Andhra Pradesh: Guidelines For Implementation Of Amma Vodi Scheme - Sakshi
Sakshi News home page

28న ‘అమ్మ ఒడి’.. ఏపీ సర్కార్‌ కీలక మార్గదర్శకాలు జారీ..

Published Sat, Jun 17 2023 8:36 AM | Last Updated on Sat, Jun 17 2023 4:03 PM

Andhra Pradesh: Guidelines For Implementation Of Amma Vodi - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి 2022–23 పథకం అమలుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శ­కాలు జారీ చేసింది. తమ పిల్లలను పాఠశాలలు, జూ­­నియర్‌ కళాశాలలకు పంపుతున్న తల్లుల ఖా­తా­ల్లో ఈ నెల 28న అమ్మఒడి నగదును జమ చేయ­నుంది. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున పొందచ్చని పేర్కొంది. 

►  ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులు. 
► పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదు.
► ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభు­త్వోద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడి­కి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
►  వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల్లోపు, మాగాణి భూమి 3 ఎకరాల్లోపు, రెండూ కలిపి ఉంటే 10 ఎకరాల్లోపు ఉండాలి.
►  విద్యుత్‌ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించనివారు కూడా అర్హులే.
► నాలుగు చక్రాల వాహన యజమానులకు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపునిచ్చింది. వీరు అమ్మఒడి పథకానికి అర్హులే.
► పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకుండా ఉంటే అమ్మఒడిని వర్తింపజేస్తారు. 
► పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్‌ ఐటీ వంటి కోర్సుల్లో చేరేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేస్తారు.

చదవండి: తిరుమల: 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement