Purnima
-
13 రోజుల్లో.. మూడుసార్లు ఆమె ఎవరెస్ట్‌ను జయించింది!
పదమూడు రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే మొదటి మహిళగా పూర్ణిమా శ్రేష్ట గుర్తింపు పొందింది. నేపాల్‌లో వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్ట్ అయిన 33 ఏళ్ల పూర్ణిమ, సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాను అంటోంది.‘ప్రపంచంలో ఒకే సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చు. వారికి ఆసక్తి ఉంటుంది. కానీ, భయంతో వెనకంజ వేస్తుంటారు.ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి నన్ను కలుస్తుంటారు. వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకు రాగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉంది.మూస పద్ధతికి స్వస్తి...ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేనేమీ సంపన్నుల ఇంట్లో పుట్టలేదు. మా అమ్మానాన్నలు నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న రైతులు. నా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేది. రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. ఆ కష్టం నాలో సవాళ్లకు మార్గం చూపింది. ఇప్పటివరకు ఎనిమిది శిఖరాలను అధిరోహించాను. నా సవాళ్ల సాధన కోసం నా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాను. గైడింగ్ కంపెనీ నుండి కొంత లోన్ తీసుకున్నాను. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీయర్ గైడ్‌గా చేయాలనుకుంటున్నాను. రికార్డ్ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ, 8,000 కిలోమీటర్ల రికార్డ్‌ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అలసట కలిగినా..ఈ వసంత కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు సులువుగానే అధిరోహించాను. తర్వాత మూడవసారి కొంచెం అలసటతో కిందటి నెల 25వ తేదీని అధిరోహణ ప్రారంభమైంది. నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నాను.నిద్రలేపడానికి గైడ్ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నాను. ఒక్కో అడుగు వేయడంపై దృష్టి పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్ సృష్టించాను. దాదాపు ఒక గంటపాటు పై భాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కలల సాధనకు కృషిస్కూల్ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశాను. 2017లో ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే ఫొటోగ్రఫీ అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయం అయ్యాను. పర్వతాలను కలుసుకోవడానికి అంత సమయం పట్టిందే అని చాలా బాధపడ్డాను. శిఖరపు అంచున నిలబడి, అక్కడినుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నాను. చాలా మంది స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారని అనుకుంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్ళే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం. ఇంటిపనులతో జీవితం. ఇలా ఉండకూడదు నా జీవనం అనుకున్నాను. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించాను. 2022లో కాంచన్ జంగా, లోత్సే, మకాలును అధిరోహించాను. అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుంది అనుకున్నాను. వాళ్లు కూడా తమ పట్ల శ్రద్ధ వహిస్తారని నా నమ్మకం.ప్రజలలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం. తమ సామర్థ్యాలను విశ్వసించ లేనివారు కలలను సాకారం చేసుకోలేరు.. మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని మనలోనే అన్వేషించాలి. అప్పుడు మనలోని అంకితభావం, ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ఆశయమే అత్యున్నత శిఖరాలను చేర్చుతుంది’’ అని వివరించే పూర్ణిమ మాటలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
బుద్ధ పూర్ణిమ వేళ.. భక్తుల గంగా స్నానాలు
ఈరోజు (గురువారం) బుద్ధ పూర్ణిమ. ఈ సందర్భంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్, హరిద్వార్‌లలో భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees take holy dip in Haridwar on the occasion of Buddha Purnima. pic.twitter.com/iV42mC9UfV— ANI (@ANI) May 23, 2024భక్తులకు భద్రత కల్పించేందుకు వివిధ గంగా ఘాట్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. యూపీలోని వారణాసిలోని అన్ని ఘాట్లు భక్తులతో నిండిపోయాయి.మనదేశంలో బుద్ధ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా స్నానం చేస్తే మనిషికి మోక్షం లభిస్తుందని చెబుతారు.#WATCH | Prayagraj, UP: Devotees take holy dip and offer prayers at the confluence of River Ganga and River Yamuna on the occasion of Buddha Purnima. pic.twitter.com/pA7OGIg057— ANI (@ANI) May 23, 2024ఇంతేకాకుండా ఈ రోజున స్నానం చేయడం వల్ల మనిషి మనసు, శరీరం రెండూ పవిత్రంగా మారుతాయని నమ్ముతారు. ఈ రోజున గంగాస్నానం చేసి, పూర్వీకులకు తర్పణం పెడితే, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని అంటారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. గౌతమ బుద్ధుడిని విష్ణువుకు తొమ్మదవ అవతారంగా భావిస్తారు.#WATCH | Varanasi, UP: Devotees take holy dip in Ganga River on the occasion of Buddha Purnima. pic.twitter.com/FQ0lQ76Mwu— ANI (@ANI) May 23, 2024 -
బుద్ధుని తపస్సు ఎలా సాగింది? బుద్ధగయలో నేడు ఏం చేస్తారు?
బుద్ధుడు మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ఈ నాటికీ బుద్ధుని బోధనలు ఆచరణీయంగా నిలిచాయి. బుద్ధ పూర్ణిమను ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి ఈ పౌర్ణమిని మే 23న జరుపుకోనున్నారు. బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు.బీహార్‌లోని బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం కోసం బయలుదేరిన బుద్ధుడు గయలోని ధుంగేశ్వరి పర్వతంపై ఉన్న ప్రాగ్బోధి గుహకు చేరుకున్నాడని చరిత్ర చెబుతోంది. ఆ గుహలో కఠిన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ తపస్సు సమయంలో, ఆయన ఆహారంతో పాటు నీటిని కూడా స్వీకరించలేదని చెబుతారు. ఫలితంగా బుద్ధుని శరీరం అస్థిపంజరంలా మారింది. నేటికీ అస్థిపంజరం రూపంలో ఉన్న బుద్ధుని విగ్రహం బుద్ధగయలో కనిపిస్తుంది. దుంగేశ్వరిలో మాతా దుర్గేశ్వరి ఆలయం ఉంది. అక్కడే బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది.బుద్ధుడు తన ధ్యాన సమయం ముగిశాక కాలినడకన ఇక్కడ నుండి బయలుదేరాడు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్రౌర్ గ్రామానికి చేరుకుని, అక్కడి మర్రిచెట్టు కింద తిరిగి ధ్యానం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సుజాత అనే మహిళ బుద్ధుని అస్థిపంజర రూపాన్ని చూసి, అతనికి ఒక కప్పు ఖీర్ అందించింది. దానిని స్వీకరించిన బుద్ధ భగవానుడు అక్కడ నుండి బుద్ధగయకు బయలుదేరాడని చెబుతారు.బుద్ధగయలోని ఒక బోధి చెట్టు కింద ధ్యానం చేశాక పూర్ణిమ రోజున బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతారు. బుద్ధగయలో బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధునికి ప్రత్యేక పూజలు చేస్తారు. పలువురు బౌద్ధ అనుచరులు ఇక్కడికి తరలివస్తారు. బుద్ధ భగవానుడు ఇక్కడ నుండే ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించాడు. బుద్ధగయలోని మహాబోధి ఆలయం అంతర్జాతీయ వారసత్వ సంపదలో భాగంగా గుర్తింపు పొందింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహాబోధి ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయంలో ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అనే శ్రావ్యమైన కీర్తన ప్రతిధ్వనిస్తోంది. -
Ram Mandir: ‘నా సోదరుల ప్రాణత్యాగం వృథా అనుకున్నా’
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రామ జన్మభూమితో తన కుటుంబ సభ్యులకు ఎంతో అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి ఆనందం వ్యక్తం చేశారు. 1990లో అయోధ్యలో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు చోటుచేసుకున్న పోలీసు కాల్పుల్లో 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి, 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు. వారి సోదరే పూర్ణిమ కొఠారి. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజుల తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మితం కావటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 2014 వరకు కూడా రాముడి జన్మభూమికి సంబంధించి తన సోదరుల ప్రాణ త్యాగం వృథా అయిందని బాధపడినట్లు చెప్పారు. 33 ఏళ్ల క్రితం తమ ప్రాణాలు త్యాగం చేసిన తన సోదరులు కళ నేడు నిజమవుతోందని అన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని జీవితంలో మరిచిపోనని తెలిపారు. గత 33 ఏళ్లలో రామ మందిరం నిర్మితం కావటం తనకు చాలా ఆనందించదగ్గ విషయమని పూర్ణిమా అన్నారు. తన తల్లిదండ్రులు కూడా చనిపోయారని తెలిపారు. రామ మందిర నిర్మాణం అవుతుందనే నమ్మకం.. 2014 ముందు వరకు కూడా తనలో లేదని అన్నారు. వేల ఏళ్ల చరిత్ర గల రామ మందిరం నిర్మాణంలో తన సోదరులు ప్రాణ త్యాగం ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. రామ మందిర నిర్మాణం పట్ల తాను చాలా గర్వ పడుతున్నాని తెలిపారు. కొల్కత్కు చెందిన రామ్కొఠారి, శరత్ కొఠారి 1990 అక్టోబర్‌లో కరసేవకులు చేపట్టిన యాత్రలో పాల్గొన్నారు. అయితే వారు కోల్‌కతా నుంచి ప్రారంభం కాగా.. వారి బృందం బెనారస్ వరకు చేరుకోగానే పోలీసులు నిలువరించారు. ఇక వారు అక్కడి నుంచి టాక్సిలో ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: కాలారామ్ గుడికి ప్రధాని మోదీ.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు -
వందే సృజన!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చిన తరువాత చాలా ప్రాంతాల మధ్య దూరం తగ్గిపోయింది. కానీ టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో కొంతమంది దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఇలా వందేభారత్‌కు దూరంగా ఉన్న గ్రామానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చి అబ్బుర పరుస్తోంది పూర్ణిమా ముర్ము. అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. మారుమూల గ్రామానికి వందే భారత్‌ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది పూర్ణిమ. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు పక్కనే ఉన్న ఓ గ్రామం పేరు జొండరాగోడ. ఈ గ్రామానికి చెందిన విద్యార్థే పూర్ణిమా ముర్ము. గిరిజనులు ఎక్కువ ఉండే ఈప్రాంతంలో దీపావళి సమయంలోనే సోహ్రాయ్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. దీపావళి రెండో రోజున జరుపుకునే ఈ పండక్కి గిరిజనులంతా... తమ మట్టి ఇళ్లను శుభ్రం చేసి, రకరకాల సాంప్రదాయ డిజైన్లతో పెయింట్ వేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్ణిమ తన ఇంటిని వందే భారత్ చిత్రంతో నింపేసింది. మట్టింటికి ముచ్చటగా.. గ్రామంలో ఎంతో సంతోషంగా ఆర్భాటంగా జరుపుకునే పండగను మరింత బాగా జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో హైస్పీడ్ ట్రైన్‌తో ఇంటిని అలంకరించాలనుకుంది పూర్ణిమ. గ్రామవాసులు సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసే రంగుల నుంచి.. తెలుపు, నీలం, నల్లరంగులు తీసుకుని ఇంటి గోడపైన వందేభారత్ రైలు బొమ్మను చక్కగా చిత్రించింది. రైలు బొమ్మ ఆకర్షణీయంగా ఉండడంతో గ్రామస్థులు పూర్ణిమ ఇంటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ‘‘గ్రామంలోని చాలామందికి ‘వందేభారత్ రైలు’ ఎలా ఉంటుందో తెలియదు. దీని గురించి వినడమేగాని చూసింది లేదు. అందుకే అందరికీ వందేభారత్‌ను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో రైలు బొమ్మను చిత్రించాను. నిజానికి నేను కూడా ఇప్పటిదాకా వందేభారత్ చూసింది లేదు. ఫోన్లో వందేభారత్ బొమ్మను చూసి గీశాను. అచ్చం వందేభారత్‌ను పోలి ఉండడంతో నా పెయింటింగ్ గురించి తెలిసిన వారంతా చూడడానికి వస్తున్నారు. రైలు పెయింటింగ్ వేసిన తరువాత ఇంట్లో ఉన్నట్టుగా గాక, ట్రైన్లో ఉన్నట్టు ఉంది’’ అని సంతోషంగా చెబుతోంది పూర్ణిమ. వేడుకల్లో వందేభారత్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పెయింటింగ్‌ను చూసిన గ్రామస్థులంతా.. ‘‘మేమయితే ఇంతవరకు ఈ రైలు ఎక్కలేదు. కనీసం ఇలాగైనా చూడగలుగుతున్నాం. వందే భారత్‌ను పూర్ణిమ చక్కగా వేసింది’’ అని మెచ్చుకుంటున్నారు. పిల్లలైతే కొత్త రైలు తమ ఊరు వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు. -
నవ వధువుది ఆత్మహత్యే..
ఖలీల్‌వాడి: ఈ నెల 2న నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని సుధా హైట్స్ అపార్ట్మెంట్ పైనుంచి పడి చనిపోయిన పూర్ణిమ (26)ది ఆత్మహత్యే నని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. భర్త వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వివరాలివి.. రెండు నెలల క్రితం హమాల్వాడికి చెందిన పూర్ణిమకు, విశాల్‌తో వివాహం జరిగింది. పూర్ణిమ ఐటీసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటోంది. భర్త విశాల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లయిన రెండు నెలల్లోపే.. పూర్ణిమ నివసిస్తున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైనుంచి పడి చనిపోవడంపై.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన విచారణలో పూర్ణిమను భర్త విశాల్ వేధించేవాడని వెల్లడైంది. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్, చుట్టుపక్కల వారిని విచారించాక ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించి.. భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
యువ రెజ్లర్ పూర్ణిమకు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్, సబ్ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమవుతున్న హైదరాబాద్‌కు చెందిన రెజ్లింగ్ క్రీడాకారిణి పూర్ణిమకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్-నాచారం) యాజమాన్యం ఏడాదిపాటు ఆర్థిక సహాయం చేయనుంది. 16 ఏళ్ల పూర్ణిమకు ప్రతి నెల రూ.10 వేలు ఏడాదిపాటు డీపీఎస్-నాచారం అందజేస్తుంది. ఈ మేరకు నాచారంలోని డీపీఎస్‌లో జరిగిన కార్యక్రమంలో పూర్ణిమకు రూ. 10 వేల చెక్‌ను డీపీఎస్ ప్రతినిధి మల్కా యశస్వి అందించారు. గత ఏడాది బళ్లారిలో జరిగిన జాతీయ సబ్ జూనియర్ క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో పూర్ణిమ 61 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, రెజ్లింగ్ కోచ్ నర్సింగ్ ముదిరాజ్, పూర్ణిమ తండ్రి జుమ్మి, రెజ్లర్లు మెట్టు శివ, మోహన్ గాంధీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధికారులు పాల్గొన్నారు. -
భారతీయులు ఈ గేమ్‌ను తెగ ఆడేస్తున్నారు
భారత డెవలపర్లు రూపొందిస్తున్న యాప్స్, గేమ్స్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో ఏకంగా 200 శాతం పెరిగింది. దీనితో వాటిపై ఇన్వెస్టర్లు కూడా అసాధారణ స్థాయిలో ఆసక్తి కనపరుస్తున్నారని గూగుల్ ప్లే పార్ట్నర్షిప్స్ వైస్–ప్రెసిడెంట్ పూర్ణిమా కొచికర్ తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ)స్టార్టప్ హబ్‌తో కలిసి గూగుల్ .. యాప్‌స్కేల్ అకాడమీ క్లాస్ 2022ని ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. లూడో కింగ్ జాతీయ, అంతర్జాతీయంగా అత్యధికంగా ఆడుతున్న గేమ్స్‌లో ఒకటిగా మారిందని పూర్ణిమ చెప్పారు. భారత కంపెనీలు రూపొందించిన యాప్స్, గేమ్స్‌ను ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న వారి సంఖ్య 2021లో 150 శాతం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా వస్తున్నాయని పూర్ణిమ తెలిపారు. యాప్‌స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కోసం 400 దరఖాస్తులు రాగా .. విద్య, వైద్యం తదితర రంగాలకు చెందిన 100 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. వీటికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, వ్యాపార మోడల్, ఆదాయ వ్యూహాలు మొదలైన వాటిలో ఆరు నెలల పాటు శిక్షణ లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన అంకుర సంస్థలకు .. ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులను కలిసే అవకాశం దక్కుతుంది. చదవండి: ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!! -
ప్రేమ..పెళ్లి..విషాదం
సనత్‌నగర్: మనసారా ప్రేమించింది...తల్లిదండ్రులను కూడా ఎదిరించి కోరుకున్న వాడినే వరించింది. ఎక్కడున్నా తమ కూతురు సుఖంగా ఉంటుందని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశ అడియాసే అయ్యింది. పెళ్లయిన రెండు వారాలకే పరలోకాలకు చేరింది. హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుందా...? తెలియదుగానీ ఆమె తలపై గాయాలు ఉండడంతో తమ కూతురిని...అల్లుడే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బోరబండ సమీపంలోని పాండురంగ నగర్‌కు చెందిన అల్లూరి ప్రసాద్‌కు కూకట్‌పల్లిలో రిబ్బర్ ప్రొడక్టస్ పరిశ్రమ ఉంది. ఇందులో పాండురంగ నగర్ సమీపంలో రామారావునగర్‌కు చెందిన దాసరి కార్తీక్ పనిచేసేవాడు. ఈ క్రమంలోనే బీటెక్ పూర్తిచేసి టెక్ మహేంద్రలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ కుమార్తె పూర్ణిమ అన్నపూర్ణతో కార్తీక్‌కు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరూ చనువుగా ఉండేవారు. ఇది గమనించిన ప్రసాద్ కార్తీక్‌ను ఉద్యోగంలోంచి తొలగించాడు. అయినా ఇద్దరూ తరచు కలుసుకునేవారు. ఈ క్రమంలోనే గత నెల 22వ తేదీన సింహాచలంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సనత్‌నగర్ పోలీస్టేషన్‌కు వచ్చి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కార్తీక్, పూర్ణిమ అన్నపూర్ణ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి పరిస్థితిని వివరించారు. అయితే కూతురిని తీసుకెళ్లేందుకు ప్రసాద్ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బోరబండ సమీపంలోని స్నేహపురి కాలనీలో కార్తీక్ కొత్తకాపురం పెట్టాడు. కార్తీక్ ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తుండగా, పూర్ణిమ అన్నపూర్ణ టెక్ మహేంద్రలో ఉద్యోగాన్ని కొనసాగిస్తోంది. ఏం జరిగిందో ఏమో గానీ ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం సమయంలో పూర్ణిమ అన్నపూర్ణ ఉరి వేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లతోపాటు, తలపై గాయమై, రక్తం కారడంతో పూర్ణిమ మరణంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డైరీలో సూసైడ్ నోట్ కూడా రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఆమె మృతిపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తండ్రి ప్రసాద్ ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పోలీసుల ద్వారా తమ కుమార్తె మరణవార్త తెలిసిందని, వెంటనే వెళ్లి చూడగా అప్పటికే కార్తీక్ మద్యం సేవించినట్టు కనిపించాడన్నారు. పెళ్లి జరిగిన నాటి నుంచి కూతురు తమతో మాట్లాడలేదని తండ్రి చెబుతున్నారు. కూతురిది ముమ్మాటికీ హత్యేనని, ఇందులో కార్తీక్‌తో పాటు ఆయన తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, కిందకు దించే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా కిందపడడంతో తలకు గాయమైందని, 108కి సమాచారం ఇవ్వగా అప్పటికే అన్నపూర్ణ మృతి చెందినట్టు నిర్థారించారని కార్తీక్ పోలీసులకు వివరించారు. ఎస్ఎంఎస్ కారణంగా గొడవ జరిగిందా? సోమవారం కార్తీక్ పుట్టినరోజు కావడంతో ఇంట్లో పార్టీ జరిగినట్టు తెలిసింది. మద్యం సేవించిన కార్తీక్‌కు భార్యతో చిన్నపాటి ఘర్షణ తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్య పూర్ణిమ అన్నపూర్ణ సెల్‌కు ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. అయితే ఆ ఎస్ఎంఎస్ను వెంటనే తీసేయడంతో కార్తీక్ అనుమానం పెంచుకుని మరోసారి గొడవ పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె మరణించింది. -
స్త్రీలోక సంచారం
అరవై ఐదేళ్ల ఆమ్రాదేవి నలభై ఏడేళ్ల నిరీక్షణ ఈ ఆదివారం ‘విజయ్ దివస్’ రోజున ఫలించింది. ఆమె నిరీక్షిస్తున్నది తన భర్తను చూడడం కోసం. ఆమ్రాదేవి ఉత్తరకాశీ అమ్మాయి. పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయింది. అప్పటికి ఆమె భర్త వయసు ఇరవై ఏళ్లు. అతడి పేరు సుందర్. పెళ్లయ్యే నాటికి సుందర్ భారత సైన్యంలో ‘బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్’ రెజిమెంట్‌లో సైనికుడు. పెళ్లయ్యాక ఫొటో దిగడం కోసం దగ్గరలోని దుండా పట్టణానికి పెద్దవాళ్లు ఈ దంపతుల్ని తీసుకెళ్లబోతుండగా సుందర్‌కి కబురొచ్చింది, తక్షణం వచ్చి యుద్ధంలో చేరమని! భార్య చెయ్యి వదిలి అప్పటికప్పుడు యుద్ధక్షేత్రంలోకి దుమికాడు సుందర్. 1971 ఇండో–పాక్ వార్ అది. అయితే యుద్ధానికి వెళ్లాక అతడు మళ్లీ తిరిగి రాలేదు. అతడి మృతదేహం తూర్పు పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడో గుర్తు తెలియని చోట ఖననం అయింది. ఇన్నేళ్లలోనూ భర్త ఎలా ఉంటాడో మర్చిపోయింది కానీ, భర్తతో తన బంధాన్ని మర్చిపోలేదు ఆమ్రాదేవి. మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు. సైన్యంలో ఉండగా అతడు తీయించుకున్న ఫొటోనైనా (ఒకవేళ తీయించుకుని ఉంటే) చూడకపోతానా అని ఎదురుచూస్తూ ఉంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. జిల్లా యంత్రాంగంలోని అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 16న.. ఆ యుద్ధంలో పాకిస్తాన్‌పై ఇండియా గెలిచిన ‘విజయ్ దివస్’ రోజు ఆమ్రాదేవి చేతికి ఆమె భర్త ఫొటో అందింది. సైనికుల గ్రూప్ ఫొటోలోంచి సుందర్‌ని వేరు చేసి, అతడి ఫొటోను పెద్దదిగా చేసి, దానికి ఫ్రేమ్ కట్టించి జిల్లా అధికారులు ఆమెకు కానుకగా అందజేశారు! లక్కీ కదా! ‘‘అయితే ఆమె కాదు, మేము లక్కీ’’ అంటున్నారు సైనిక్ వెల్ఫేర్ బోర్డు డి.డి.పంత్. ‘‘ఆమ్రాదేవి అభ్యర్థన మేరకు సిపాయి సుందర్ ఫొటో ఎక్కడైనా దొరుకుతుందా అని మావాళ్లు కూడా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక దొరకదని అనుకున్నాక సుందర్ బొమ్మను వేయించి ఆమ్రాదేవికి అందజేశాం. అయితే పోలికలు గుర్తుపట్టలేకపోతున్నానని ఆమె అన్నారు!. మళ్లీ వెతుకులాట ప్రారంభించాం. చివరికి అతడు పని చేసిన రెజిమెంట్ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో రికార్డులన్నీ గాలించాం. మొత్తానికి ఓ గ్రూప్ ఫొటోలో సుందర్ దొరికాడు’’ అని పంత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఎలా ఉండేవారో, ఎలా మాట్లాడేవారు మర్చేపోయాను. కానీ ఆయన స్వరూపం లీలగా నేటికీ నా కళ్లలో కదలాడుతూనే ఉంది. యుద్ధంలో శత్రువుతో పోరాడుతూ ఆయన చనిపోయారని తెలుసుకోగానే గర్వంగా అనిపించినప్పటికీ, నా శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయినట్లుగా బాధపడ్డాను’’ అన్నారు ఆమ్రాదేవి, ఫొటోలో తన భర్తను కళ్ల నిండా చూసుకుంటూ. ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంపీలు, పార్లమెంటు అధికారులతో పాటు ఒక సాధారణ మహిళ కూడా ఆ ప్రాంగణంలో కనిపిస్తున్నారు! ఆమె పేరు పూర్ణిమా గోవిందరాజులు. వయసు 54. చేతిలో కాగితాల కట్ట పెట్టుకుని, స్పష్టతనిచ్చే ఒక ప్రజాప్రతినిధి కోసం ఆమె వెదుకుతున్నారు. అది ఆమె జీవిత సమస్యకు అవసరమైన స్పష్టత. ఈ ఏడాది అక్టోబర్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఒక ప్రకటన చేశారు. బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా ‘పోక్సో’ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్)– 2012 కింద ఎప్పుడైనా నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చుననీ, అందుకు కాలపరిమితి అంటూ ఏమీ లేదన్నది ఆ ప్రకటన సారాంశం. పూర్ణిమ ప్రస్తుతం కెనడాలో కన్సర్వేషన్ బయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు పదేళ్ల వయసులో సమీప సన్నిహితుడొకరు పూర్ణిమను లైంగికంగా వేధించి, కొన్నాళ్లపాటు నరకం చూపించాడు. అతడింకా జీవించే ఉన్నాడు. ఇప్పుడు అతడిపై పోక్సో చట్టం కింద కేసు వేసేందుకు కెనడా నుంచి ఇండియా వచ్చారు పూర్ణిమ. అయితే పోక్సో చట్టం అమల్లోకి రావడానికి ముందు జరిగిన సంఘటన కనుక దానిపై పోక్సో చట్టం ప్రకారం కేసు వేయవచ్చా అన్న స్పష్టత వచ్చే వరకు కేసును స్వీకరించడం కుదరక పోవచ్చునని పూర్ణిమ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆ స్పష్టత కోసమే పూర్ణిమ పార్లమెంటు ప్రాంగణంలో మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనకాగాంధీని సంప్రదించే ఆలోచనలోనూ ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులో ఒక ఎంపీ.. ‘బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా’ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఇచ్చిన ప్రకటనపై స్పష్టతను కోరడంతో పూర్ణిమలో ఆశలు చిగురించాయి. 2019 జనవరి 11న పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు తన సమస్యకొక పరిష్కారం దొరకొచ్చని ఆమె భావిస్తున్నారు. -
గురు దేవోభవ
-
మోహిని వచ్చేస్తోంది
దాదాపు రెండేళ్లు పూర్తి కావొచ్చింది తెలుగు తెరపై చెన్నై సుందరి త్రిష కనిపించి. 2016లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘నాయకి’లో నటించారామె. ఇప్పుడు మళ్లీ ‘మోహిని’ సినిమాతో తెలుగు తెరపై కనిపించనున్నారు. త్రిష ప్రధాన పాత్రలో ఆర్. మాదేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మోహిని’. ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో లక్ష్మి పిక్చర్స్ తెలుగులో విడుదల చేయనుంది. ఎస్. లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస రావు పల్లెల, కరణం మధులత నిర్మాతలు. గుంటూరు కాశిబాబు, డీవీ మూర్తి సహ–నిర్మాతలు. జాకీ, యోగి బాబు, పూర్ణిమ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. ‘‘ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది. మాదేష్ చాలా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. త్రిష నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ‘మోహిని’ సినిమాను ఈ నెల 27న విడుదల చేయనున్నాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు చిత్రబృందం. -
మలిన స్పర్శ!
అది ఆప్యాయంగా తాకే చేయా? కాదు... కానే కాదు. మరి ఆకలిగా తడిమే చెయ్యా? అవును... అవును... అవును. ఆ చేతినీ, ఆ చేష్టనూ ఆపేదెలా? ఆమెకు అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది. అలాంటి చేతులకు అడ్డుకట్ట ఎలా వేయాలో. ఎప్పటివో తప్పులకు ఇప్పుడూ శిక్షపడేందుకు చట్టంలోనే ఓ మార్పు వచ్చేలా కృషిచేస్తున్నపూర్ణిమా గోవిందరాజులు బయోగ్రఫీ ఇది. పందొమ్మిది వందల ఎనౖభైఆరో.. ఎనభైఏడో.. సంవత్సరం సరిగ్గా గుర్తులేదు. అప్పుడామె వయస్సు 22 ఏళ్లు ఉండొచ్చు. మాంట్రియల్ (కెనడా)లోని తన సోదరుడి ఇంట్లో ఆమె టీవీ చూస్తూ ఉంది. నాన్న చనిపోవడంతో అమ్మ, తను చెన్నై నుంచి అన్న దగ్గరకి వచ్చేశారు. టీవీలో చానెల్స్ మారుస్తూ ఉంది. ఓ చానెల్లో వస్తున్న ఓ షో దగ్గర ఆగిపోయింది. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ టాపిక్. దాని బారినపడ్డవాళ్లను ఇంటర్వ్యూలు చేస్తున్నారు. హఠాత్తుగా ఆలోచనల్లో పడింది ఆమె. ‘అయితే ప్రపంచంలో నేనొక్కదాన్నే కాదన్నమాట. నాలాంటి వాళ్లు ఇంతమంది ఉన్నారు’ అనుకుంది. ఏవో జ్ఞాపకాలు వెంటాడాయి. చిన్నప్పుడు తనను తన కజిన్ హజ్బెండ్ అలాగే అబ్యూజ్ చేశాడు. అప్పుడు ఆమెకు ఆరేళ్లు. వాళ్ల నాన్న చాలా డబ్బు పోగొట్టుకొని వాటిని రికవరీ చేసుకోవడానికి వెళ్లేవాడు. అమ్మకేమో స్కీర్లోసిస్. పిల్లలను చూసుకునే స్థితిలో ఉండేదికాదు. దాంతో ఆమె తండ్రి అలా వెళ్లినప్పుడల్లా వాళ్లను ఆమె కజిన్ ఇంట్లో దింపేవాడు. ఆ ఇంట్లో రాత్రుళ్లు ఏదో భయంకరమైన కల భయపెట్టి నిద్రలోంచి ఉలిక్కిపడిలేచేలా చేసేది. కళ్లు తెరిచి చూసేసరికి పక్కన అతను ఉండేవాడు. ఆ అమ్మాయి పాంటీ విప్పి ఏదో చేస్తూ. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడుకూడా తన పాంటీలో చేతులు పెట్టేవాడు. వణుకుతూ దిగ్గున కూర్చుంది ఆ పిల్ల. ఏడుపొస్తుంటే వెంటనే తన చేత్తో ఆమె నోటిని మూసేశాడు. అలాగే వెనక్కి వాల్చి పడుకో అన్నట్టు సైగచేసి గమ్మున బయటకు వెళ్లిపోయాడు. కాని ఆరేళ్ల ఆ పాప నిద్రపోయేది కాదు మిగిలిన రాత్రంతా. భయం.. పడుకుంటే మళ్లీ వస్తాడేమోనని. అది మొదటిసారి కాదు చాలాసార్లు జరిగింది. తాకకూడని చోట్ల తాకాడు. చేయడకూడని పనులు చేశాడు. కాని ఆ బాధ ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు. చెబితే అందరూ తననే తిడతారేమోననే భయం. అతను అలా తాకినప్పుడల్లా తానంతా డర్టీగా అయిపోయాననే భావన. తన కజిన్‌తో చెప్పి ఏడ్వాలనిపించేది. కాని వాళ్లు తమ కన్నా డబ్బున్నవాళ్లు. ఆర్థికంగా తన కుటుంబానికి చాలా సాయం చేస్తున్నారు. తండ్రి ఊళ్లకు వెళ్లినప్పుడల్లా తమను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అతను మంచివాడు కాదు... ఇలా చేస్తున్నాడు అని చెబితే ఆ సాయమంతా ఆగిపోతుందనే భయం. ఇంటికి రానివ్వరని భయం. అమ్మానాన్న తిడతారనే భయం. ఇంచుమించు తన వయసున్న అతని బిడ్డా తనతో సన్నిహితంగానే ఉంటుంది. ఆమెతోనూ చెప్పలేదు ఇదే భయంతో. ఆ గతం పీడ ఒళ్లు గగుర్పొడిచేలా చేసి ఈ లోకంలోకి తెచ్చింది ఆమెను. ఇప్పుడు ఆమె వయసు 53 ఏళ్లు. పేరు పూర్ణిమా గోవిందరాజులు. కెనడాలో ఎకాలజిస్ట్గా పనిచేస్తోంది. చెన్నైలో పుట్టిపెరిగింది. తన 21వ యేట కెనడాకు వెళ్లింది. ఓవైపు అక్కడ పనిచేస్తూనే ఇంకోవైపు వరల్డ్ పల్స్ కమ్యూనిటీలో చేరి తన మాతృభూమి ఇండియా అభివృద్ధిలో పాలుపంచుకుంటోంది. పూర్ణిమ గురించి చెప్పడానికి సందర్భం? బాల్యంలో తాను ఎదుర్కొన్న చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కు ఇప్పుడు ఇండియాలో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) అనే యాక్ట్ వచ్చిందని తెలిసీ 2016లో కంప్లయింట్ ఫైల్ చేసింది. మైనర్‌గా ఉన్నప్పుడు తన మీద సెక్సువల్ అబ్యూజ్ జరిగిందని. పూర్ణిమను పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తి వయసు ఇప్పుడు 75 ఏళ్లు. ‘‘ఆ సంఘటన జరిగింది దాదాపు నలభై ఏళ్ల కిందట. ఆ సమయంలో సెక్స్ అనే పదాన్ని కూడా నేను వినలేదు. చిన్నపిల్లల పట్ల అలా పాల్పడుతున్న నేరానికి ఓ పేరుంటుందన్న జ్ఞానం కూడా నాకులేదు’’ అంటుంది నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ. కాలక్రమంలో పూర్ణిమను అలా బాధించిన వ్యక్తి కూతురుతోనే ఆమె అన్న పెళ్లి అయింది. ఒకసారి.. మాంట్రియల్లో పూర్ణిమ, వాళ్ల వదిన ఇద్దరూ కలిసి టీవీ చూస్తున్నారు. అప్పుడూ ఇలాగే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మీద షో వస్తోంది. ‘‘ఇండియాలో అయితే ఇలాంటి ఘోరాలు ఉండవు’’ అంటూ మొదలుపెట్టింది పూర్ణిమ వాళ్ల వదిన. వినీ వినీ ఒక్కసారిగా అంది పూర్ణిమ ‘ఎందుకుండవ్? ఉంటాయి చాలా. నాకే జరిగింది’’ దాదాపు అరిచినట్టుగా చెప్పింది. తనతో అలా ఎవరు ప్రవర్తించారో కూడా చెప్పింది. నిశ్చేష్టురాలైంది వదిన. ‘‘మా నాన్నా?’’ నమ్మలేనట్టుగా అడిగింది. ‘‘అవును.. మీ నాన్నే’’ చెప్పింది. తన తండ్రి పూర్ణిమతో ఎప్పుడూ వింతగా ప్రవర్తించడం గుర్తుకురాసాగింది ఆమెకు. ఎప్పుడైనా తన తండ్రి తనను దగ్గరకు తీసుకుంటున్నప్పుడు పూర్ణిమ కోపంగా వచ్చి తన తండ్రిని అవతలకు తోసేసేది. అలా ఎందుకు చేసేదో అప్పుడు ఆమెకు అర్థంకాలేదు. కాని ఈ రోజు అర్థమైంది. ఇక ఆ విషయం గురించి ఆ ఇద్దరు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కాని 1999లో అనుకుంటా.. పూర్ణిమా వాళ్ల అన్నయ్యకు పాప పుట్టింది. చంటిదాన్ని తీసుకొని ఇండియాకు రావల్సిందని ఆయన మామగారు ఆహ్వానించారు. అప్పుడు అడిగాడు పూర్ణిమ వాళ్లన్నయ్య ఆమెను.. ‘‘మేము పాపను తీసుకొని ఇండియాకు... పర్టిక్యులర్‌గా ఆ ఇంటికి వెళ్లొచ్చా. నా బిడ్డకు క్షేమమేనా?’’ అని అడిగాడు. ‘‘క్షేమం కాదు’’ అని చెప్పింది ఖరాకండిగా. ఎందుకో కూడా వివరించింది. నివ్వెరపోయాడు అన్న. బిడ్డతో ఇండియాకు వెళ్లినప్పుడు మామగారిని నిలదీశాడు. తర్వాత అత్తగారినీ అడిగాడు. ‘‘నాకు మెలకువ వచ్చిచూసినప్పుడల్లా ఆయన పూర్ణిమ పక్కనే కనపడేవాడు. పీడకలతో పిల్ల ఉలిక్కిపడుతుంటే ధైర్యం చెబుతున్నా అనేవాడు’’ అంది. ఇదంతా అయ్యాక పూర్ణిమతో ఆమె.. ‘‘మా ఆయన నిన్ను కూతురు వాత్సల్యంతోనే చూశాడు. ముట్టుకున్నాడు. నువ్వేమనుకున్నా అతను నా దేవుడు. క్షమించు’’ అంది. ఈ సంఘటన తర్వాత తన కజిన్‌తో కూడా మాట్లాడ్డం మానేసింది పూర్ణిమ. ఆమె, వాళ్లన్నయ్య బాగా ఆలోచించి ఒకటి నిశ్చయించుకున్నారు. తమ ఆడపిల్లలకే కాదు ఆ కుటుంబంలోని అమ్మాయిలందరికీ రక్షణ కావాలని. దాంతో చిన్నప్పుడు తనకేం జరిగిందో వివరిస్తూ తమ పరివారంలోని సభ్యులందరికీ ఈ–మెయిల్ చేసింది పూర్ణిమ. ‘‘ఓ చేదు గతాన్ని... అదీ భయంతో గడిచిన బాల్యం గురించి అలా అందరికీ చెప్పడం మానసికంగా నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. వినడం వల్ల మా వాళ్లు కూడా డిస్టర్బ్ అయ్యారు’’ అంటారు పూర్ణిమ. ఈ మెయిల్ చదివిన ఇంకో కుటుంబసభ్యురాలు ఆ వ్యక్తి తననూ చిన్నప్పుడు అలాగే చేశాడని పూర్ణిమ, వాళ్లన్నయ్యతో చెప్పుకుంది. ‘‘చిన్నప్పటి ఆ దారుణం వల్ల నేను ఏ మగవాడినీ నమ్మలేకపోయా. చివరకు కట్టుకున్న భర్తను కూడా. పిల్లల్ని కనాలంటే భయమేసేది. వాళ్లను కాపాడుకోగలనా అని మధనపడేదాన్ని. ఇలాంటి నరకంతోనే పదహారేళ్ల వైవాహిక జీవితం గడిచిపోయింది. భర్తతో చనువుగా ప్రవర్తించలేక.. అతనితో సఖ్యంగా ఉండలేక చివరకు విడాకులతో ఆ బంధాన్ని సమాప్తం చేసుకున్నా’’ అని చెప్పింది పూర్ణిమ. ‘‘ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన నేను నన్ను అబ్యూజ్ చేసిన అతని మీద కంప్లయింట్ ఇచ్చిన రాత్రి హాయిగా... ప్రశాంతంగా నిద్రపోయా’’అని అంది. ఇదే విషయం మీద కెనడా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ కంప్లయింట్ ఫైల్ చేసింది ఆమె. అయితే ఆమె కంప్లయింట్ మీద చాలా తర్జనభర్జనలు, చర్చలూ జరిగాయి... ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన అబ్యూజ్‌ను ఇన్నేళ్ల తర్వాత కంప్లయింట్‌గా ఇస్తే దాన్ని పోక్సో చట్టంకింద తీసుకోవచ్చా అని! ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ చిన్నప్పుడు జరిగిన సెక్సువల్ అబ్యూజ్‌ను తన జీవితకాలంలో ఎప్పుడైనా సరే కంప్లయింట్ ఇవ్వచ్చు అనే దిశలో చట్టంలో మార్పులు చేయడానికి అడుగులు వేస్తోంది. ఈ శుభపరిణామానికి పూర్ణిమ గోవిందరాజులు ప్రయత్నమే కారణం. ‘‘భారతదేశంలో చాలామంది పిల్లల బాల్యం ఇలాంటి పీడకలలతోనే తెల్లారుతోంది. కుటుంబ బంధాలు, అనుబంధాలు,ఆర్థిక సమస్యలు, పిల్లల ఇబ్బందులను అర్థంచేసుకోలేని, వాళ్ల మాటలను నమ్మని పరిస్థితులు వగైరాల వల్ల ఆ పిల్లలలెవరూ నోరెత్తరు. వాళ్లు చెప్పినా వినేపెద్దవాళ్లుండరు. ఆ సైలెన్స్‌ను బ్రేక్చేయడానికే నేను నోరువిప్పా. జరిగినదాన్ని నిర్భయంగా బయటకు చెప్పే ధైర్యం మిగిలిన వాళ్లకు ఇవ్వడానికి నేనొక ఉదాహరణగా ఉండదల్చుకున్నా. నాలా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కు గురైనవాళ్లకు మానసికస్థైర్యం కల్పించే ప్రయత్నం చేస్తాను. నిందితులకు శిక్షపడాలి. బాల్యం అందరికీ అందమైన జ్ఞాపకంగా ఉండాలి. ఇది పిల్లల హక్కు’’అంటున్నారు పూర్ణిమా గోవిందరాజులు. – శరాది -
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
భక్తులతో కి టకిటలాడిన సాయిబాబా మందిరాలు కోదాడఅర్బన్: పట్టణంలోని పలు ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్‌నగర్‌లోని సాయిబాబా మందిరంతో పాటు కాశీనాధం కల్యాణ మండపం, దుర్గాపురంలోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనితతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఆయా ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా పట్టణంలోని శ్రీస్కూల్లో గురువుల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా, ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంసల చిత్రపటాలకు పుష్ఫాభిషేకం నిర్వహించి వారి విశిష్టతను విద్యార్ధులకు తెలియజేశారు. పట్టణంలోని రిషి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఈ సందర్భంగా తమ నాట్యగురువు నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయాల కమిటీల సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, శ్రీపాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, జ్యోతి, ఎఓ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
ప్రస్తుతం అబ్బాయిలు, అమ్మాయిలు మధ్య స్నేహం ఎలా ఉంటోందన్న కథాంశం నేపథ్యంలో సాగే చిత్రం ‘నాని బుజ్జి బంగారం’. చందూ, పూర్ణిమ, భానుశ్రీ, సాగర్, కాంచన ముఖ్య తారలుగా కె. చంద్రకుమార్ రెడ్డి నిర్మించారు. ‘ వర్మ’ చిత్రానికి స్వరాలు అందించిన ఆదేశ్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించాం’’ అని దర్శకుడు అన్నారు. -
ఉద్యోగం చేయాలనుకున్నా కానీ, సినిమాల్లోకి రావాలనుకోలేదు!
‘ముద్దమందారం’లో పూర్ణిమ ‘ముద్దుకే ముద్దొచ్చే మందారం... మువ్వల్లే నవ్వింది సింగారం’. బహుశా...పూర్ణిమను చూసే వేటూరి ఈ పాట రాశారేమో! వెండితెరపై తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారామె. పరికిణీలో పూర్ణిమ నిజంగా ముద్దమందారమే. ఆహార్యంలోనే కాదు, అభినయంలో కూడా పూర్ణిమ అభినందనీయురాలే. జంధ్యాల వంటి దిగ్గజం ప్రశంసలు ఆమెకు లభించాయంటే కారణం అదే. ఇటీవలే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న పూర్ణిమ ఇంటర్వ్యూ కోసం ఆమె మొబైల్‌కి కాల్ చేసింది ‘సాక్షి’. ‘నువ్వు నేనూ కలిసుంటేనే నాకెంతో ఇష్టం..’ అంటూ ‘గంగోత్రి’ సినిమా లోని పాట కాలర్ట్యూన్గా వినిపించింది. చరణం పూర్తయ్యేలోపే ‘హలో’ అన్నారు పూర్ణిమ. ఆ తర్వాత జరిగిన సంభాషణ. మీ కాలర్‌ట్యూన్ వింటే... మీకు సినిమాలంటే బాగా ఇష్టమని అర్థమవుతోంది... అవును... ఇప్పటికీ సినిమాలు బాగా చూస్తుంటాను. ఇప్పటి హీరోల్లో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయిని చూడాలనుంది. అలాగే చిరంజీవిగారబ్బాయి చరణ్ యాక్షన్ అన్నా నాకు ఇష్టమే. రవితేజ, సిద్దార్థ్‌ల సినిమాలు కూడా బాగానే చూస్తా. ఇక హీరోయిన్లలో సమంత, కాజల్, అనుష్క, తమన్నా అంటే ఇష్టం. అప్పట్లో సౌందర్య కూడా నాలాగే తెరపై పద్ధతిగా కనిపించింది. తనంటే ఇంకా ఇష్టం. మీరు తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారు కదా. ఇప్పుడొస్తున్న హీరోయిన్ల పోకడలు చూస్తే ఏమనిపిస్తుంది? మనం ఎవర్నీ తప్పు పట్టలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయక తప్పదు. పాపం... హీరోయిన్లే ఐటమ్సాంగులు కూడా చేయాల్సొస్తోంది. మీరు ఈ జనరేషన్వారు కాకపోవడం వల్ల హ్యాపీగా ఫీలయ్యారా? నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. అసలు సినిమాల్లో చేయడమే మా ఇంట్లో ఇష్టం లేదు. ‘ఒక్క సినిమానే’ అనేసరికి చేశాను. కమిట్మెంట్తో నడుచుకున్నాను కాబట్టే, అమ్మానాన్న కూడా నన్ను విభేదించలేదు. 1989లో నేను సినిమాలకు దూరమయ్యాను. అప్పుడు కొంతమంది దర్శక, నిర్మాతలు ట్రెండీగా కనిపిస్తే... పారితోషికం కూడా ఎక్కువిస్తామని అన్నారు. కానీ... నేను మాత్రం నా అభిమతాన్ని మార్చుకోలేదు. మీరు గాయని కూడా కదా? అవును.. అప్పట్లో చాలా పాటలు పాడాను. కొన్ని ఫంక్షన్లలో కూడా పాడాను. తొలుత గాయని అవుదామనే జంధ్యాల గారిని కలిశారట కదా? కాదండీ... ‘ముద్దమందారం’ హీరోయిన్ కోసం జంధ్యాల దాదాపు వందమంది అమ్మాయిలను చూశారు. ఆయనకు ఎవరూ సరిగ్గా నచ్చలేదు. అనుకోకుండా ఓ సందర్భంలో నా ఫొటో చూసి, ‘నా సినిమాలో నాయిక ఈ అమ్మాయే’ అని ఫిక్సయిపోయారట. మా నాన్నగారి వద్దకు తన కో-డెరైక్టర్ని పంపించి మాట్లాడించారు. నేను మాత్రం చేయనని కరాఖండీగా చెప్పేశాను. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేయాలని నాకుండేది. కానీ నచ్చజెప్పడంతో ఒక సినిమా చేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ... తర్వాత అదే జీవితం అయిపోయింది. దాదాపు వంద సినిమాల్లో నటించాను. ముద్దమందారం, మల్లెపందిరి, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, ఆడపడుచు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య... ఇలా నాకు పేరు తెచ్చిన సినిమాలెన్నో. మీరు మరచిపోలేని పాత్ర? ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’లో ‘పిచ్చితల్లి’ పాత్రను ఎప్పటికీ మరువలేను. ‘ఆ సినిమా ఒప్పుకోడానికి పూర్ణిమ పాత్రే కారణం’ అని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పారు... అవునా... అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. చిరంజీవిగారు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి. కళ్లజోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా ఉండేవారాయన. నన్ను ‘పూరీ.. పూరీ’ అని పిలిచేవారు. ఇద్దరం సెట్ అంతా అల్లరి చేసేవాళ్లం. మాధవి రిజర్డ్వ్ పర్సన్. ఎవరితోనూ కలిసేవారు కాదు. అందుకే... చిరంజీవిగారూ నేనూ కూడబలుక్కొని మరీ ఆమెను ఏడిపించేవాళ్లం. ఆ పాత్రను నేను చాలా బాగా చేశానని అందరూ అంటుంటారు. నిజానికి ఆ క్రెడిట్ మొత్తం కోడి రామకృష్ణగారిదే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటించి చూపించేవారు. చిరంజీవిగారిని తర్వాత ఎప్పుడైనా కలిశారా? మొన్న టి.సుబ్బరామిరెడ్డిగారి పుట్టినరోజు వేడుక మా వైజాగ్‌లో జరిగింది. అప్పుడు కేవలం చిరంజీవిగారిని కలవడానికే వెళ్లాను. చూడగానే... ‘ఏమ్మా... బావున్నారా’ అన్నారు. నిజంగా నాకు ఎంత ఆనందమనిపించిందో. నిజంగా ఆయన చాలా గ్రేట్. నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చిరంజీవిగారి అభిమానినే. ‘మా వైజాగ్’ అంటున్నారు! మీరు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారా? అవును.. ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఇక్కడే జరిగేవి. జంధ్యాల గారికి కూడా వైజాగ్ ఇష్టం. ఇక్కడే షూటింగ్స్ జరిపేవారు. జంధ్యాలగారు కుడివైపుకి తిరిగి నిలబడమంటే, నేను ఎడమవైపు తిరిగి నిలబడేదాన్ని. దాంతో నన్ను ‘తింగరి..’ అని పిలిచేవారు. చనిపోయేవరకూ నన్ను అలాగే పిలిచారాయన. నిజంగా ఆ రోజులు మళ్లీ తిరిగిరావు. నా కెరీర్ ఎక్కువ భాగం వైజాగ్‌లోనే సాగింది. అయితే.. పెళ్లయ్యాక సినిమాలకు దూరమయ్యాను. మీ శ్రీవారు ఏం చేస్తారు? ఒరిస్సాలో ఉద్యోగం ఆయనకు. అందుకే అక్కడే స్థిరపడిపోయాం. ఇప్పుడు పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. నాతోటి హీరోయిన్లందరూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడితే.. నాక్కూడా నటించాలనిపించింది. అందుకే... వైజాగ్ వచ్చేశాం. తొమ్మిది నెలల నుంచీ ఇక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? ఉందిలే మంచికాలం ముందుముందునా, తొండి, 33 ప్రేమకథలు, సాహసం చేయరా డింభక, సాహెబా సుబ్రమణ్యం ఇలా పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేశాను, చేస్తున్నాను. అయినా ఈ వయసులో అమ్మ పాత్రలు చేయడమే కరెక్ట్ కదా. సంభాషణ: బుర్రా నరసింహ -
చిన్నారి జీవితాన్ని చిదిమేశారు..
=బాలికపై అత్యాచారం?, హత్య =తల్లడిల్లిన తల్లిదండ్రులు తవణంపల్లె, న్యూస్‌లైన్: ఆ చిన్నారి ఆరో తరగతి చదువుతోంది. రేగిపండ్ల కోసం ఊరి బయటకు వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండడాన్ని గుర్తించిన దుండగులు కిరాతకంగా ప్రవర్తించి హత మార్చారు. బిడ్డ మరణ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన తవణంపల్లె మండలంలో శనివారం వెలుగు చూసింది. ఎగువ తవణంపల్లె పంచాయతీ మిట్టపల్లెకు చెందిన నరసింహులు, రెడ్డెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె పూర్ణిమ(12) తవణంపల్లె ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం తినుబండారాలు కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు, బంధువులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఎగువ తవణంపల్లె చెన్నమ్మ చెరువు నీటిగుంటలో పూర్ణిమ మృతదేహం తేలుతుండడాన్ని పశువుల కాపర్లు శనివారం గుర్తించారు. తవణంపల్లె పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, సీఐ శ్రీకాంత్, తవణంపల్లె ఎస్ఐ రవీంద్రనాథ్ పరిశీలించారు. పోలీసులు, వీఆర్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు. దుండగులు బాలిక గొంతుకు గుడ్డతో ఉరేసివున్నారు. అర్ధనగ్నంగా ఉంది. మృతదేహం ఉన్న గుంత నుంచి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న రేగిచెట్టు దగ్గర బాలిక చెప్పులు, లంగా(పావడా) పడివున్నాయి. చెరువులోని రేగిచెట్టు పక్కన ప్రతి రోజూ కల్లు విక్రయిస్తుంటారు. జూదం కోసం ఆటగాళ్లు వస్తుంటారు. సాయంత్రం వేళ రేగిపండ్ల కోసం ఒంటరిగా వచ్చిన బాలిక పట్ల గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా ప్రవర్తించి హత్య చేసి నీటిగుంటలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్ణిమ మృతితో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. బాలిక మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తవణంపల్లె ఎస్ఐ రవీంద్ర నాథ్ తెలియజేశారు.