సాక్షి, కృష్ణా జిల్లా: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బందరు తీరంలో వలకు భారీ టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది.
ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
కాగా, బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment