బుద్ధ పూర్ణిమ వేళ.. భక్తుల గంగా స్నానాలు | Purnima Devotees dip in Mother Ganga | Sakshi
Sakshi News home page

బుద్ధ పూర్ణిమ వేళ.. భక్తుల గంగా స్నానాలు

Published Thu, May 23 2024 12:51 PM | Last Updated on Thu, May 23 2024 1:12 PM

Purnima Devotees dip in Mother Ganga

ఈరోజు (గురువారం) బుద్ధ పూర్ణిమ. ఈ  సందర్భంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్, హరిద్వార్‌లలో భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
 

భక్తులకు భద్రత కల్పించేందుకు వివిధ గంగా ఘాట్‌ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. యూపీలోని వారణాసిలోని అన్ని ఘాట్‌లు భక్తులతో నిండిపోయాయి.
మనదేశంలో బుద్ధ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా స్నానం చేస్తే మనిషికి మోక్షం లభిస్తుందని చెబుతారు.

ఇంతేకాకుండా ఈ రోజున స్నానం చేయడం వల్ల మనిషి మనసు, శరీరం రెండూ పవిత్రంగా మారుతాయని నమ్ముతారు. ఈ రోజున గంగాస్నానం చేసి, పూర్వీకులకు తర్పణం పెడితే, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని అంటారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. గౌతమ బుద్ధుడిని విష్ణువుకు తొమ్మదవ అవతారంగా భావిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement