
శ్రీకాకుళం: అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి చదువుతున్న నిహారిక అనే విద్యార్థిని ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడింది. సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన మార్పులను కొనియాడింది ఆ విద్యార్థిని. ఆ బాలిక ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా సాగింది. దీన్ని చూసి సీఎం జగన్ మురిసిపోయారు.
చివర్లో సీఎం జగన్‌పై తెలుగులో ఒక కవిత్వం కూడా చెప్పింది. జగన్ మావయ్యా.. ‘మీరు రాజన్నకి పుత్రుడు, రైతన్నకి మిత్రుడు, అక్కాచెల్లెలమ్మకు అన్నదమ్ముడు, మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు’.. అంటూ తన ప్రసంగాన్ని ముగించింది.ఈ క్రమంలోనే సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకుంది విద్యార్థిని నిహారిక. అందర్నీ కట్టిపడేసిన ఈ చిన్నారి ప్రసంగం మీరు వినండి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇక్కడ చదవండి: చదువు మీద పెట్టే ప్రతిపైసా గొప్ప పెట్టుబడి: సీఎం జగన్