సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ.. ఆ రోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది.
ఎమ్మెల్యేలు, పార్టీ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని.. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నిర్దేశించింది.
ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట
మరో వైపు, అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇస్తున్నారు. పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటానికి సిద్ధమైంది. జనవరి 3న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment