ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. గడచిన 30 నెలల్లో మహాశివుని భక్తులు కాశీ కారిడార్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైన తరువాత నాటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్నారు. ఇది మాత్రమే కాదు 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు.
రికార్డు స్థాయిలో శివభక్తులు కాశీకి తరలివస్తున్న కారణంగా ఇక్కడి పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇక్కడి హోటళ్లకు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా విక్రయమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు కారిడార్ నిర్మాణం తరువాత మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ విశ్వనాథ ధామానికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తుల రాకతో థామ్ ఆదాయం 33 శాతం మేరకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment