నష్టం.. కష్టం కర్ణాటకకే ! | Loss to kaveri jalala issue | Sakshi
Sakshi News home page

నష్టం.. కష్టం కర్ణాటకకే !

Published Tue, Oct 18 2016 2:57 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Loss to kaveri jalala issue

బెంగళూరు :  కావేరి నదీ పరివాహక రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపైకి కర్ణాటకలోనే కొంత ఎక్కువ నష్టం జరిగిందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈమేరకు 39 పేజీల కూడిన నివేదకను దేశ అత్యున్నత న్యాయస్థానానికి సదరు కమిటీ సోమవారం అందజేసింది. అయితే ఎక్కడా కూడా కర్ణాటక తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలా వద్దా ? అన్న విషయంపై   స్పష్టత ఇవ్వక పోవడం గమనార్హం. కావేరి నదీ జలాల విడుదలకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీం సూచన మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఝూ నేతృ్వంలోని నిపుణుల కమిటీ ఈనెల 8,9 తేదీల్లో కర్ణాటకలో తరువాత రెండు రోజులు తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో వారి దృష్టకి వచ్చిన వివరాలను నివేదిక రూపంలో సుప్రీం కోర్టుకు అందజేశారు. కర్ణాటకలో కావేరి నదీ పరివాహక ప్రాంతంలో 48 తాలూకాలు ఉండగా ఈ ఏడాది ఇందులో 42 తాలుకాలు కరువు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇక ఇరు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుత పంటలకు  (స్టాండింగ్‌క్రాఫ్ట్స్)కు నీటిని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారని తెలిపింది. ముఖ్యంగా చెరకు పంటకు సరైన నీటి సదుపాయం కల్పించకపోవడంతో మండ్యలో ఎక్కువ మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

నీటి లభ్యత తక్కువ కావడం వల్ల రైతులే కాకుండా రైతు కూలీలు, జలాశయాల్లో నీరు లేకపోవడం వల్ల చేపల పట్టి పొట్టపోసుకునే వారికి పనిదొరకడం లేదని తేలింది. దీని వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రస్తుతం కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలో చెప్పుకోదగ్గ వర్షం పడే సూచనలు లేవని అయితే తమిళనాడులో జనవరి వరకూ వర్షం పడే అవకాశం ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది. అంతర్జల మట్టం విషయంలో తమిళనాడు మెరుగ్గా ఉందని పేర్కొంది. కర్ణాటకలో దాదాపు వెయ్యి అడుగుల నీరు వేసినా బోరులో నీటి పరిస్థితి లేదని కమిటీ పేరొంది. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటకలో తాగు, సాగు నీటి వాడకం విషయంలో అశాస్త్రీయ పద్దతులను పాటించడం వల్ల కావేరి నదీ జలాల వౄ ఎక్కువగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల ప్రజలను జాగృం చేసి బిందు, తుంపర సేద్యాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొంది. మొత్తంగా తమిళనాడుతో పోలిస్తే కర్ణాటకలోనే కావేరి కష్టం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ విషయమై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ ఢిల్లీలో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘ నిపుణుల కమిటీ దాదాపు ఇరు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిపై 16 పాయింట్లతో కూడిన నివేదిక అందజేసింది. నిపుణుల కమిటీ పేర్కొన్న కొన్ని అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు కావేరి నదీ నీటి వినియోగంలో శాస్త్రీయత పాటించాలని పేర్కొంది. వారి సూచనలపై ప్రజలకు తప్పక అవగాహన కల్పిస్తాం.’ అని పేర్కొన్నారు.

 
నేటి నుంచి విచారణ...

కావేరి ట్రిబ్యునల్ 2007లో ఇచ్చిన తుది తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై నేటి (మంగళవారం) నుంచి సుప్రీం కోర్టులో దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య పీఠం విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలను తన వాదన సందర్భంలో ఎంత సమర్థంగా వినియోగించుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement