‘పెగాసస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌’ వ్యవహారంపై కదలిక | Pegasus Phone Tapping: Parliamentary Panel Likely Question On July 28 | Sakshi
Sakshi News home page

పెగాసస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కదలిక

Published Wed, Jul 21 2021 8:33 PM | Last Updated on Wed, Jul 21 2021 8:39 PM

Pegasus Phone Tapping: Parliamentary Panel Likely Question On July 28 - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాసస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కదలిక వచ్చింది. పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ముందుకు చేరింది. స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న శశిథరూర్‌ ఈ వ్యవహారంపై చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఈనెల 28వ తేదీన స్టాండింగ్‌ కమిటీ  పౌరుల భద్రత, గోప్యతపై చర్చించనుంది. ఈ మేరకు ఐటీ, సమాచార, హోంశాఖకు కమిటీ సమన్లు జారీ చేయనుంది. వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసస్ ద్వారా భారతదేశానికి చెందిన 40 మంది రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని ఓ విదేశీ మీడియా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నానా రభస మొదలైంది. దేశంలో పౌరుల భద్రత, గోప్యతకు భంగం కలిగించేలా కేంద్రం చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిథరూర్‌ ఈ వ్యవహారంపై విచారణ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement