
తండోపతండాలుగా...
తండోపతండాలుగా ప్రధాని సభకు తరలివెళ్లిన ప్రజలు
హైదరాబాద్‌కు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు
శామీర్‌పేట్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం, కోమటిబండలో ఆదివారం తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ది పనులను ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా వస్తున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదికి ఘన స్వాగతం పలికేందుకు మండలం నుంచి భారి సంఖ్యలో తరలివెళ్లారు. శామీర్‌పేట్ మండల కేంద్రంలో కట్టమైసమ్మ వద్ద మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి బస్సుల్లో బయలు దేరుతున్న జనాలకు జెండా ఊపి ప్రారంభించారు.
యాచారం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ రాక నిర్వహించే పార్టీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. బీజేపీ మండల అధ్యక్షుడు ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 20 గ్రామాల నుంచి దాదాపు 700 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.