సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు టెండరింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నం ఫలించింది. రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వ సొమ్ము ఆదా కానుంది. పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీ టెండర్ ఖరారైంది. టీడీపీ హయాంలో పోలవరం 65వ ప్యాకేజీ పనులను రూ. 292.09 కోట్లకు పనులు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ తాజాగా రూ. 231.47 కోట్లకు టెండర్ దక్కించుకుంది. బిడ్‌లో ఆరు కంపెనీలు పోటీపడగా.. 15.6 శాతం తక్కువకి మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ టెండర్ వేసింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే సంస్థ కేవలం 4.8 శాతం ఎక్కువకి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 58.53కోట్లు ఆదాకానుంది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు టెండరింగ్‌లో భారీగా అవినీతి జరిగిందని మరోసారి నిర్ధారణ అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింతలో అక్రమాలు చోటుచేసుకున్నాయని నిపుణుల కమిటీ తేల్చడంతో జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: పోలవరం అక్రమాలపై ‘రివర్స్’ పంచ్
పోలవరం పనులు ఆపేశారంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టుకు 50 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. పోలవరం పై తప్పుడు ప్రచారం చేయవద్దని నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
చదవండి: రివర్స్ టెండరింగ్!
Comments
Please login to add a commentAdd a comment