huge
-
హైదరాబాద్‌లో భారీ కేక్.. ఏకంగా 2254 కేజీలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : అమ్మవారి రంగం ఊరేగింపుల్లో హోరెత్తిన భక్తులు (ఫొటోలు)
-
బందరు తీరంలో భారీ చేప.. బరువు తెలిస్తే షాకే..
సాక్షి, కృష్ణా జిల్లా: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బందరు తీరంలో వలకు భారీ టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది.ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.కాగా, బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతుంటారు. -
విశాఖ సింహాచల గిరి ప్రదక్షిణకు తరలి వచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
ఉత్తరప్రదేశ్: దర్గాలో తొక్కిసలాట.. వృద్ధుని మృతి
జలేసర్: ఉత్తరప్రదేశ్‌లోని జలేసర్‌లో బడే మియా- చోటే మియా దర్గాలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆషాఢమాసంలోని మూడో శనివారం ఇక్కడ శని జాతర నిర్వహిస్తుంటారు. ప్రతీసారి మాదిరిగానే ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం ఇక్కడికి తరలివచ్చారు. వీధుల్లో ఎక్కడ చూసినా విపరీతమైన జనం ఉన్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి.దర్గాకు వచ్చిన ఫిరోజాబాద్ జిల్లా ఫరీహా పోలీస్ స్టేషన్‌లోని మీట్‌పురా గ్రామానికి చెందిన బదన్ సింగ్(70) తన కుటుంబం నుండి విడిపోయాడు. జనం మధ్య తిరుగుతూ, విపరీతమైన వేడి, జనం తాకిడి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని ఇక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపగా, అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం బదన్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.దర్గాకు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూజలు చేసేందుకు అక్కడకు వచ్చినవారంతా పోటీ పడ్డారు. దీంతో తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. -
ఆదుకున్న ‘దీవెన’..అందిన ఉద్యోగం
సాక్షి, అమరావతి: ఓ వైపు పేదరికంతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ప్రభుత్వం అందిస్తున్న ఫీజురీయింబర్స్‌మెంట్, మరోవైపు కోర్సుల్లో చేరాక ప్రముఖ సంస్థలతో ఉచితంగా ఇప్పిస్తున్న నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్.. వెరసి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకుంటున్నారు. బహుళజాతి సంస్థల్లో మంచి పే ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో అవకాశాలు పొందేలా కార్యాచరణ అమలు చేస్తోంది. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఇంజనీరింగ్ కోర్సులకే కాకుండా అన్ని డిగ్రీ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ను వర్తింపచేసింది. ఆయా కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను అందించడానికి 30కిపైగా ప్రపంచ స్థాయి సంస్థలు, మరో 27 వేలకుపైగా పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం ఏకంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 10 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్‌లను అందించింది. వీటికి తోడు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఫ్యూచర్ స్కిల్స్ అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న యువత కలిగిన అగ్ర రాష్ట్రాల జాబితాలో కొనసాగుతోంది. నైపుణ్యాలతో కూడిన ఉన్నత విద్యను అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ.. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేలా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్‌తోపాటు తదితర సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టీఫికేషన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.37 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చింది. అలాగే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, క్యాడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాల్లో శిక్షణ అందిస్తోంది. ఉద్యోగ నియామకాల్లో గణనీయ ప్రగతి.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గత మూడేళ్లలో విద్యార్థులకు ప్లేస్మెంట్లు గణనీయంగా పెరిగాయి. 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య కేవలం 37 వేలు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 లక్షలకు చేరుకుంది. ఇందులో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో ఉద్యోగాలు పొందినవారు 60 వేల మంది వరకు ఉన్నారు. ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే 12వేలకు పైగా ప్లేస్మెంట్లు లభించాయి. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే ఈ పెరుగుదల సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అందించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. సర్టీఫికెట్లను సైతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులు చేసి మరీ తమ పిల్లను చదివించాల్సిన దుస్థితి నెలకొంది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి గరిష్టంగా రూ.35వేలలోపు ఇస్తే.. జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3 లక్షలకు వరకు చెల్లిస్తోంది. అంతేకాకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థి తల్లులు ఖాతాల్లోనే క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేస్తోంది. లక్షన్నర మందికి శిక్షణ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్విసెస్ కంపెనీస్ (నాస్కామ్) ఫ్యూచర్ స్కిల్స్ పేరిట లక్ష మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ విభాగాల్లో వర్చువల్‌గా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. అలాగే ‘ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ప్రెస్’ సంస్థతో 50 వేల మందికి శిక్షణ ఇప్పిస్తోంది. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వీస్, హోండా, మారుతి సుజికి వంటి కంపెనీల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్విసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) ఎనలిస్ట్ తదితర అంశాల్లో ఈ శిక్షణ అందించింది. ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ సంస్థతో వర్చువల్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి వీలుగా ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందించింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలనూ చెల్లించి.. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లించడం విశేషం. గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. బాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతికి చెల్లింపులు ఏడాదికి సగటున కేవలం రూ.2,428 కోట్లు ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లను చెల్లిస్తోంది. భోజన, వసతి ఖర్చు కింద ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గత ప్రభుత్వం కేవలం రూ.4 నుంచి రూ.10 వేల వరకే ఇచ్చేది. ఈ పథకం అమలుకు గత ప్రభుత్వం విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయాన్ని బీసీ, ఈబీసీ, కాపు, మైనారీ్టలకు రూ.లక్షకు, ఎస్సీ, ఎస్టీ, పీడీబ్ల్యూలకు రూ.2 లక్షలకు పరిమితం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి లబ్ధి చేకూర్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఆదుకుంది.. మాది పేద రైతు కుటుంబం. గతంలో సాగుకే అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. 2017లో అన్న వరుణ్‌కుమార్‌రెడ్డి తిరుపతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాడు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం రూ.35 వేలు మాత్రమే. మిగిలిన ఫీజు అప్పులు చేసి కట్టాల్సి వచ్చింది. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. దీంతో నేను 2019లో వడ్లమూడిలోని విజ్ఞాన్ లారాలో బీటెక్ సీఎస్ఈలో చేరాను. జగనన్న సాయంతో ఏటా రూ.85 వేల ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండానే నా చదువు పూర్తి చేశాను. ఇప్పుడు బెంగళూరులోని టీసీఎస్‌లో రూ.3.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. – బోరెడ్డి పవన్ కుమార్‌రెడ్డి, సొలస గ్రామం, పల్నాడు జిల్లా జగనన్న విద్యాదీవెన గొప్ప పథకం.. నాన్న హరనాథ్ నిర్వహించే ఫ్యాన్సీ షాపు మాకు జీవనాధారం. నన్ను, అన్నయ్యను చదివించడానికి చాలా కష్టపడ్డారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రావడంతో నేను దిగులు లేకుండా టెక్కలిలో బీటెక్ సీఎస్సీ పూర్తి చేశాను. ఏడాదికి రూ.80వేల చొప్పున కోర్సు నాలుగేళ్లపాటు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. కాలేజీలో ఉండగానే ఉచితంగా సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్ అందించడంతో డెలాయిట్‌లో ఉద్యోగం సాధించగలిగాను. జగనన్న విద్యాదీవెన కచ్చితంగా గొప్ప పథకం. – సత్యవరపు మహాలక్ష్మి, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు మా నాన్న నగేశ్ సామాన్య కూరగాయల వ్యాపారి. నేను విద్యా దీవెన సాయంతో గతేడాది బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశా. ఉన్నత విద్యా మండలి ఉచితంగా ఎన్నో సర్టీఫికేషన్ కోర్సులు అందించింది. ఫలితంగా సాధారణ డిగ్రీ చేసిన నాకు హెచ్‌సీఎల్‌లో రూ.2.40 లక్షల ప్యాకేజీతో ఫైనాన్స్ ఎనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి నాలుగు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయ్యాను. ఎడ్యుటెక్ సంస్థలో 6.50 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేశారు. కంప్యూటర్స్ కెరీర్లో ఎదగాలని హెచ్సీఎల్ను ఎంపిక చేసుకున్నా. – ముదిలి నాగకార్తీక్, విజయవాడ విద్యాదీవెన ఆదుకుంది మా నాన్న రామచంద్రరావు ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా చేస్తున్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములం. నాన్న ఏడాది సంపాదన లెక్కేస్తే మా ఇద్దరి చదువులకే సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ అందడంతో నేను బీఎస్సీ (ఐవోటీ) పూర్తి చేశాను. తమ్ముడు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేస్తున్నాడు. నాకు మూడేళ్లు రూ.30 వేల చొప్పున పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. – పట్నియక్ శ్రీనివాసరావు, విజయవాడ -
సంక్రాంతి వేళ.. ప్రయాణం కిటకిట (ఫొటోలు)
-
AP: భారీగా పెరిగిన ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఏటా పెరుగుతున్న కొత్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలే ఇందుకు నిదర్శనం. 2018–19తో పోలిస్తే 2022–23లో రాష్ట్రంలో ఈపీఎఫ్ ఖాతాలు 35 శాతం మేర పెరిగినట్టు ఇటీవల రాజ్యసభలో కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖ వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వం ఉండగా 2018–19లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలు ఉండేవి. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయి. ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, మరోపక్క ప్రైవేటు రంగంలోనూ ఉపాధి పెరిగేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. దీంతో 2020–21లో రాష్ట్రంలో పీఎఫ్ ఖాతాల సంఖ్య 52.39 లక్షలకు పెరిగింది. అంతే సుమారు 5.5 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. 2021–22లో వీటి సంఖ్య 56.34 లక్షలకు పెరిగాయి. 2022–23లో 60.73 లక్షలకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో 2018–19లో 22.91 కోట్లుగా ఉన్న పీఎఫ్ ఖాతాలు 2022–23 నాటికి 29.88 కోట్లకు చేరుకున్నాయి. జాతీయ స్థాయిలో ఐదేళ్లలో 30.38 శాతం ఖాతాలు పెరిగాయి. ఈ లెక్కన జాతీయ స్థాయి కన్నా రాష్ట్రంలోనే పీఎఫ్ ఖాతాల పెరుగుదల ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో 31 శాతం, కర్ణాటకలో 32 శాతం, తమిళనాడు, పుదుచ్చేరిలో 27 శాతం మేర ఖాతాలు పెరిగాయి. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ వైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తూనే, మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో యువతకు ఉద్యోగాలిచ్చారు. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే ఏకంగా 1,25,110 మంది యువతకు శాశ్వత ఉద్యోగాలిచ్చారు. మరోపక్క ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చారు. ఇలా వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మిగిలిన ప్రభుత్వ శాఖల్లోనూ శాశ్వత, కాంట్రాక్టు పద్ధతుల్లో నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు అండగా నిలిచారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదికల్లోనూ వెల్లడైంది. 2018–19లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో 45 మంది, పట్టణాల్లో 73 మంది నిరుద్యోగులు ఉండగా 2022–23లో గ్రామాల్లో 33, పట్టణాల్లో 65కు నిరుద్యోగిత తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. -
ఆటకు అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. 2.99లక్షల మ్యాచ్‌లు.. 52.31లక్షల క్రీడాకారులు తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉండగా.. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు (మెన్, ఉమెన్) సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్లైన్లో aadudamandhra.ap.gov. in వెబ్సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఐదు క్రీడాంశాల్లో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించామన్నారు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామని చెప్పారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఫైనల్స్‌ను విశాఖలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం?
పలు రిపోర్టుల ప్రకారం దేశంలో కోటికిపైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. వీధి కుక్కల జనాభా దాదాపు 3.5 కోట్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశంలో కుక్కకాటు కేసులు 4,146 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 27.52 లక్షల కేసులు నమోదయ్యాయి, తమిళనాడు (20.7 లక్షలు), మహారాష్ట్ర (15.75 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీధికుక్కలు కొన్ని సందర్భాల్లో మనుషులను కరుస్తుంటాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. చట్టం ప్రకారం 2001 నుండి భారతదేశంలో కుక్కలను చంపడాన్ని నిషేధించారు. అయితే 2008లో ముంబయి హైకోర్టు నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. మునిసిపాలిటీలకు వీధి కుక్కలను చంపడానికి అనుమతినిచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (జీ) వన్యప్రాణులను రక్షించడం, అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్థానికులు తమ నివాస ప్రాంతాల్లోని వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గత ఏడాది సమర్థించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత -
రూ.2,300 కోట్లతో.. విశాఖలో భారీ ఐటీ బిజినెస్ పార్క్
సాక్షి, అమరావతి: ఐటీ, ఐటీ ఆథారిత పరిశ్రమల ఆకర్షణలో విశాఖ నగరం ముందంజలో ఉందని ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీఐఐసీ (ఏపీ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కూడా భారీ ఐటీ బిజినెస్ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్తో పాటు ఐటీ పార్క్ ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. మధురవాడ హిల్ నెంబర్–3 మీద 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐ–స్పేస్ పేరుతో ఈ ఐటీ బిజినెస్ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ తాజాగా బిడ్లను ఆహ్వనించింది. ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించుకునే సంస్థలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలతో పాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫెసిలిటీలతో పాటు తగినంత పార్కింగ్ సదుపాయాలు ఉండే విధంగా ఈ క్యాంపస్‌ను సుమారు రూ.2,300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం భాగస్వామ్య కంపెనీతో ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తారు. ఈ ఎస్పీవీలో ఏపీఐఐసీ 26 శాతం వాటాను, భాగస్వామ్య కంపెనీ 74 శాతం వాటాను కలిగి ఉంటుంది. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా.. ఇక మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,300 కోట్లలో 40 శాతం ఈక్విటీగా సమకూర్చాల్సి ఉంటుంది. ఈక్విటీ రూపంలో ఏపీఐఐసీ రూ.239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ రూ.681 కోట్లు సమకూరుస్తాయి. మిగిలిన మొత్తం రూ.1,380 కోట్లను రుణ రూపంలో సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం, బ్రాండింగ్, నిర్వహణ అన్నీ భాగస్వామ్య కంపెనీయే చూడాల్సి ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. బహుళజాతి సంస్థలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించామని, భాగస్వామ్య కంపెనీ ఎన్నిక అనంతరం నిర్మాణ పనులను ప్రారంభించి వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు.. గడిచిన ఐదేళ్లలో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పలు అంతర్జాతీయ సంస్థలు, రిటైల్ సంస్థలు విశాఖలో ఏర్పాటుకావడంతో స్థిరాస్తి ధరలు 20 శాతం పైగా పెరిగినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వాణిజ్య సముదాయాలకు భారీగా డిమాండ్ ఉండటంతో ఐ–స్పేస్ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. -
పరిటాల వారి నకిలీ ఓట్ల రాజకీయం
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో ఇంటి నంబరు 8–63లో 12 ఓట్లు ఉన్నాయి. అందులో ఆరుగురు స్థానికులే. మరో ఆరుగురు కర్ణాటకకు చెందిన వారు. వాళ్లంతా పోలింగ్ రోజునే ఇక్కడికి వస్తారు. ఓటు వేసి వెళ్లిపోతారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు ఓట్లేయడానికే తప్ప ఇటు వైపు కన్నెత్తి కూడా చూడరు. కర్ణాటకకు చెందిన కె.ప్రతాప్ (48), బి.రమేశ్‌కుమార్ (49), వి.నాగయ్య (73), డి.వెంకటస్వామి (71), డి.వెంకటప్ప (48), వి.వెంకటస్వామి (68) పేర్లు రామగిరి మండలం నసనకోట పంచాయతీ ఓటరు జాబితాలో ఉన్నాయి. వీళ్లందరూ ఎన్నికల రోజు మినహా మిగతా రోజుల్లో ఆంధ్రలో కనిపించరు. ...రామగిరి మండలంలో ఇలాంటి నకిలీ ఓట్లు చాలా పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి పంచాయతీలో కర్ణాటక వాసులను, ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను ఓటరు జాబితాలో ఎక్కించి దొంగ ఓట్లు వేయించుకోవడమే పరిటాల కుటుంబం పని. సాక్షి, పుట్టపర్తి: గత ఎన్నికల్లో ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో ‘పరి టాల’ కుటుంబం దొంగ ఓట్లను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితాపై లేనిపోని రాద్ధాంతం చే స్తోంది. పరిటాల రవీంద్ర టీడీపీలో ప్రవేశించినప్పటి నుంచి నకిలీ ఓట్లపైనే ఆధారపడ్డారు. అదే తరహాలో ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా దొంగ ఓట్ల రాజకీయం చేయాలని చూస్తు న్నట్లు తెలుస్తోంది. స్థానికంగా లేని వారి ఓట్ల తొల గింపును ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.రవీంద్ర హయాంలోనే పెనుకొండ (ప్రస్తుతం రాప్తాడు) నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి మండలాల్లో వేల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్చించింది పరిటాల కుటుంబం.రవీంద్రకు భయపడి అధికా రులు ఎదురు మాట్లాడేవారు కాదు. దశాబ్దాలుగా దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్, దౌర్జన్యాలతో అమాయక ప్రజల ఓట్లను వారే వేసుకొనేవారు. ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతోంది.ఫలితంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రలో ఓటరు కార్డులు ఇచ్చేందుకు టీడీపీ నేతలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దొంగ ఓట్ల తొలగింపుపై పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అవి దొంగ ఓట్లే అని ఒప్పు కోలేక, కాదనీ చెప్పలేక రోజుకోరకంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక.. నేరుగా ఎన్నికల్లో ఢీకొనే సత్తా లేక నకిలీ ఓట్లపై పరిటాల కుటుంబం ఆధారపడింది. రవీంద్ర చేసిన హత్యాకాండను ప్రజలు మరువలేదు. నేడు వైఎస్సా ర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంపూర్ణంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాయితీగా గెలవలేక దొంగ ఓట్లపై మాజీ మంత్రి పరిటాల సునీత గతంలో నమోదు చేయించిన దొంగ ఓట్లను కాపాడుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఓట్లలో అధిక శాతం పరిటాల సునీత సొంత పంచాయతీ నసన కోటలోనే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా.. తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారంటూ హంగామా సృష్టిస్తున్నారు. -
వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో భారీ వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 2021–22తో పోల్చి చూస్తే 2022–23లో వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో ఏకంగా 82.14 శాతం వృద్ధి నమోదయ్యింది. 2021–22లో 19,259 వ్యవసాయ ట్రాక్టర్లను రైతులు కొనుగోలు చేయగా.. 2022–23లో ఏకంగా 35,079 వ్యవసాయ ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడంతో పాటు రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడం ద్వారా ఎక్కువ ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ రూపంలో రూ.1,052 కోట్లు వెచి్చంచి రైతులకు లబ్ధి చేకూర్చింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయని రవాణా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూస్తోంది. -
సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు. 'కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.' అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 'సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? ' అని ప్రశ్నించారు. Udhayanidhi Stalin’s hate speech with Hindi subtitles. Rahul Gandhi speaks of ‘मोहब्बत की दुकान’ but Congress ally DMK’s scion talks about eradicating Sanatana Dharma. Congress’s silence is support for this genocidal call… I.N.D.I Alliance, true to its name, if given an… https://t.co/hfTVBBxHQ5 pic.twitter.com/ymMY04f983 — Amit Malviya (@amitmalviya) September 2, 2023 ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. బలహాన వర్గాల పక్షాన తాను మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 'ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW — Udhay (@Udhaystalin) September 2, 2023 ఇదీ చదవండి: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ -
పుంగనూరు ఘటనకు నిరసనగా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ
ప్రొద్దుటూరు: పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోలీసులపై, ప్రజలపై రాళ్లతో దాడులు చేయించినందుకు నిరసనగా ఆదివారం పుట్టపర్తి సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లర్ల సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపి ఉంటే ఎన్నో కుటుంబాలకు గర్భశోకం మిగిలేదని, సంయమనంతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పోలీసులు గ్రేట్ అని అభినందిస్తూ వారికి సెల్యూట్ చేశారు. -
త్రిపుర అసెంబ్లీలో నిరసనలు.. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి..
అగర్తలా: త్రిపుర అసెంబ్లీలో నిరసనల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో అశ్లీల వీడియోల వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే జడాబ్ లాల్ దేబ్‌నాథ్‌ను సస్పెండ్ చేయాలని త్రిపుర మోత పార్టీ(టీఎంపీ), సీపీఐ-ఎమ్, కాంగ్రెస్‌లు డిమాండ్ చేశాయి. అశ్లీల వీడియో అంశంపై చర్చిండానికి ప్రతిపక్ష నేత అనిమేష్ డెబ్బర్మ వేసిన వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ తిరస్కరించగా.. సభలో నిరసనలు మొదలయ్యాయి. అయితే.. మరికాపేటికే ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయంపై స్పీకర్ వెనక్కి తగ్గారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్ 2023-2024 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. ప్రతిపక్షాలు నిరసనలు ప్రారంభించాయి. ప్రతిపక్ష నేతలు పోడియంలోకి ప్రవేశించారు. నినాదాలు చేస్తూ.. ఒకరికొకరు చేతులు కలుపుతూ గొలుసు మాదిరిగా ఏర్పడ్డారు. మరికొందరు నేతలు బల్లాల మీదకు ఎక్కారు. Tripura Assembly Speaker Suspends 5 Opposition MLAs Amid Uproar https://t.co/cFQVBTYbOo pic.twitter.com/96efmlsSRf — NDTV (@ndtv) July 7, 2023 దీంతో స్పీకర్ బిశ్వ బిందు సేన్ ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సుదిప్ రాయ్ బర్మన్, నాయన్ సర్కార్, బ్రిషకేతు డెబ్బర్మ, నందితా రియాంగ్, రంజిత్ డెబ్బర్మలు సస్పెన్షన్ లిస్ట్‌లో ఉన్నారు. దేబ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మళ్లీ అదే రోజు ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయాన్ని స్పీకర్ వెనక్కి తీసుకున్నారు. అయితే.. ఈ ఏడాది ఆరంభంలో సభ జరుగుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యే దేబ్నాథ్ అశ్లీల వీడియో చూస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనిపై దేబ్నాథ్ స్పందిస్తూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసే క్రమంలో ఆ సైట్ అకస్మాత్తుగా ఓపెన్ అయిందని, వెంటనే క్లోజ్ కూడా చేశానని అప్పట్లోనే సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు -
విశాఖ తూర్పు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ
-
ఏపీలో రూ. 1,750 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌తో ఇన్వెస్టర్ల దృష్టిని మరింతగా ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. యాంప్లస్ సోలార్ రూ. 1,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. 7.5 కేపీటీఏ (వార్షికంగా కిలో టన్నులు) సామర్థ్యంతో హరిత హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు యాంప్లస్ సోలార్ తెలిపింది. ఇదీ చదవండి: సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్ సెక్యూరిటీ కీలక సర్వే పారిశ్రామిక వినియోగ అవసరాల కోసం వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో శరద్ పుంగాలియా వివరించారు. అంతర్జాతీయ హరిత హైడ్రోజన్ హబ్‌గా ఎదగాలన్న భారత లక్ష్య సాకారంలో తాము కూడా పాలుపంచుకోనున్నట్లు ఆయ న వివరించారు. ఆ దిశగా ఈ ఎంవోయూ తొలి అడుగు అని శరద్ చెప్పారు. పెట్రోకెమికల్స్, సిమెంటు, ఎరువులు తదితర రంగాల సంస్థలకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక హబ్‌గా మారిన నేపథ్యంలో ఆయా పరిశ్రమల అవసరాల కోసం పునరుత్పాదకత విద్యుదుత్పత్తికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా యని ఆయన పేర్కొన్నారు. యాంప్లస్ పోర్ట్‌ఫోలియోలో 1.4 గిగావాట్ల సోలార్ అసెట్లు ఉన్నాయి. కడపలో ఎలిస్టా ప్లాంటు.. దేశీయంగా అమ్మకాలు, ఎగుమతుల కోసం కడపలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా వెల్లడించింది. దీనిపై వచ్చే అయిదేళ్లలో దశలవారీగా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ సీఎండీ సాకేత్ గౌరవ్ తెలిపారు. తొలుత రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్లాంటులో ఏటా పది లక్షల పైచిలుకు స్మార్ట్ యూనిట్లు, మానిటర్లను తయారు చేయనున్నట్లు ఆయన వివరించారు. అ తర్వాత ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, డిష్వాషర్లు వంటి గృహోపకరణాల విభాగాల్లోకి కూడా ప్రవేశించనున్నట్లు గౌరవ్ చెప్పారు. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! ప్రస్తుతం రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్న తమ ఆదాయాలు ఈ ప్లాంటు పూర్తిగా అందుబాటులోకి వస్తే రూ. 1,500 కోట్లకు చేరగలవని ఆయన పేర్కొన్నారు. దీనితో 500 పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లాంటు నుంచి వచ్చే ఆదాయంలో 60 శాతం వాటా ఎగుమతుల మార్కెట్ నుంచే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు గౌరవ్ తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన టెక్నోడోమ్ గ్రూప్‌లో భాగంగా 2020లో ఎలిస్టా ఏర్పాటైంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ -
నెలకు రూ.4 లక్షలు: రెండేళ్లు కష్టపడితే, కోటి...కానీ..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలతో గ్లోబల్‌గా ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో ఒక ఆసక్తికర పరిణామం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అదేంటి అంటే.. నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నా అబెర్డీన్ తీరంలో ఉత్తర సముద్రంలో ఆఫ్‌షోర్ రిగ్గర్ ఉద్యోగానికి అప్లయ్ చేసుకునే నాధుడే దాదాపు కనిపించడం లేదట. విషయం ఏమిటంటే స్కాట్లాండ్లో ఈ ఉద్యోగం. అబెర్డీన్లోని నార్త్ సీ తీరంలో పనిచేయాల్సి ఉంటుంది సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పాటైన రిగ్‌లో ఆఫ్‌షోర్ రిగ్గర్ అభ్యర్థి సముద్రగర్భం నుంచి ఖనిజ నిల్వలను అన్వేషించడం, వెలికితీయడం, ఆయిల్ వెలికితీయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. BOSIET (బేసిక్ ఆఫ్‌షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), FOET (ఫర్దర్ ఆఫ్‌షోర్ ఎమర్జెన్సీ ట్రెనింగ్), CA-EBS (కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్), OGUK మెడికల్ ట్రైనింగ్ వంటివి శిక్షణ పొంది ఉండాలి. ఉద్యోగికి సెలెక్ట్ అయితే రోజుకు 12 గంటల పని. రోజుకు రూ.36 వేల చొప్పున నెలకు రూ.4 లక్షలు జీతం చెల్లిస్తారు. ఒక షిప్ట్ ఒకటి నుండి ఆరు నెలల వరకు ఉంటుంది. కంపెనీ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు,సెలవులు కూడా ఉంటాయి. వారం రోజులు సీక్ లీవ్ కూడా ఉంది. అభ్యర్థి రెండేళ్ల పాటు ఉద్యోగంలో ఉండి, 6-6 నెలల 2 షిఫ్ట్‌లను పూర్తి చేస్తే, అప్పుడు జీతం £95,420 (రూ. 1 కోటి)కి చేరుకుంటుంది. ఇంత భారీ ప్యాకేజీతో మొత్తం 5 ఖాళీలకుగాను 24 రోజుల క్రితం నోటిఫికేషన్ ప్రకటించగా అప్లయ్ చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువట. తన ఖచ్చితమైన గుర్తింపును వెల్లడించకుండానే ఎనర్జీ మార్కెట్లో పెద్ద కంపెనీగా చెప్పుకున్న సంస్థ ఈ ప్రకటన ఇచ్చింది. -
తెలంగాణాలో భారీగా పెరిగిన అప్పులు
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం
-
వైరల్ వీడియో : ఇదేమి జర్నీరా అయ్యా..!
-
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
స్పెషల్ సాంగ్ కోసం భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్న రష్మిక
-
కార్తీక శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
-
హైదరాబాద్ నడిబొడ్డున భారీ కొండచిలువ కలకలం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
పండక్కి కొత్త బండి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే కష్టమే. నచ్చిన బండి కోసం మరి కొద్ది నెలల పాటు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాయాల్సిందే. గ్రేటర్లో కొత్త వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ అందుకు తగినవిధంగా వాహనాల లభ్యత లేకపోవడంతో వేలాది మంది కొనుగోలుదార్లు ఇప్పటికే తమకు కావలసిన కార్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఇప్పటికిప్పుడు కొత్త కారు కొనుగోలు చేయడం కష్టమేనని ఆటోమొబైల్ షోరూమ్ డీలర్లు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో మధ్యతరగతి వేతన జీవులు కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగానూ, ఒక సంప్రదాయంగాను భావిస్తారు. ఈసారి కూడా అలాగే కొత్త వాహనాల కోసం ఆసక్తి చూపే వాళ్లకు నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్నా కనీసం ఐదారు నెలల పాటు ఆగాల్సిందేనని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లుగా వ్యక్తిగత వాహనాలకు గణనీయమైన డిమాండ్ నెలకొన్నది. కోవిడ్ దృష్ట్యా చిరుద్యోగులు మొదలుకొని మధ్యతరగతి వర్గాల వరకు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అందుకు తగిన విధంగా వాహనాలు మాత్రం దిగుమతి కావడం లేదు. దీంతో కొరత ఏర్పడింది. ఆగాల్సిందే... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. రవాణాశాఖలో ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కొత్త వాహనాలకు డిమాండ్‌కు పెరగడంతో నమోదయ్యే వాహనాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వ్యక్తిగత వాహనాల కేటగిరీలో అన్ని రకాల వాహనాలకు వెయిటింగ్ తప్పడం లేదు. హ్యూందాయ్, కియా, టయోటా, నెక్సాన్, మారుతి తదితర కంపెనీలకు చెందిన కార్ల కోసం 4 నుంచి 5 నెలల పాటు వెయిటింగ్ ఉంది. బాగా డిమాండ్ ఉన్న కొన్ని ప్రీమియం వాహనాలకు 6 నెలల వరకు కూడా డిమాండ్ నెలకొంది. ద్విచక్ర వాహనాలలో యూనికార్న్, హోండా యాక్టివా 125కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహనాలకు 3 నెలల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చునని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీపావళికి కూడా డిమాండ్ భారీగానే ఉండే అవకాశం ఉంది. చిప్స్ కొరతే కారణం... వాహనాల తయారీలో కీలకమైన సాఫ్ట్వేర్ చిప్స్ దిగుమతి తగ్గడం వల్లనే ఈ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. మలేసియా, తైవాన్, చైనాల నుంచి మన దేశానికి వాహనాల చిప్స్ దిగుమతి అవుతాయి. రెండేళ్లుగా కోవిడ్ వల్ల చైనా నుంచి చిప్స్ దిగుమతి తగ్గిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల డిమాండ్ పెరగడంతో మలేసియా, తైవాన్‌ల నుంచి సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో వాహనాల తయారీ కూడా మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘గత నెలతో పోలి్చతే ఈ నెలలో చిప్స్ కొరత కొంత వరకు తగ్గింది. దిగుమతి పెరిగింది. గతంలో 80 శాతం వరకు కొరత ఉండేది. ఇప్పుడు 40 శాతానికి తగ్గింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కావచ్చు’. అని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ తెలిపారు. (చదవండి: తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి) -
షావోమి 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్ త్వరలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి త్వరలోనే 200 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, 200MP సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్, 120Hz డిస్ప్లే , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ అందుబాటులో రానుంది. ఇప్పటికే మోటరోలా తన తదుపరి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను 200 ఎంపీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అలాగే శాంసంగ్ కూడా 50 మెగాపిక్సెల్ ISOCELL జీఎన్ఎస్ సెన్సార్, 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ రేసులో షావోమి కూడా చేరింది. కాగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విక్రేతలు దేశంలో 38 మిలియన్ స్మార్ట్ఫోన్లను రవాణా చేయడంతో 2022 క్యూ1లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సంవత్సరానికి కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. ఈ సమయంలో 8 మిలియన్ యూనిట్లన విక్రయాలతో షావోమి ఇండియాలో టాప్ బ్రాండ్‌గా నిలిచింది. శాంసంగ్ 6.9 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది. -
హృదయాన్ని కదిలించే క్షణం: అపురూపమైన ఆలింగనం
న్యూఢిల్లీ: కేరళలోని వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ పర్యటించి పలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్‌తో కలసి ఒక కేఫ్‌లో కూర్చొన్నారు. ఇంతలో అక్కడికి ఒక వృద్ధ మహిళ వచ్చింది. వెంటనే రాహుల్ ఆమె మనతో ఎందుకు కూర్చొదు..అంటూ వేణుగోపాల్‌ని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ సీనియర్ నాయకుడు ఆ మహిళకు రాహుల్ భావనను అనువదించి ఆ వృద్ధ మహిళకి చెప్పారు. అంతేకాదు ఆమెకు తమ ప్లేట్లోని ఆహారాన్ని కూడా రాహుల్ స్వయంగా అందించారు. ఆ తర్వాత ఆమె రాహుల్ గాంధీ చెంపను ప్రేమతో తాకి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ అపురూపమైన ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు.."ఇది మాటలతో నిర్వచించలేని ప్రేమపూర్వకమైన ఆరాధన" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నిజమైన నాయకుడు నిస్వార్థంగా తన ప్రజల కోసం, దేశం కోసం పనిచేసినప్పుడూ, పోరాడినప్పుడూ ఇలాంటి ప్రేమపూర్వకమైన అభిమానాన్ని అందుకుంటారని కూడా ట్వీట్ చేసింది. Unscripted pure love and adoration - this is what a true leader receives when he selflessly works and fights for his people and his country. pic.twitter.com/4cbU0Khxce — Congress (@INCIndia) July 3, 2022 (చదవండి: తుపాను కారణంగా రెండుగా ముక్కలైన ఓడ...12 మంది మృతి) -
నల్గొండ మున్సిపాలిటీలో నిధుల స్వాహా
-
భారీ ఇంజిన్‌తో ఖరీదైన బైక్
సాక్షి, న్యూఢిల్లీ: యూకేకు చెందిన మోటార్‌సైకిల్ తయారీ దిగ్గజం ట్రయంఫ్ రాకెట్ 3 బ్రాండ్ లో అత్యంత ఖరీదైన కొత్త మెటార్ బైక్ లాంచ్ చేసింది. భారీ ఇంజిన్‌తో రాకెట్ 3 జీటీ పేరుతో దీన్ని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ .18.4 లక్షలుగా నిర్ణయించింది. కరోనా సంక్షోభం కాలంలో అమ్మకాలు లేక దేశం నుంచి వైదొలగాలని మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ భావిస్తున్న తరుణంలో ట్రయంఫ్ అద్భుత ఫీచర్లతో ఈ కొత్త మోటార్ సైకిల్ తీసుకువడం విశేషం. రాకెట్ 3 జీటీ స్పెసిఫికేషన్లు ట్రిపుల్ మెటారు ప్రధాన ఆకర్షణ. అతిపెద్ద 2,500 సీసీ ఇన్ లైన్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ 6000 ఆర్ పీఎమ్ వద్ద 167 బిహెచ్పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గత వెర్షన్ కంటే 11 శాతం ఎక్కువ. కొత్త క్రాంక్కేస్ అసెంబ్లీ, ఇంటిగ్రల్ ఆయిల్ ట్యాంక్, బ్యాలెన్సర్ షాఫ్ట్ కలిగి ఉంది. ఇంజిన్ బరువును 18 కిలోలకు పరిమితం చేసింది. పాత తరం బైక్‌తో పోలిస్తే బరువును సుమారు 40 కిలోలు తగ్గించింది. టూరింగ్ స్టయిల్ హ్యాండిల్‌బార్, పొడవైన విండ్‌స్క్రీన్, గో ప్రో కంట్రెల్స్ తో బ్లూటూత్-ఎనేబుల్డ్ ఫుల్-కలర్ టిఎఫ్టి డాష్, హిల్-హోల్డ్ కంట్రోల్, 4 రైడ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా టార్క్ అసిస్టెడ్ క్లచ్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ఎక్స్టెండెడ్ ఫ్లై స్క్రీన్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్, తేలికపాటి 20-స్పోక్ అల్యూమినియం వీల్ లాంటి ఇతర ఫీచర్లు ఈ బైక్ సొంతం. తమ కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ ఔత్సాహికుల బైక్ అని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షుయెబ్ ఫారూక్ తెలిపారు. అత్యుత్తమ టెక్నాలజీ, ఎర్గోనామిక్స్, ఆశ్చర్యపరిచే పనితీరుతో ఇదొక లెజెండ్ బైక్ అన్నారు. -
హైదరాబాద్‌ను ముంచేస్తున్న ప్లాస్టిక్
-
వరంగల్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
హోరెత్తిన ‘నాగిరెడ్డిపేట’
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌తో ప్రజా ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన మహార్యాలీకి అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో మండల కేంద్రం జన జాతరను తలపించింది. దీంతో సోమవారం పలు గ్రామాల నుంచి ప్రజలు డప్పువాయిద్యాలతో మండల కేంద్రానికి తరలివచ్చారు. మండలకేంద్రంలోని నీటిపారుదల శాఖ అతిథిగృహం వద్ద వారంతా సమావేశమయ్యారు. ప్రధాన రహదారి మీదుగా తహసీల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతునాయకుడు బొల్లు నర్సింహారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో విలీనంచేస్తే కలిగే ప్రయోజనాల గురించి కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. తహసీల్దార్ మంత్రూనాయక్ అక్కడికి రాగా, ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ప్రొబేషనరీ ఎస్సై శంకర్ ఆందోళనకారులను సముదాయించారు. మాజీ జడ్పీటీసీ జయరాజ్, ఐక్యవేదిక నేతలు విఠల్‌గౌడ్, బాలయ్య, నర్సింహులు, బలరాం, బాబురావు, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, రవిగౌడ్, కిష్టయ్య, మురళీ తదితరులు పాల్గొన్నారు. -
తండోపతండాలుగా...
తండోపతండాలుగా ప్రధాని సభకు తరలివెళ్లిన ప్రజలు హైదరాబాద్‌కు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు శామీర్‌పేట్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం, కోమటిబండలో ఆదివారం తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా వస్తున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదికి ఘన స్వాగతం పలికేందుకు మండలం నుంచి భారి సంఖ్యలో తరలివెళ్లారు. శామీర్‌పేట్ మండల కేంద్రంలో కట్టమైసమ్మ వద్ద మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి బస్సుల్లో బయలు దేరుతున్న జనాలకు జెండా ఊపి ప్రారంభించారు. యాచారం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ రాక నిర్వహించే పార్టీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. బీజేపీ మండల అధ్యక్షుడు ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 20 గ్రామాల నుంచి దాదాపు 700 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. -
బ్రెగ్జిట్ బ్లాస్ట్ నుంచి కొద్దిగా తెప్పరిల్లిన మార్కెట్లు
బ్రెగ్జిట్ బ్లాస్ట్ తో అతలాకుతలమైన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి . సెన్సెక్స్ 645 పాయింట్ల నష్టంతో 26, 356 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 193 పాయింట్ల నష్టంతో 8,076 పాయింట్ల దగ్గర క్లోజయ్యాయి. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా భారీ పతనంతో ట్రేడర్లను బెంబేలెత్తించిన మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా తెప్పరిల్లాయి. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారు కావడంతో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పతనం దిశగా పయనించాయి. ముఖ్యంగా ఐటీ,బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు కుదేలయ్యాయి. దీంతో ఈ పరిణామాన్ని బ్లాక్ ఫ్రేడే గా విశ్లేషకులు వ్యాఖ్యానించారు. -
భారీగా పతనమైన మార్కెట్లు
ముంబై: ఆర్బీయై మంగళవారం ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానం సమీక్ష దేశీయ మార్కెట్ల పై ప్రతికూల ప్రభావాన్ని పడేసింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీనికితోడు అంతర్జాతీయ సంకేతాలు, లాభాల స్వీకరణ, క్రూడ్ ఆయల్ ధరల్లో క్షీణత పరిణామాల నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లు పావుశాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఈక్విటీ మార్కెట్లను పతనం వైపు తీసుకెళ్లింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలు జోరు కొనసాగడంతో ఒక దశలో 548 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 516 పాయింట్లు నష్టంతో 24,883 దగ్గర, నిఫ్టీ 155 పాయింట్లు నష్టంతో 7,603 దగ్గర ముగిసింది. -
భారీ ఎర్రచందనం స్వాధీనం
-
భారీ ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో మరోసారి భారీ ఎత్తున ఎర్ర చందనం స్మగ్లింగ్ బయటపడింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఎర్రదుంగలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.20 లక్షలు వరకు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. -
బద్వేల్లో రెచ్చిపోయిన దొంగలు
-
గోరఖ్‌పూర్‌లో భారీ కోండ చిలువ
-
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో్ 27,516 దగ్గర, నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 8,313 దగ్గర ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో సెక్టార్ షేర్లు జోరుమీదున్నాయి. రిలయన్స్ క్యాపిటల్, బజాజ్ ఆటో లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు చైనా మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల హవా దేశీయ మార్కెట్ ను ప్రభావితం చేస్తోంది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా నిలబడటం, సానుకూల పరిణామమని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ మెరుగుపడితే,పసిడి నష్టాల్లో ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి 34 పైసలు లాభపడి 64.78 దగ్గర వుంది. 10 గ్రా. బంగారం 27వేలకు దిగువన ట్రేడవుతోంది. -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
-
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాత సామాన్ల మార్కెట్లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగోలిపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు దాదాపు 400 గుడిసెలు దగ్గమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించింది. దాదాపు 28 అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలికి వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు భారీ ఎత్తున వ్యాపించడంతో చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీ సంఖ్యలో ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం. -
'జాజ్బా' ట్రైలర్‌కు అనూహ్య స్పందన
-
భారీగా నగదు,మద్యం,బంగారం స్వాధీనం
-
కాకినాడలో భారీ అగ్నిప్రమాదం
-
కార్తీకమాసంలో పాపికొండల యాత్రకు పెరిగిన రద్దీ
-
సమైక్యశంఖారావానికి మద్దతు పలికిన ఎస్వీయూజాక్
-
జగన్ దీక్షకు ప్రజల నుంచి మంచి స్పందన