ముంబై:
ఆర్బీయై మంగళవారం ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానం సమీక్ష దేశీయ మార్కెట్ల పై ప్రతికూల ప్రభావాన్ని పడేసింది. దీంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీనికితోడు అంతర్జాతీయ సంకేతాలు, లాభాల స్వీకరణ, క్రూడ్ ఆయల్ ధరల్లో క్షీణత పరిణామాల నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లు పావుశాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఈక్విటీ మార్కెట్లను పతనం వైపు తీసుకెళ్లింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో అమ్మకాలు జోరు కొనసాగడంతో ఒక దశలో 548 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 516 పాయింట్లు నష్టంతో 24,883 దగ్గర, నిఫ్టీ 155 పాయింట్లు నష్టంతో 7,603 దగ్గర ముగిసింది.