Breadcrumb
12 Years For YSRCP: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published Sat, Mar 12 2022 9:21 AM | Last Updated on Sat, Mar 12 2022 1:34 PM
Live Updates
వైఎస్సార్సీపీ@12.. అవిర్భావ దినోత్సవ సంబరాలు
ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాక్షి, కర్నూలు జిల్లా: ఆళ్ళగడ్డలో వైఎస్సార్సీపీ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, నాలుగు రోడ్ల కూడలివరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్రరెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్తూరులో వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, చిత్తూరు: మదనపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నవాజ్ భాష ఇతర నేతలు నివాళులు అర్పించారు. కుప్పంలోనూ ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు పార్టీ జెండా ఎగురవేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎంపీ చింతా అనురాధ, కుడుపూడి సూర్యనారాయణ రావు కూడ ఉన్నారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు పలుసేవా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రధాన కూడళ్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మాలల వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ఆసుపత్రుల్లోని రోగులకు, వృద్దులకు పాలు, బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.
వైఎస్సార్సీపీ@12.. పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి తానేటి వనిత
సాక్షి, పశ్చిమగోదావారి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవ్వూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి తానేటి వనిత పార్టీ జెండా ఆవిష్కరించారు.వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పాలు అందజేశారు.
సువర్ణ పాలన అందించాలనే వైఎస్సార్సీపీ స్థాపన: వైవీ
పశ్చిమగోదావరి: ద్వారకా తిరుమలలో ఘనంగా వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్ర పాటానికి వైవీ సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వెంకటేశ్వరుని సన్నిధి ద్వారకాతిరుమలలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీ స్థాపించిన 11 ఏళ్లు పూర్తైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సువర్ణ పాలన అందించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్సీపీని స్థాపించారని తెలిపారు. 2014లో అధికారంలోకి రాకపోయినా ప్రజల్లోనే సీఎం జగన్ ఉన్నారని గుర్తుచేశారు. 9 ఏళ్ల ప్రస్థానంలో నిరంతరం ప్రజల మధ్య సమస్యల కోసం పోరాడారని తెలిపారు.
ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఒక్క వ్యక్తి పోరాట పటిమతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని, ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై అక్రమంగా కేసులు బనాయించాయని మండిపడ్డారు. 2019 లో 22 ఎంపీ, 151 సీట్లు అసెంబ్లీ స్థానాలతో ప్రజలు ఆశీర్వదించారని గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పాలన సీఎం వైఎస్ జగన్ పేదలకు అందిచారని తెలిపారు.
వైఎస్సార్సీపీ@12: అనంతపురంలో వేడుకలు
వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురం పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బోయ గిరిజ, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమ కోసమే సీఎం జగన్ పాలన: బాలినేని
ప్రజల మధ్యనే పుట్టిన పార్టీ వైస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు బాలినేని శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నో కష్టాలు పడి పార్టీని జగన్మోహన్రెడ్డి అధికారంలోకి తెచ్చారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి జగన్ పాలన చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తుచేశారు. మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
12వ ఏట అడుగుపెడుతున్నాం: సీఎం జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా.. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు( శనివారం) 12వ ఏట అడుగుపెడుతున్నామని తెలిపారు. ‘మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో నేడు 12వ ఏట అడుగుపెడుతున్నాం. మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాలకు దారులు తీస్తున్నాం. మన లక్ష్యాలు సాకారం అవుతున్నాయి.. మన విజయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి!
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2022
వైఎస్సార్సీపీ@12: శ్రీకాకుళంలో వేడుకలు
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ@12: గుంటూరు జిల్లాలో వేడుకలు
గుంటూరు: వినుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు.
నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.
మంగళగిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు.
సత్తెనపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కేక్ కట్ చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
గుంటూరు ఈస్ట్: గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే ముస్తఫా ఆవిష్కరించారు.
చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
వైఎస్సార్సీపీ@12: తణుకులో వేడుకలు
పశ్చిమగోదావరి: తణుకు నియోజకవర్గంలో ఘనంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జెండాను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. తణుకు నియోజకవర్గం మూడు మండలాల నుంచి భారీగా వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్లో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే కారుమూరి
నివాళులు అర్పించారు. వైస్సార్సీపీ 12వ ఆవిర్భవ దినోత్సం సందర్భంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
కర్నూలు: పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆర్థర్
కర్నూలు: వైఎస్సార్సీపీ 12 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్రహ్మణకొట్కూరు, నందికొట్కూరులో దిగవంత నేత డా.వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఆర్థర్ నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జగన్ అంటే సంక్షేమం: ఉమ్మారెడ్డి
తాడేపల్లి: దేశ వ్యాప్తంగా బేరీజు వేస్తే ఇతరులు సాధించడానికి ఏమీ లేకుండా మనం సాధించాం. మొన్నటి ఎన్నికల్లో స్థానిక సంస్థల్లోనూ 90 శాతం మనకే వచ్చాయి. ఆఖరికి కుప్పంలో కూడా విజయదుందిబి మోగించాం అన్నారు పొలిట్ బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షేమం అంటే జగన్...జగన్ అంటే సంక్షేమం. ఎన్నో కష్టాలు పెట్టినా జగన్ వేరవలేదు..ఇప్పుడు రాష్ట్రమంతా జగన్ అంటున్నారు.మొన్నటి ఎన్నికలలో వచ్చిన దానికంటే మరింత ముందుకు వెళ్ళాలని కార్యకర్తలకు ఉమ్మారెడ్డి పిలుపు ఇచ్చారు.
జగన్.. సమర్థుడైన సీఎం: డిప్యూటీ సీఎం ధర్మాన
తాడేపల్లి: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుస్తోంది. ఒక సమర్థమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారు. మనమంతా ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా తుది దశకు వచ్చాయి. మన నాయకుడు ఆలోచన అందరికీ న్యాయం చేయడమే అన్నారు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.
పార్టీ జెండాని మోసిన ప్రతీ ఒక్కరికీ న్యాయం: కాకాణి
వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించిన సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయంతోనే పార్టీ ఆవిర్భవించింది. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సంక్షేమాన్ని సీఎం జగన్ అందిస్తున్నారు. రోజురోజుకీ జగన్ పాలనకి జనాల్లో ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రానికి వైఎస్ జగన్ శాశ్వత ముఖ్యమంత్రి. పార్టీ జెండాని మోసిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తాం అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
కష్టపడదాం.. జనకాంక్షను నెరవేర్చుదాం
వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మంత్రి అదిమూలపు సురేష్ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.
అతి కొద్ది కాలంలోనే మనం అధికారం లోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తోంది. ప్రతి కార్యకర్త కష్టమే పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం. ఎవరినీ పార్టీ మర్చిపోదు... అందరికీ సమన్యాయం జరుగుతుంది. పార్టీ బలోపేతానికి పునరంకితం అవుదాం. రానున్న రోజుల్లో పార్టీని అధికారంలో నిలబెట్టేలా కష్టపడదాం. వైఎస్ జగన్ మూడు దశాబ్దాలు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పారు విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్.
పార్టీ జెండాను ఆవిష్కరించిన సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి అదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి
వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీ వి.విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వైఎస్సార్సీపీ 11వసంతాలు పూర్తిచేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత 11ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో పార్టీని పదిలం చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీశ్రేణులందరికీ శుభాకాంక్షలు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వైఎస్సార్సీపీ 11వసంతాలు పూర్తిచేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పార్టీ అధినేత, సీఎం శ్రీ @YSJagan గారు గత 11ఏళ్లలో ఎన్నోసవాళ్లను అధిగమించి కోట్లాదిమంది ప్రజలహృదయాల్లో పార్టీని పదిలం చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీశ్రేణులందరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/sWDKAdnujV
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2022
వైఎస్సార్సీపీ@12: విద్యార్థులకు పండ్లు, దుప్పట్ల పంపిణీ
వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్థానిక విశ్వభారతి అంధుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు, బ్రెడ్, దుప్పట్లు పంపిణీ చేశారు.
వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా..
ప్రజాహితం కోసం వెలిసి.. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ) పన్నెండవ వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. వాడవాడలా వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
Related News By Category
Related News By Tags
-
వైఎస్సార్సీపీ@12: ప్రతి క్షణం ప్రజల కోసమే..
12th Formation Day Of YSR Congress Party 2022: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందడం కోట్లాది మందిని నిశ్చేష్ట...
-
చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!: వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు రూ.18 వేల కోట్లు కరెంటు బిల్లులు బాదేశారు. ఇందులో రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో రూ.11 వేల కోట్...
-
బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామం: వైఎస్ జగన్
‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్ సిక్స్.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధ...
-
తప్పంతా సర్కారుదే: వైఎస్ జగన్
రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనకు సంబంధించి ప్రభుత్వం తరఫున చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రతి బాధితుడి వద్దకు మంత్రిని పంపించి రూ.10 లక్షలు డబ్బు ఇచ్చి, ఇటువంటి తప్పు ఇంకోసారి జరగనివ్వబోమని లెంపలేసుకోవా...
-
పదకొండవ వసంతం: కొన్ని ముఖ్య ఘట్టాలు
సాక్షి, అమరావతి: రాజన్నగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ఆయన లక్ష్యాలు, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఉద్భవించిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తన...
Comments
Please login to add a commentAdd a comment