సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి త్వరలోనే 200 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, 200MP సెన్సార్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్, 120Hz డిస్‌ప్లే , 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ అందుబాటులో రానుంది.
ఇప్పటికే మోటరోలా తన తదుపరి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను 200 ఎంపీ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అలాగే శాంసంగ్ కూడా 50 మెగాపిక్సెల్ ISOCELL జీఎన్‌ఎస్ సెన్సార్, 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ రేసులో షావోమి కూడా చేరింది.
కాగా ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో విక్రేతలు దేశంలో 38 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను రవాణా చేయడంతో 2022 క్యూ1లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సంవత్సరానికి కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. ఈ సమయంలో 8 మిలియన్ యూనిట్లన విక్రయాలతో షావోమి ఇండియాలో టాప్ బ్రాండ్‌గా నిలిచింది. శాంసంగ్ 6.9 మిలియన్ యూనిట్లను షిప్పింగ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment