సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ డల్లాస్ విభాగం, డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టెక్సాస్‌లోని ఇర్వింగ్ రెడ్ క్రాస్ అండ్ ప్లేట్‌లెట్ డొనేషన్ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎన్‌ఆర్‌ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ డల్లాస్ విభాగం నాయకులు వల్లూరు శివశంకర్ రెడ్డి, డాక్టర్ రాజేంద్ర పోలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఉన్న చరీష్మా మరే ఇతర నాయకులకు లేదన్నారు.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వైఎస్సార్ సేవలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారన్నారు. ఆయన తన జీవితాన్ని ప్రజల సంక్షేమం కోసం అర్పించారన్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు కృష్ణారెడ్డి, సుధాకర్ మీనకూరు, రవీందర్ రెడ్డి అరమింద, శివకోటిరెడ్డి గుడ్డేటి, గడికోట భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వీరశివారెడ్డి, చంద్ర, అనిల్ కుండ, నాగేశ్వర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ మోపూరు, చైతన్య రెడ్డి, రవితేజ, కిరణ్, శ్రీనాథ్, ఎల్లారెడ్డి, విష్ణు, ప్రసాద్ నాగారపు, ఆనంద్‌రెడ్డి, అజయ్, తరుణ్, దీపేశ్వర్ రెడ్డి, అనురాగ్, మణిదీప్‌రెడ్డి, వివేక్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment