సాక్షి, ముంబై : దేశీయ ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. మధ్యాహ్నం వరకు సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అయినప్పటకీ 2 గంటల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎకనామిక్ డేటా విడుదల కానున్న నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 229 పాయింట్లు దిగజారి 40,116కు పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లను నష్టపోయి 11,840కి స్థిరపడ్డాయి.
టీసీఎస్ (3.74%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.48%), ఎన్టీపీసీ (0.30%), మారుతి సుజుకి (0.25%) షేర్లు లాభాల బాటలో నడవగా.. యస్ బ్యాంక్ (-5.96%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.64%), యాక్సిస్ (-3.22%), వేదాంత లిమిటెడ్ (-3.02%), సన్ ఫార్మా (-2.29%) షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 56 పైసలు కోల్పోయి 72.02గా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment