జగన్‌ ఒక అరుదైన నేత: సజ్జల | #HBDYSJAGAN: Sajjala Cut Cake At Tadepalle Party Office Celebrations | Sakshi
Sakshi News home page

జగన్‌ ఒక అరుదైన నేత: తాడేపల్లి వేడుకల్లో సజ్జల

Published Sat, Dec 21 2024 11:53 AM | Last Updated on Sat, Dec 21 2024 1:21 PM

#HBDYSJAGAN: Sajjala Cut Cake At Tadepalle Party Office Celebrations

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నేళ్ల పాలనాకాలంలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డినే అని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ(డిసెంబర్‌ 21) పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.

కేక్‌ కట్‌ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు.. జగన్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని కోట్లాధి మంచి అభిమానుల గుండె చప్పుడు వైఎస్‌ జగన్‌. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజాసంక్షేమమే ఆయన లక్ష్యం. అయిదేళ్ళ పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంధి పలికారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్ర. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. జగన్‌ రియల్‌ విజనరీ. నేతల్లోనే జగన్‌ అరుదు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్‌ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు అని అన్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన ప్రజాప్రతినిధిగా, మంచి పరిపాలకుడు, జనరంజకుడుగా ఎదిగారు. వైయస్ జగన్ గారు తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. మాటకు కట్టుబడే నాయకుడుగా జనం ఆయనను మెచ్చారు. అందుకే అధికారంను కట్టబెట్టారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం. ఆయన నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడానికి ఏనాడు అంగీకరించలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులను సగౌరవంగా స్వీకరించారు. గెలుపు ఓటములు కాదు, ప్రజలకు మనం ఏం చేశాము, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎలా వ్యవహరించాము అనేదే ముఖ్యమని పార్టీకి దిశానిర్ధేశం చేసిన మార్గదర్శకుడు వైయస్ జగన్.

.. పేదలకు ఉచిత బస్సు ప్రయాణాలు, గ్యాస్ సిలెండర్లు వంటి తాయిలాలు ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో మంచి మార్పు రావాలి, తమ తలరాతను తామే రాసుకునే స్థాయిలో వారు నిలబడేందుకు ప్రభుత్వంగా మనం అండగా ఉండాలనే లక్ష్యంతో గత అయిదేళ్ళలో ఆయన పాలన సాగింది. భవిష్యత్తును ఆలోచించి ఆయన తన పాలనలో అనేక పథకాలను అమలు చేశారు. ఏదో విజన్ అంటూ హంగామా చేయడం కాదు, అయిదేళ్ళ పాలనలో గొప్ప పునాదులతో కూడిన విధానాలను అమలులోకి తీసుకువచ్చి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని తపించిన నేత వైయస్ జగన్. అటువంటి విజనరీ జన్మదినం సందర్భంగా ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడుగా ఎదగాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మంచిపనులు, దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకు వచ్చిన సంస్కరణల వల్ల తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అదుకోవాల్సి ఉంటే, గత ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై చేసిన దాడి, చెప్పలేని అనేక కారణాల వల్ల అధికారానికి దూరమయ్యాము. కానీ ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలబడాలని, నిరుత్సాహం నుంచి ప్రజల క్షేమమే ధ్యేయంగా అందరినీ ముందుకు నడిపిస్తున్న ధీశాలి అని సజ్జల అన్నారు.

సజ్జలతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  

ఇక.. బర్త్‌ డే వేడుకల్లో తొలుత..  జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్‌కు విషెస్‌ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. జగన్‌పై అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చినవాళ్లను సజ్జల అభినందించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement