తల్లి రుణం తీర్చుకోవడానికే అమ్మ ఒడి
తల్లి రుణం తీర్చుకోవడానికే అమ్మ ఒడి
Published Tue, Feb 28 2017 12:44 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
గుండాల (ఆలేరు) : తల్లి రుణం తీర్చుకోవడానికే గత ఐదు సంవత్సరాలుగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని చేపట్టి పిల్లల తల్లులకు ఒడి నింపి తన తల్లి రుణం తీర్చుకుంటున్నానని సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. అశోక్‌తేజ తల్లిదండ్రులు సుద్దాల జానకమ్మ, హన్మంతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలోసోమవారం జనగామ జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామంలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్నప్పుడు బిడ్డను కాపాడుకోవడానికి ఓ తల్లి పడిన ఆవేదన, అదే ప్రాంతంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా వదిలేసిన సంఘటనను తనను కలచి వేశాయని చెప్పారు. ఆ సంఘటనలనే స్ఫూర్తిగా తీసుకొని తన తల్లిదండ్రుల పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి అమ్మ ఒడి అమ్మ మడి, అమ్మ బడి తది తర సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement