
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో్ 27,516 దగ్గర, నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 8,313 దగ్గర ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఆటో సెక్టార్ షేర్లు జోరుమీదున్నాయి. రిలయన్స్ క్యాపిటల్, బజాజ్ ఆటో లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు చైనా మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల హవా దేశీయ మార్కెట్ ను ప్రభావితం చేస్తోంది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా నిలబడటం, సానుకూల పరిణామమని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి విలువ మెరుగుపడితే,పసిడి నష్టాల్లో ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి 34 పైసలు లాభపడి 64.78 దగ్గర వుంది. 10 గ్రా. బంగారం 27వేలకు దిగువన ట్రేడవుతోంది.