క్ మొత్తం క్లాస్‌కు ఇవ్వడమంటే అందరికీ ఒకే మందు ఇవ్వడం లాంటిది.⇒అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం హోమ్ వర్క్ వల్ల ఉదాసీనత, నిద్రలేమి, ఫ్యామిలీ గొడవలుపెరిగాయి. ఇక మన దేశంలో హోమ్ వర్క్ మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. ⇒ ‘క్లాస్ వర్క్ పూర్తిచేయకపోతే ఊరుకోం. డబుల్ హోం వర్క్ చేయాలి’ అని టీచర్లు, పేరెంట్స్ బెదిరిస్తుంటారు. దీని వల్ల పిల్లల మనసులో ‘చదువు = శిక్ష’ అనే భావన బలపడుతుంది. ఇది వారికి చదువుపై కోపం, భయం పెంచుతుంది. హోమ్ వర్క్ ఎలా చేయించాలి?⇒ పేజీలకు పేజీలు రిపీట్ చేసే బదులు ఒక ప్రశ్న ఇవ్వండి. ‘ఇవ్వాళ నువ్వు ఏం అర్థం చేసుకున్నావు?’, ‘ఇది నీ స్నేహితుడికి ఎలా చెప్తావు?’ అని అడగండి. అది వారి ఊహాశక్తిని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచుతుంది.⇒ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం హోమ్ వర్క్ గరిష్ఠంగా ‘తరగతి నంబర్ 10 నిమిషాలు’ మాత్రమే ఉండాలి. 1వ క్లాస్ అంటే 10 నిమిషాలు, 5వ క్లాస్ అంటే 50 నిమిషాలు మించకూడదు. ⇒ హోమ్ వర్క్‌ను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, చర్చగా మార్చండి. ఒక సబ్జెక్టును చర్చించాలంటే పిల్లలు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ‘ప్రాటిజీ ఎఫెక్ట్’ అనే అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది – నేర్పేటప్పుడు నేర్చుకునే శక్తి పెరుగుతుంది.⇒హోమ్ వర్క్ ఎలా చేయాలనే విషయంలో పిల్లలకు స్వేచ్ఛనివ్వండి. ‘ఇది రాయాలని ఉందా? లేక చెప్పాలని ఉందా?’ అనే చాయిస్ ఇవ్వండి. ఈ ఎంపిక వల్ల మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. ఇది చదువు పట్ల ఆసక్తిని పెంచుతుంది.

ఏఐ డాక్టర్లా? మజాకా?
డాక్టర్ ఏఐ– ఇదొక కొత్త స్టెతస్కోప్ ఇదొక రోబో సర్జన్ ఇదొక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఇది రోగుల పాలిటి వరం వైద్యరంగం చేతిలోని శరంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి దూసుకొచ్చేస్తున్నట్లే, వైద్యరంగంలోకి కూడా శరవేగంగా దూసుకొస్తోంది. ఏఐ మాయాజాలం వైద్యరంగంలో పెనుమార్పులను తీసుకొస్తోంది. మన దేశంలోని ఆస్పత్రులు కూడా ఇటీవలి కాలంలో ఏఐని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. వైద్యరంగంలో డాక్టర్ ఏఐ ఇప్పటికే తీసుకొచ్చి మార్పులను, భవిష్యత్తులో తీసుకురానున్న మార్పులను ఒకసారి తెలుసుకుందాం.‘కరోనా’కాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్యరంగం అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడే పరిస్థితులు ఉంటే, చాలా చోట్ల ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బంది లేని పరిస్థితి. మహమ్మారి వ్యాధులు విజృంభించినప్పుడు మాత్రమే కాదు; సీజనల్ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా వ్యాపించేటప్పుడు; అనుకోని విపత్తులు తలెత్తేటప్పుడు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. రోగుల తాకిడికి తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. ఇలాంటి విపత్కర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడంలో ఏఐ బాగా సహాయపడగలదని నిపుణులు చెబుతున్నారు. వైద్యులపై పనిభారం తగ్గించడానికి, వారి పనిని మరింత సులభతరం చేయడానికి ఏఐ వరప్రసాదం లాంటిదని వారు అంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల మొదలుకొని, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు వివిధ దేశాల్లోని ఆస్పత్రులు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆస్పత్రిప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రి ఇటీవల చైనాలో ప్రారంభమైంది. చింగ్హ్వా యూనివర్సిటీ ఈ పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రిని అభివృద్ధి చేసింది. ‘ఏజెంట్ హాస్పిటల్’ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో ఇతర సాధారణ ఆస్పత్రుల్లో మాదిరిగా మనుషులు ఉండరు. ఇదంతా ఒక మాయాలోకంలా ఉంటుంది. ఇందులో పనిచేసే సిబ్బంది అంతా పద్నాలుగు మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులు మాత్రమే! ఈ ఏఐ ఆస్పత్రిలో పేషెంట్లను చేర్చుకునే వార్డులు కూడా కనిపించవు. ఈ ఆస్పత్రిలోని ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు ‘వర్చువల్’గానే రోగులకు సేవలు అందిస్తూ ఉంటారు. రోజుకు దాదాపు మూడువేల మందికి ఈ ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు రోగ నిర్ధారణ మొదలుకొని, రకరకాల చికిత్సలను అందిస్తూ ఉంటారు. ఈ ఏఐ డాక్టర్లు ఆషామాషీ చాట్బోట్లు కాదు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ (యూఎస్ఎంఎల్ఈ) పరీక్షల్లో 93.06 శాతం మార్కులు సాధించిన ఘనత సొంతం చేసుకున్న ఘనవైద్యులుగా గుర్తింపు పొందాయి. అంతేకాదు, కొన్ని రంగాల్లో అనుభవజ్ఞులైన మానవ వైద్యులను మించిన ఫలితాలను సాధించిన ఘనత కూడా ఈ ఏఐ వైద్యులు సాధించడం విశేషం.తొలి రిమోట్ ఏఐ సర్జరీచైనా శాస్త్రవేత్తలు ఏఐ డాక్టర్ల రూపకల్పనలోనే కాదు, ప్రపంచంలోనే తొలి రిమోట్ ఏఐ సర్జరీని ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఐ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్య శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా రిమోట్ ఏఐ సర్జరీని నిర్వహించారు. ఏఐ సాయంతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు సాధారణంగా చేసే శస్త్రచికిత్స కంటే ముప్పయిశాతం తక్కువ సమయం పట్టింది. అంతేకాదు, రోగికి పెట్టే కోతలో మిల్లీమీటరులో పదోవంతు కూడా తేడా లేనంత కచ్చితత్వంతో ఈ శస్త్రచికిత్స జరగడం అద్భుతమనే చెప్పుకోవాలి. ఫుడాన్ వర్సిటీ ఈఎన్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వు చున్పింగ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి గొంతులో ఏర్పడిన కణితిని ‘ట్రాన్స్ ఓరల్ సర్జికల్ రోబో సిస్టమ్’ ద్వారా ఏఐ సాయంతో తొలగించారు. షాంఘైలో ఉన్న వైద్యనిపుణుల సూచనలకు అనుగుణంగా, అక్కడకు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని చెంగ్డూ ఆస్పత్రిలోని ఏఐ సర్జికల్ రోబోలు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. ‘బోర్న్ ’ గ్రూప్‌లోని సింఫనీ రోబోటిక్స్ కంపెనీ ఈ ఏఐ సర్జికల్ రోబోలను తయారు చేసింది. షాంఘైలోని వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిమోట్ ఏఐ సర్జరీ వల్ల శస్త్రచికిత్స ఖర్చు ఇరవై శాతం మేరకు, సమయం ముప్పయి శాతం మేరకు తగ్గినట్లు ‘బోర్న్’ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో లి యావో తెలిపారు. ‘బోర్న్’ గ్రూప్ రూపొందించిన ఏఐ సర్జికల్ రోబోలకు కావలసిన 1760 విడిభాగాలను చైనాలోని 165 కంపెనీల నుంచి సమకూర్చుకున్నట్లు లి యావో చెప్పారు. ఏఐ సర్జికల్ రోబోలను అభివృద్ధి చేయడానికి, వాటి వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి తమ సంస్థ అమెరికా, జపాన్, జర్మనీలకు చెందిన కంపెనీలు, వైద్య పరిశోధక సంస్థలకు సహకరిస్తోందని వెల్లడించారు.ఏఐ మాయాదర్పణంవైద్యరంగంలో వ్యాధుల నియంత్రణ, చికిత్స పద్ధతులు ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరో ఎత్తు. వ్యాధుల చికిత్సకు వ్యాధి నిర్ధారణే కీలకం. ఎంత ఆధునిక వ్యాధి నిర్ధారణ పద్ధతులైనా, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావడానికి ఒకటి రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అయితే, ఏఐ రాకతో వ్యాధి నిర్ధారణ శరవేగం పుంజుకుంటోంది. వ్యాధి నిర్ధారణలో ఏఐ తీసుకొచ్చిన వేగానికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ మాయాదర్పణమే తాజా ఉదాహరణ. మామూలుగా అద్దం ముందు నిలుచున్నట్లుగానే ఈ మాయాదర్పణం ముందు నిలుచుంటే చాలు, ఉన్నపళాన మీ ఆరోగ్య వివరాలను క్షణాల్లో చెప్పేస్తుంది. ఈ మాయాదర్పణం డయాబెటిస్, బీపీ వంటి సర్వసాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు పార్కిన్సన్స్, డెమెన్షియా, గుండెజబ్బులు, శ్వాస సమస్యలు, నాడీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధులను కూడా ఇట్టే గుర్తించగలదు. స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా దీని ముందు నిలబడి ముప్పయి సెకన్ల సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలు, ఇది శరీరాన్ని ఆపాదమస్తకం త్రీడీ స్కానింగ్ చేసేస్తుంది. అంతేకాదు, క్షణాల్లోనే ఈ మాయాదర్పణం ముప్పయి రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి వివరాలను అత్యంత కచ్చితత్వంతో చెబుతుంది. అమెరికన్ హెల్త్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘విదింగ్స్’ దీనిని ‘ఒమీనా’ పేరిట రూపొందించింది. ఈ ఏడాది లాస్వేగాస్లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2025లో ప్రదర్శించిన దీని పనితీరు నిపుణుల ప్రశంసలు పొందింది. ‘ఒమీనా’ మాయాదర్పణం కేవలం ఆరోగ్య వివరాలను తెరపై చూపించి, అంతటితోనే సరిపెట్టుకోదు. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా పనిచేస్తుంది. తెరపై కనిపించే ఆరోగ్య వివరాలను చూసుకున్న తర్వాత వినియోగదారులు అడిగే సందేహాలన్నింటికీ సమాధానాలను ఓపికగా చెబుతుంది. గుర్తించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి, తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు కూడా చేస్తుంది. వ్యాధి నిర్ధారణ రంగంలో ‘ఒమీనా’ ఏఐ సంచలనానికి నాంది పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.మన ఆస్పత్రుల్లోనూ ఏఐమన దేశంలోని ప్రముఖ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలైన గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటివి భారత్‌లోని ఆస్పత్రులకు ఏఐ సాంకేతికతను అందించడానికి ముందుకొస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, మణిపాల్ హాస్పిటల్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్, ఏజే హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, నారాయణ హెల్త్, క్లౌడ్‌నైన్ హాస్పిటల్స్, కావేరీ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్స్ వంటివి ఇప్పటికే ఏఐ సాంకేతికతను రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, శస్త్రచికిత్సలలో కచ్చితత్వం తదితర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. పలు ఔషధ తయారీ సంస్థలు, పరిశోధక సంస్థలు ఔషధాల రూపకల్పన కోసం కూడా ఏఐని వినియోగించుకుంటున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులే కాకుండా, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘భారత్‌నెట్’ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు రూ.8500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ‘నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంకల్పించుకుంది. ఈ ఆరోగ్య గుర్తింపు కార్డులకు పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం అంతా అనుసంధానమై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకం అమలులోకి వచ్చినట్లయితే, ఏఐ సాంకేతికత గ్రామీణ ఆస్పత్రులకు కూడా అందుబాటులోకి వస్తుంది.ఆరోగ్యరంగంలో విస్తరిస్తున్న ఏఐప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ గడచిన ఐదేళ్లుగా బాగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 2022 నాటికి 11 బిలియన్ డాలర్లుగా (రూ.94,112 కోట్లు) నమోదైంది. ఇది 2025 నాటికి 35.71 బిలియన్ డాలర్లకు (రూ.3.04 లక్షల కోట్లు) చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో 2022 నాటికి ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 0.13 బిలియన్ డాలర్లు (రూ.1112 కోట్లు) ఉంటే, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలువ 1.6 బిలయన్ డాలర్లకు (రూ.13,689 కోట్లు) చేరుకోగలదని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా. భారత్ ఆరోగ్య రంగంలో ఏఐ మార్కెట్ 40.6 శాతం మేరకు వార్షిక వృద్ధి నమోదు చేసుకోగలదని కూడా ‘ఫోర్బ్స్’ పత్రిక తన అంచనాను ప్రకటించింది. భారత్ ఆరోగ్యరంగంలో ఏఐ విస్తరణ దిశగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన ‘టాటా ఎల్క్సి’ ఏఐతో పనిచేసే మెడికల్ ఇమేజింగ్ పరికరాల తయారీ కోసం పనిచేస్తోంది. మన దేశానికి చెందిన డిజిటల్ హెల్త్‌కేర్ స్టార్టప్ సంస్థ ‘ప్రాక్టో’ తన టెలిమెడిసిన్ సేవల కోసం బహుభాషా సామర్థ్యం కలిగిన ఏఐ సాంకేతికతను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ‘సిగ్టపుల్’ రక్త నమూనాలను దూరం నుంచే విశ్లేషించి, వ్యాధుల వివరాలను వెల్లడించగలిగే ‘డిజిటల్ పాథాలజీ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించింది. ఇది స్పెషలిస్టులు, హీమాటాలజిస్టుల అవసరం లేకుండానే ఏ ప్రాంతంలో ఉన్న రోగులకైనా రక్తపరీక్షల వివరాలను అందించగలదు.ఏఐ తెచ్చిన మార్పులుఆరోగ్యరంగంలో ఏఐ ఇప్పటికే చాలా మార్పులు తెచ్చింది. అయితే, ఈ మార్పుల ఫలితాలు ప్రపంచం అంతటా ఇంకా పూర్తిగా విస్తరించలేదు. మరో ఐదేళ్లలో ఆరోగ్యరంగంలో ఏఐ మరింతగా విస్తరించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య వైద్యసేవలలో ఏఐ ఇప్పటి వరకు తెచ్చిన కొన్ని మార్పులు ఇవి:ఏఐ వల్ల వ్యాధినిర్ధారణ సులభతరంగా మారింది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే వంటి వాటిని ఏఐ శరవేగంగా విశ్లేషించి రోగ నిర్ధారణ చేయగలుగుతోంది. ఈ పరీక్షలను విశ్లేషించడంలో మానవ తప్పిదాలకు కొంత ఆస్కారం ఉండేది. ఏఐ వినియోగంతో ఎలాంటి తప్పిదాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.ఏఐ సహాయంతో పలు దేశాల్లోని ఆస్పత్రులు విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించగలుగుతున్నాయి. ఏఐ వినియోగం వల్ల శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం పెరగడమే కాకుండా, శస్త్రచికిత్సకు పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుండటం విశేషం.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందిçంచే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.మానసిక సమస్యలతో బాధపడేవారికి చికిత్సను అందించడంలోను, మానసిక సమస్యల లక్షణాలను ముందుగానే గుర్తించడంలోను ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.ఔషధ తయారీ సంస్థలు, ఔషధ పరిశోధనలు నిర్వహించే సంస్థలు ఔషధాల ఆవిష్కరణకు, కొత్త ఔషధాల రూపకల్పనకు కూడా ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి.పలు దేశాల్లోని ఆస్పత్రులు ఏఐ సాంకేతికతను వ్యాధి నిర్ధారణకు విరివిగా వాడుకుంటున్నాయి. వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల విశ్లేషణతో పాటు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈసీజీ, టూడీ ఎకో తదితర నివేదికలను నిమిషాల్లోనే విశ్లేషించి, భవిష్యత్తులో రానున్న వ్యాధులను గుర్తించడానికి కూడా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందించే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.ఏఐ డాక్టర్లా? మజాకా?‘ఏజెంట్ హాస్పిటల్’లోని ఏఐ డాక్టర్లన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌లో శిక్షణ పొంది; వైద్య శాస్త్ర విషయాలను, వ్యాధి నిర్ధారణ పద్ధతులను ఆకళింపు చేసుకుని; రోగుల పరిస్థితికి తగినట్లుగా స్పందించడంలో మానవ వైద్యుల కంటే మిన్నగా రూపొందినవి. వైద్యరంగంలోని వివిధ అంశాలపై కూలంకషమైన పరిజ్ఞానం పొందడానికి సాధారణంగా ఏళ్లతరబడి కృషి అవసరమవుతుంది. ఈ ఏఐ డాక్టర్లు మాత్రం కొద్దివారాల్లోనే అంతటి పరిజ్ఞానాన్ని పొందడం విశేషం. సాధారణమైన జలుబు దగ్గు మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన జన్యువ్యాధులకు, ఆటోఇమ్యూన్ వ్యాధులకు సైతం ఈ ఏఐ డాక్టర్లు సమర్థంగా చికిత్సలు అందిస్తుండటం విశేషం. నవజాత శిశువుల నుంచి వయోవృద్ధుల వరకు రకరకాల వయసుల్లోని రోగులకు తగిన రీతిలో ఊరటను అందిస్తూ, తగిన చికిత్సతో ఏఐ డాక్టర్లు రోగ నిదానం చేయడమే కాకుండా, రకరకాల మానసిక సమస్యలతో బాధపడే రోగులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగిస్తుండటం మరింత విశేషం. ఏఐ డాక్టర్లు ఔట్ పేషెంట్లకు వర్చువల్ రియాలిటీ ద్వారా సత్వర సేవలను అందిస్తున్నాయి.

ఈ కళ అమ్మ కల
‘అమ్మాయే కదా ఏం చేస్తుందిలే... టచ్ చేసేద్దాం’ అనుకుంటే అనంతికా సనీల్‌కుమార్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అనంతిక’ అనొచ్చు. మనల్ని మనం రక్షించుకునే కళ తెలియాలంటోంది ఈ టీనేజ్ బ్యూటీ. అందుకే అనంతికా సనీల్‌కుమార్ ‘మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్, కేరళ ప్రాచీన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు నేర్చుకుంది. కథకళి, భరతనాట్యం, మోహినియాట్టమ్, కూచిపుడి కూడా నేర్చుకుంది. మరోవైపు సినిమాలంటే ఇష్టంతో హీరోయిన్గా కొనసాగుతోంది. ‘మ్యాడ్’, ఇంకా ఆ మధ్య విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అనంతికా సనీల్‌కుమార్ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడల్లా ‘ఓకే’ అనే సమాధానమే వచ్చింది. ఇక డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లాసికల్ మాత్రమే కాదు... హిప్ హాప్ నేర్చుకోవాలన్నా అదే రియాక్షన్. అంత సపోర్టివ్. మా అమ్మ తన కలని నాలో చూసుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లుగా చిన్నప్పుడు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఆమె పేరెంట్స్‌కి అంత స్థోమత లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉంది. అన్నీ నేర్పించి, మా అమ్మ నాలో తనని చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఫోర్త్ స్టాండర్డ్ వరకూ నేను టాపర్‌ని. ఆ తర్వాత ఆడుకోవడం, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్‌తో స్టడీస్ వైజ్ కొంచెం వీక్ అయ్యాను. ఎయిత్ స్టాండర్డ్ వరకూ ఇలానే. ఆ తర్వాత మళ్లీ గుడ్ స్టూడెంట్ అయ్యాను.క్రమశిక్షణకు కళకళ ఏదైనా సరే క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిస్ట్ (యాక్టింగ్) అంటేనే క్రమశిక్షణ ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ వల్ల నా ఆలోచనా విధానం మారింది. ఏదైనా విషయం గురించి నిదానంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే శరీరాన్ని మాత్రమే కాదు... మనసుని కూడా క్రమ పద్ధతిలో పెడుతుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే మీద పడి కొట్టడం కాదు... మనల్ని మనం రక్షించుకోవడం. ఈ ఆర్ట్ నేర్చుకున్న ఎవరైనా సరే ముందు చాలావరకు నియంత్రించడానికే ప్రయత్నిస్తారు... అయితే లిమిట్ దాటితే అప్పుడు కొడతాం.బ్యాడ్ టచ్... టీచ్ హిమ్నా చిన్నప్పుడు ఒక అబ్బాయితో చాలా గట్టిగా గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను ఏమీ అనలేదు. తను నా ఫ్రెండ్. పిల్లల గొడవలుంటాయి కదా... అలాంటిది. నేను తిరగబడి బాగా కొట్టాను. నన్ను కూడా బాగా కొట్టాడు (నవ్వుతూ). కిడ్స్ ఫైట్ అన్నమాట. ఆ తర్వాత నా టీనేజ్‌లో నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి ‘బ్యాడ్ టచ్’ చేశాడు. అమ్మాయే కదా ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనదనే ధైర్యం వారికి ఉంటుంది. నేను అతన్ని నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో లాక్ చేశాను. బ్యాడ్ టచ్ చేస్తే టీచ్ చేయాల్సిందే. అమ్మాయిలు ఇలా చేస్తే ఓ ఎవేర్నెస్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి... తిరగబడతారనే ఫీలింగ్ సొసైటీలో క్రియేట్ చేయగలిగితే దాడులు తగ్గుతాయని నా ఫీలింగ్.సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంనాకు గాయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాయాలు తగిలిన ప్రతిసారీ ‘మనం ఏదో చేస్తున్నాం’ అనే ఫీలింగ్ నాకు ఆనందాన్నిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో చాలాసార్లు తగిలాయి. ఇక కలరి అయినా, కరాటే అయినా ఏదైనా ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా స్లోగా ఉంటుంది. త్వరగా నేర్చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా... అందుకని బోర్ ఫీలవుతాం. కొంతమంది అమ్మాయిలైతే ఒకటీ రెండు క్లాసులకు వచ్చి, మా వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ నిదానం అవసరం. అయితే ఆ ఫస్ట్ స్టెప్ మనం ఓపికగా ఉంటే మన లాస్ట్ స్టెప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొందరైతే ఈ కష్టం మావల్ల కాదనుకున్నారు. కానీ, కొన్నేళ్లు కష్టపడి నేర్చుకున్న ఆర్ట్ మన జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకపోవడం అనేది ‘ఆర్థిక స్వాతంత్య్రం’ విషయంలో మాత్రమే కాదు... మన మీద జరిగే దాడుల విషయంలోనూ డిపెండ్ కాకూడదు. ‘సెల్ఫ్ డిఫెన్స్’ చాలా ఇంపార్టెంట్.రెస్ట్ నచ్చదునాకు ‘బ్లాక్ ఫ్లిప్’ అంటే ఇష్టం. ఒకసారి అది చేస్తున్నప్పుడు వెన్నెముకకి గాయం అయింది. అప్పుడు నేను ‘ప్లస్ వన్’ చదువుకుంటున్నాను. నా స్పైన్ బెండ్ అయింది. ఫలితంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి రెస్ట్ అంటే అస్సలు నచ్చదు. విశ్రాంతి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ‘8 వసంతాలు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయినా ఆ సినిమా ఒప్పుకుని, చేశాను. ఇప్పటికీ కంటిన్యూస్‌గా నిలబడితే నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఉన్నా పట్టించుకోకుండా పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను (నవ్వుతూ).రియాక్ట్ అయ్యే బలంమార్షల్ ఆర్ట్స్ అంటే... ఒంటి చేత్తో రాళ్లని పగలగొట్టడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి వేళ్లు, గోళ్లు, చేతులు, కాళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది... మన ఆత్మవిశ్వాసం పెంచే కళ. మనకు ఏం జరిగినా వేరేవాళ్ల మీద ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటారు కాబట్టి వాళ్లైతే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నవాళ్లు నేర్చుకోవాలంటా. అమ్మాయిగా నాకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువే. కానీ ఇవి నేర్చుకోవడం వల్ల రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌లో రియాక్ట్ అయ్యేంత బలం దానంతట అది వచ్చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం మనకు తెలుసు అని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ఎదురు తిరిగేలా చేస్తుంది.సైలెంట్‌గా ఉండొద్దుఅమ్మాయిలకు స్వీయ రక్షణ తెలియాలి. ఆ మాటకొస్తే ఇప్పుడు అబ్బాయిలకూ కొన్ని ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సో... ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినవాళ్లల్లో అబ్బాయిలకు కూడా సమస్యలు వచ్చాయి. ఇక అమ్మాయిలకు ఎందుకు మరీ ముఖ్యం అంటే... వాళ్లకి ఎక్కువగా వేధింపులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ఎవరైనా వచ్చి, తాకకూడని చోట తాకారనుకోండి ‘మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటే బాగుండేది’ అని అప్పుడు అనుకుంటాం. అది ప్రయోజనం లేదు. అదే ముందే నేర్చు కుంటే... ఆ టైమ్‌లో సైలెంట్‌గా ఉండకుండా బుద్ధి చెప్పగలుగుతాం.పాలిటిక్స్‌లోకి...నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే జనాల్లో ఉండటం ఇష్టం. వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంది.ప్రాపర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. చట్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘లా’ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. భవిష్యత్తులో అమ్మాయిల కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని ఉంది. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. కొంచెం టైమ్ పడుతుంది.– కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ మాత్రమే సాధించాను. వన్ నుంచి టెన్ వరకూ ఉన్నాయి. థర్డ్ కూడా సాధించాలని ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి టైమ్ దొరకడంలేదు. పదో స్టేజ్ వరకూ వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాల్లో నాకు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్ర వస్తే హ్యాపీగా చేసేస్తాను.– డి.జి. భవాని

MorningFood పరగడుపున ఇవి తింటున్నారా?
మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపు లో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.ఉదయం వేళల్లో మసాలాలు, డీప్ ఫ్రైస్ తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా కడుపుకి మంచిదే కదా అని పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి.చాలామంది బ్రష్ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు ఎదురై.. ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం చాలాప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు.చదవండి : Yoga మెదడును ఉత్తేజపరిచే ఆసనాలు
ఫొటోలు
అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో వలసదారుల అరెస్టులు ఆపండి
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను ఎక్కడపడితే అక్కడ ఆపి తనిఖీలు చేపట్టడం, అరెస్ట్‌లు చేయడం తక్షణమే ఆపేయాలని ఫెడరల్ జడ్జి ఒకరు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలోని హిస్పానిక్‌లు, లాటినోలను పథకం ప్రకారం వేధిస్తోందని గత వారం లాస్ ఏంజెలెస్‌లోని యూఎస్ డి్రస్టిక్ట్ కోర్టులో వలసదారుల తరఫున పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు కార్డులు చూపినా ఇద్దరు అమెరికా పౌరులను మరో ముగ్గురు వలసదారులను ఎటువంటి వారెంట్లు లేకుండా అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని ఆరోపించారు. కేవలం శరీరం రంగు ఆధారంగా అరెస్ట్‌లు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జడ్జి మామె ఈ ఫ్రిమ్పాంగ్ శుక్రవారం పలు ఆదేశాలను వెలువరించారు. లాస్ ఏంజెలెస్ సహా కాలిఫోర్నియాలోని ఏడు కౌంటీల పరిధిలో వలసదారుల అరెస్ట్‌లు, సోదాలను నిలిపివేయాలన్నారు. అంతేకాదు, వలసదారులను నిర్బంధించిన లాస్ ఏంజెలెస్ డిటెన్షన్ కేంద్రంలోకి అటార్నీ ప్రవేశించకుండా ఫెడరల్ ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వులను సైతం రద్దు చేశారు.

ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్‌లు
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు.

బే‘కారు’ కాదు.. కారే..
డౌట్ అక్కర్లేదు. ఇది కారే. కాకపోతే.. ప్రపంచంలోనే అత్యంత సన్నటి (స్లిమ్) కారు. ట్రాఫిక్ జామ్‌ల ఫికర్ లేదు. పార్కింగ్ సమస్య లేనే లేదు. ఈ అల్ట్రా స్లిమ్ ఫియట్ పాండా ఎలక్ట్రిక్ కారును ఇటలీలో ఆవిష్కరించారు. డ్రైవర్ కాకుండా.. ఇంకొకరు వెనుక సీట్లో కూర్చొని ప్రయాణించవచ్చు. 50 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ కారును ఇటలీకి చెందిన మెకానిక్ ఆండ్రియా పాత ఫియట్ కారు భాగాలను ఉప యోగించి రూపొందించాడు. 145 సెంటీమీటర్ల ఎత్తు, 340 సెంటీమీటర్ల పొడవున్న ఈ కారు బరువు 264 కిలోలు. దీన్ని చూసినోళ్లంతా గట్టిగా గాలి వస్తే పడిపోతుందేమో అని అనుమా నం చేయగా.. అటూ ఇటూ ఊగుతుంది గానీ.. పడిపోదు అని దీన్ని తయారుచేసిన ఆండ్రియా చెప్పాడు. దాన్ని నిరూపించడానికి అక్కడ నడిపి చూపాడు. ఇది స్లిమ్ కారు.. దానికి తగ్గట్లు ఇందులో సన్నగా ఉన్నవాళ్లే పడతారు. ప్రపంచంలోనే అత్యంత సన్నటి కారుగా దీని పేరు ను త్వరలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించనున్నట్లు ఆండ్రియా తెలిపాడు.

Myanmar: బౌద్ధ ఆరామంపై వైమానిక దాడి.. 23 మంది మృతి
నేపిడా: మయన్మార్‌లోని లిన్ టా లు గ్రామంలోని ఒక బౌద్ధ ఆరామంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు పిల్లలతో సహా 23 మంది పౌరులు మరణించారు. లిన్ టా లు గ్రామం దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మండలేకు వాయువ్యంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడి తెల్లవారుజామున జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ)వెల్లడించింది.ఈ ఘటనలో మొత్తం 23 మంది మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారని ఏపీ తెలిపింది. గాయపడినవారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. కాగా స్వతంత్ర వార్తా సంస్థ డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ బర్మా ఈ ఘటనలో 30 వరకు మరణించి ఉండవచ్చని పేర్కొంది. మయన్మార్ సైన్యం ఈ ఘటనపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. జుంటా వ్యతిరేక ఘటనలకు కీలకంగా నిలిచిన సాగింగ్ ప్రాంతంలో సైనిక చర్యలు ముమ్మరమవుతున్నాయి. సైన్యం ఇటీవల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది.స్థానిక తిరుగుబాటు గ్రూపుల నుండి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ట్యాంకులు, యుద్ధ విమానాలను సైన్యం ఈ ప్రాంతంలో మోహరించింది. రాబోయే ఎన్నికలకు ముందు తన బలాన్ని ప్రదర్శించడానికే జుంటా ఇదంతా చేస్తోందనే ఆరోపణలున్నాయి. మయన్మార్‌లో సైనిక పాలనను జుంటా అని పిలుస్తారు. 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా మయన్మార్ సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య మద్దతుదారులు, సైన్యం మధ్య వివాదం తీవ్రమైంది. ముఖ్యంగా సాగింగ్‌లో సైనిక నియంత్రణకు వ్యతిరేకంగా పౌరులు, స్థానిక మిలీషియా గ్రూపులు పోరాటాలు సాగిస్తున్నాయి.
జాతీయం

‘యమున’లో విగతజీవిగా త్రిపుర యువతి.. కుటుంబ కలహాలే..?
న్యూఢిల్లీ: ఆరు రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన త్రిపురకు చెందిన యువతి స్నేహా దేబ్నాథ్(19) ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె మృతదేహం యుమునా నదిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈమె ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. స్నేహా దేబ్నాథ్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నిర్ధారించారని పోలీసులు పేర్కొన్నారు.స్నేహా దేబ్నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపురలోని ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. జూలై 7న ఆమె ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జికి క్యాబ్‌లో వెళ్లింది. స్నేహ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు సూచించే నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చదువు విషయంలో ఆమె కలకతచెందడం లేదని, ఆమె ఆందోళనకు కారణం కుటుంబ కలహాలై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నేచర్ బ్రిడ్జికి 10 కి.మీ దిగువన ఉన్న గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలోని యమునా నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.స్నేహా దేబ్‌నాథ్‌ను ఈ స్థలంలో దింపినట్లు క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా ఈ వంతెనపై నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసు విభాగాల సహాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు సాగాయి. వారు ఉత్తర ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వరకుగల అన్ని ప్రాంతాలను అణువణువునా జల్లెడ పట్టారు. జూలై 7 తెల్లవారుజామున స్నేహా తన సన్నిహితులకు ఈమెయిల్స్ పంపిందని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు స్నేహితులు పోలీసులకు తెలిపారు.

కల్తీ ఎరువులపై కఠిన చర్యలు: కేంద్రం∙
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ, నాసిరకం ఎరువుల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రులను కోరారు. ఆదివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకని, రైతుల ఆదాయంలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, వారికి సరైన సమయంలో సరసమైన ధరలకు ప్రామాణికతతో నాణ్యమైన ఎరువులను అందించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఎరువుల లభ్యతను నిర్ధారించాలని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం, సబ్సిడీ ఎరువుల మళ్లింపు వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. సంప్రదాయ ఎరువులతో పాటు నానో–ఎరువులు, బయో–స్టిమ్యులెంట్ ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడాన్ని వెంటనే అరికట్టాలన్నారు. దోషులుగా తేలితే లైసెన్స్‌ల రద్దు వంటి కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తగు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ఎరువుల్లో కల్తీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఢిల్లీతోపాటు శివారు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండియా గేట్, కర్తవ్యపథ్ ప్రాంతాల్లో భీకర వర్షం పడడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించడంతో అరెంజ్ అలర్ట్‌ను అధికారులు రెడ్ అలర్ట్‌గా మార్చారు. ఢిల్లీతోపాటు తూర్పు హరియాణ, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

నేటి నుంచి ఒడిశాలో రాష్ట్రపతి పర్యటన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె సోమవారం భువనేశ్వర్‌కు చేరుకుంటారని రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవా రం భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయి మ్స్) ఐదవ స్నాతకోత్సవానికి హాజరవుతారు. రెండో రోజైన జూలై 15న రావెన్షా విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అలాగే రావెన్షా బాలికల ఉన్నత పాఠశాల మూడు భవనాల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. ఆదికాబి సరళ దాస్ జయంతి వేడుకలకు హాజరవుతారు.
ఎన్ఆర్ఐ

శ్రీ సాంస్కృతిక కళాసారథి 5వ వార్షికోత్సవం, గురుపూర్ణిమ శుభాకాంక్షలు
గురుపూర్ణిమ నాడు ప్రారంభమైన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఈ రోజు తన 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. గత ఐదేళ్లయేటట తాము చేపట్టిన ప్రతి అడుగులో, మీరు అందించిన ఆదరణ, ఆశీర్వాదాలు, ప్రోత్సాహం తమకు బలాన్నిచ్చాయని పేర్కొంది. ‘‘ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి, మాకు తోడుగా నిలిచిన సభ్యులకు,మార్గనిర్దేశం చేసిన మేధావులకు, మన ఆహ్వానాన్ని స్వీకరించి అలంకరించిన అతిథులకు, తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు, స్పందించిన ప్రేక్షకులకు, సమయానుకూలంగా విరాళాలు అందించిన దాతలకు, ఆశీర్వచనాలు, అభినందనలు తెలియజేసిన మిత్రులకు, మా కార్యనిర్వాహక వర్గం తరఫున శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.’’అని ప్రకటనలో వెల్లడించింది. ఎనలేని సంపదలాంటి ఈ సహకారం ఇక ముందు కూడా కొనసాగాలని అభిలషించింది.అదే శక్తితో, భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చింది. అలాగే ఇప్పటివరకూ మా సంస్థ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాల సంగ్రహాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చింది.

8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా
టంపా: ఫ్లోరిడా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గణపతి పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమెరికా తెలుగు సంబరాలను బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నందుకు నాట్స్ సంబరాల కమిటీని ఆయన అభినందించారు. అమెరికాలో తెలుగు వారి కోసం నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. తెలుగు భాష పరిరక్షణలో నాట్స్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పటివరకు మూడు సార్లు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలు పంచుకున్నానన్నారు.హంసవింశతి పుస్తకం ఆవిష్కరణ18వ శతాబ్ధంలో ప్రముఖ తెలుగు కవి అయ్యలరాజు నారాయణ రచించిన హంసవింశతి కావ్యాన్ని తనికెళ్ల భరణి నేటి తరం కోసం ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సంబరాల వేదికపై నందమూరి బాలకృష్ణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష మాధుర్యాన్ని ఎందరో కవులు తమ రచనల్లో ప్రతిబింబించారని బాలకృష్ణ అన్నారు. భావితరాలకు తెలుగు మాధుర్యాన్ని అందించేందుకు నేటి తరం వారు తెలుగులో మాట్లాడాలని, తెలుగు రచనలను పిల్లలకు పరిచయం చేయాలన్నారు.పద్యం, అవధానం తెలుగు భాషకే సొంతమైన అమూల్యమైన ఆభరణాలని ప్రముఖ రచయిత, నటులు తనికెళ్ల భరణి అన్నారు.. తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని భరణి పేర్కొన్నారు. తెలుగులో ఎన్సైక్లోపీడియా లాంటి పుస్తకం హంసవింశతి అని తెలిపారు.. దీనిని ప్రతి తెలుగువాడు చదవితే మన చరిత్రలో మనకు తెలియని సరికొత్త విషయాలు తెలుస్తాయని భరణి అన్నారు. 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ మన్నవతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

తొలి ఏకాదశి సందర్బంగా లండన్‌లో SVBTCC ఆధ్వర్యంలో బాలాజీ కల్యాణం
తొలి ఏకాదశి అనే పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) — లండన్ లోని బాలాజీ దేవాలయం - ఒక వైభవమైన శ్రీనివాస (బాలాజీ) కల్యాణాన్ని ఘనంగా నిర్వహించింది. లోడన్ వ్యాలీ లెజర్ సెంటర్, రెడింగ్ — SVBTCC ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 1800 మందికి పైగా భక్తులు హాజరై పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వేడుకకు ఎర్లీ మరియు వుడ్లీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి యువాన్ యాంగ్, వోకింగ్హాం మేయర్ మేడం క్యారొల్ జ్యూవెల్, మరియు హిల్‌సైడ్ కౌన్సిలర్ పాలిన్ జార్గెన్సెన్ లాంటి ప్రముఖ స్థానిక రాజకీయ నాయకులు హాజరై ప్రత్యేకంగా గౌరవించారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పిల్లలు మరియు నిపుణుల ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీతం, నృత్యం, భక్తి కళల ద్వారా భారత సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తూ, కార్యక్రమం మొత్తం భక్తి శ్రద్ధలతో, సాంస్కృతిక గౌరవంతో, సముదాయ భావంతో సాగింది.భక్తుల నుంచి వచ్చిన భారీ స్పందనకు SVBTCC ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశానికి దూరంగా ఉన్నా కూడా, పవిత్ర తొలి ఏకాదశి రోజున కల్యాణాన్ని నిర్వహించగలగటం ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నామనీ, లండన్ లోని బాలాజీ దేవాలయంలో ఈ వేడుక నిర్వహించటం మాకు గర్వకారమని అని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ డయాస్పోరా యొక్క స్థిరమైన సాంస్కృతిక విలువలకు గుర్తుగా నిలిచిందన్నారు లండన్‌లోని ఆధ్యాత్మిక , సామాజిక జీవితాన్ని ప్రోత్సహించడంలో SVBTCC పాత్రను మరోసారి చాటుకుందని భక్తులు కొనియాడారు.

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్/తిరుపతి గాంధీ రోడ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని వివిధ దేశాల్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌లో సోమవారం వైఎస్సార్ అభిమానులు మహ్మద్ జిలానీ బాషా, అక్రమ్ బాషా, కోటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి యాత్ర–2 చిత్ర నిర్మాత శివ మేక ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం 500 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని నిర్వహించేందుకు తన స్థలాన్ని కేటాయించిన సోనాపూర్ లేబర్ క్యాంప్ యజమాని మసూద్ అహ్మద్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రసన్న సోమిరెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, షేక్ అబ్దుల్లా, ఫహీమ్, ఖాజా ముతాలిబ్, చక్రి, కర్ణ, పవన్ కుమార్, హనుమంత్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, గోపాల్, రమణా రెడ్డి, షోయబ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో..సౌదీ అరేబియాలోని జుబైల్ ప్రాంతంలో వైఎస్సార్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అకియాకునో కంపెనీ క్యాంపులో కడపకు చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కంపెనీలో పని చేసే సుమారు 100 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సింగపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి..వైఎస్సార్ జయంతిని సింగపూర్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కేక్‌ను కట్ చేశారు. తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైఎస్సార్ అని.. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన గుర్తుకు వస్తాయని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ ఎ. సాంబశివారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా వీడియో కాన్ఫరెన్స్(జూమ్)ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వైఎస్సార్సీపీ విభాగం సలహాదారు కోటి రెడ్డి, కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి, కో కన్వీనర్స్ – ప్రకాష్ , సంతోష్ తో పాటు పవన్, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దొరబాబు, ప్రసాద్, శ్రీనేహారెడ్డి, స్వాతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్సార్ ఆప్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సౌత్ ఆఫ్రికాలో ఘనంగా వైఎస్సార్ జయంతివైఎస్సార్సీపీ ఎన్నారై సౌత్ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో జోహన్స్‌బర్గ్‌లోని మిడ్ రాండ్లోలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డామన్నారు. అనంతరంచిల్డ్రన్స్ హోమ్‌లో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు నరసింహారెడ్డి కళ్ల, సూర్యరామిరెడ్డి, శివ రాజవరపు, విక్రం రెడ్డి పెట్లూరు, కృష్ణారెడ్డి, అంజలి రెడ్డి, మనోజ రాజవరపు, సూర్య రామిరెడ్డి, శ్రావణి రెడ్డి పెట్లూరు, వాసు సింగారెడ్డి, మధు పల్లె, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, అంజి రెడ్డి సానికొమ్ము, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
క్రైమ్

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు
త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు పలికారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావమరదలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ‘మీ పెళ్లి చేసి మురిసిపోదామనుకుంటే.. ఇలా జరిగిందేమిటి!’.. దేవుడా అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విషాద వదనంలో మునిగిపోయారు.ఓబులవారిపల్లె : చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. యుక్త వయస్సు రాగానే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరణంలోనూ వారు ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి విషాద గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని వైకోట రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ కండక్టర్ వనమాల శ్రీనివాసులు, వనమాల ప్రభావతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అజయ్ కృష్ణ, చిన్న కుమారుడు సాయి కృష్ణ. పెద్ద కుమారుడు అజయ్ చిట్వేలి గ్రామానికి చెందిన సాతుపాడి నాగయ్య నాల్గవ కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నాడు. మాధవి తల్లిదండ్రులు ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉండటంతో.. తన చిన్న చెల్లెలు అనితను చిన్నప్పుడే తనతోపాటు అత్తగారింటికి తీసుకొచ్చింది. అనిత ఇక్కడే హైసూ్కల్లో చదివి పుల్లంపేటలో ఇంటరీ్మడియెట్ పూర్తి చేసింది. నవమాల శ్రీనివాసులు రెండవ కుమారుడు సాయి కృష్ణ డిగ్రీ వరకు చదివాడు. చిప్పన్పటి నుంచి సాయి కృష్ణ, అనిత ఇద్దరూ కలిసి పెరగడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు మొదట్లో ఒప్పుకోకపోయినా.. తర్వాత ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంకా రెండు నెలలకు అనిత మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయించుకొని అన్ని సిద్ధం చేసుకున్నారు.కబళించిన రోడ్డు ప్రమాదంఈ క్రమంలో విధి వీరి జీవితాలతో ఆడుకుంది. సాయికృష్ణ (24)కు రైల్వేకోడూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. చేరేందుకు స్కూటీపై శనివారం రైల్వేకోడూరుకు వెళ్లాడు. అక్కడ ఉండేవారు తిరుపతికి వెళ్లాలని చెప్పడంతో తిరుపతికి వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న మరదలు అనిత నంద్యాల డెమో రైలులో తిరుపతికి వెళ్లింది. ఇద్దరు కలిసి తిరుపతిలో ఉంటున్న అజయ్ కృష్ణతో మాట్లాడారు. సాయంత్రం అనిత, సాయికృష్ణ స్కూటీపై తిరుపతి నుంచి ఇంటికి బయలు దేరారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపానికి రాగానే.. వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఇద్దరిపై నుంచి లారీ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓబులవారిపల్లిలోని ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలిసి మె లిసి మంచి వాడు అన్న పేరు ఉన్న సాయికృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతదేహాలను సర్పంచ్ ఎన్పీ జయపాల్‌రెడ్డి సందర్శించి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అన్నమయ్య జిల్లా: లారీ బోల్తా.. తొమ్మిది మంది దుర్మరణం
ఓబులవారిపల్లె/పుల్లంపేట: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తాపడి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు. ఈ దుర్ఘటనలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 22 మంది కూలీలు ఐషర్ వాహనంపై రాజంపేట ఇసుకపల్లి గ్రామానికి మామిడి కాయల్ని కోసి, లారీలో లోడ్ చేసేందుకు వెళ్లారు. మామిడి కాయల్ని లోడ్ చేసిన అనంతరం అదే లారీపై రైల్వేకోడూరు మామిడి మార్కెట్ యార్డుకు బయలుదేరారు. లారీ రెడ్డిపల్లి చెరువుకట్టపైకి రాగా మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో గజ్జల దుర్గయ్య, గజ్జల వెంకటేశు, గజ్జల శ్రీను, గజ్జల రమణ, సుబ్బరత్నమ్మ, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి, రాధా, వెంకట సుబ్బమ్మ మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 13 మంది కూలీలను 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారీ కూలీలే. ఘటనా స్థలాన్ని ఎస్పీ రామ్‌నాథ్ కార్గే పరిశీలించారు. లారీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలిసాక్షి, అమరావతి: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఆదివారం రాత్రి మామిడి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన తొమ్మిది మంది చనిపోవడం, 13 మంది తీవ్రంగా గాయ పడటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరంతా నిరుపేదలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారిని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సీఐ వార్నింగ్.. వ్యక్తి ఆత్మహత్య
చొప్పదండి/కరీంనగర్ క్రైం: గృహహింస, వరకట్న వేధింపుల కేసులో తనను అత్తింటివారితోపాటు మధ్యవర్తులు, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ వేధిస్తున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 7వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్‌కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ వ్యవహారంలో చొప్పదండి పోలీసులు కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీలత, మృతుడి భార్య, అత్త, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు.కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి నీలిమతో 2021 జూన్‌లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి నీలిమ తల్లిగారింట్లో ఉంటోంది. గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో నీలిమ వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో శ్రవణ్‌తోపాటు, అతని తండ్రి నర్సింగం, తల్లి విజయ, అక్క కడారి వనజ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ సీఐ శ్రీలత ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. నేను చెప్పినట్లు వింటే మంచిది. కంప్రమైజ్ చేసుకో. లేకుంటే ఇబ్బంది పడతావు’అని బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సీఐ శ్రీలత, తన భార్య, అత్త, మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతు న్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రవణ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. శ్రవణ్ తండ్రి నర్సింగం ఫిర్యాదుతో సీఐ శ్రీలత, నీలిమ, ప్రవీణ్‌కుమార్, నవీన్‌కు మార్, ఎడ్ల ప్రసన్న, బత్తుల వినోద, బత్తుల మధుకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు. శ్రవణ్ మృతితో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అతడి బంధు వులు ఆందోళన నిర్వహించారు. శ్రవణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ చిరునవ్వులిక కానరావు
హైదరాబాద్: ఇంటి ఆవరణలోని సంప్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిలాఘన్పూర్ మండలానికి చెందిన సభావత్ శ్రీను, నీల దంపతులకు ఓ కూతురు అఖిల, కుమారుడు అభి (4) ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం వలస వచ్చి నగరంలో మియాపూర్ హఫీజ్‌పేట్ సుభాష్‌చంద్రబోస్ నగర్ కాలనీలో నివాసముంటున్నారు. స్థానికంగా సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బాలుడు అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం శ్రీను, నీల దంపతులు కూలిపనుల నిమిత్తం వెళ్లగా కూతురు అఖిల, కుమారుడు అభి ఇంటి వద్ద ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో బాలుడు అభి ఇంటి ఆవరణంలో ఉన్న సంపులో నుంచి నీటిని తీసుకునేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమీపంలో ఆడుకుంటూ ఉన్న అఖిల చూసి స్థానికులకు చెప్పడంతో అభిని సంపులోంచి బయటకు తీసి సమీపంలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. సంపుపై మూత ఏర్పాటు చేయా లని ఇంటి యజమానికి పలుమార్లు చెప్పి నా పట్టించుకోలేదని.. దీంతో తమ కుమారుడు మృత్యువాత పడినట్లు అభి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.