
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాత సామాన్ల మార్కెట్లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగోలిపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు దాదాపు 400 గుడిసెలు దగ్గమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు.
ఘటన జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించింది. దాదాపు 28 అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలికి వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు భారీ ఎత్తున వ్యాపించడంతో చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. భారీ సంఖ్యలో ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం.