హృదయాన్ని కదిలించే క్షణం: అపురూపమైన ఆలింగనం | Rahul Gandhi Offering Food Warmly Hugging An Elderly Woman Viral | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వృద్ధ మహళ: వీడియో వైరల్‌

Published Mon, Jul 4 2022 9:22 PM | Last Updated on Mon, Jul 4 2022 9:30 PM

Rahul Gandhi Offering Food Warmly Hugging An Elderly Woman Viral - Sakshi

న్యూఢిల్లీ: కేరళలోని వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ పర్యటించి పలు కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీ సీనియర్‌ నాయకుడు వేణుగోపాల్‌తో కలసి ఒక కేఫ్‌లో కూర్చొన్నారు. ఇంతలో అక్కడికి ఒక వృద్ధ మహిళ వచ్చింది. వెంటనే రాహుల్ ఆమె మనతో ఎందుకు కూర్చొదు..అంటూ వేణుగోపాల్‌ని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ సీనియర్‌ నాయకుడు ఆ మహిళకు రాహుల్‌ భావనను అనువదించి ఆ వృద్ధ మహిళకి చెప్పారు.

అంతేకాదు ఆమెకు తమ ప్లేట్‌లోని ఆహారాన్ని కూడా రాహుల్‌ స్వయంగా అందించారు. ఆ తర్వాత ఆమె రాహుల్‌ గాంధీ చెంపను ప్రేమతో తాకి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ అపురూపమైన ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు.."ఇది మాటలతో నిర్వచించలేని ప్రేమపూర్వకమైన ఆరాధన" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. నిజమైన నాయకుడు నిస్వార్థంగా తన ప్రజల కోసం, దేశం కోసం పనిచేసినప్పుడూ, పోరాడినప్పుడూ ఇలాంటి ప్రేమపూర్వకమైన అభిమానాన్ని అందుకుంటారని కూడా ట్వీట్‌ చేసింది. 

(చదవండి: తుపాను కారణంగా రెండుగా ముక్కలైన ఓడ...12 మంది మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement