వైయస్సార్సీపీ సిద్ధం సభలకు అమెరికా NRI ల సంఘీభావం ! | NRIs full support for the YSRCP Siddham meetings | Sakshi
Sakshi News home page

వైయస్సార్సీపీ సిద్ధం సభలకు అమెరికా NRI ల సంఘీభావం !

Published Tue, May 7 2024 9:58 AM | Last Updated on Tue, May 7 2024 4:17 PM

 NRIs full support for the  YSRCP Siddham meetings

ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో  లాస్  ఏంజెల్స్, ఇర్విన్ పట్టణంలోని వైయస్సార్‌సీపీ అభిమానులు సమావేశమైనారు.,ఈ వారం రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులపై సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు .

వాస్తవానికి గత అన్ని ప్రభుత్వాలకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించినప్పటికీ , ఆదాయ వనరులతో  భావితరాల అభివృద్ధికి బాటలు పరిచినప్పటికీ, కేవలం సంక్షేమానికి సంబందించిన విషయాలు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందినందున, అభివృద్ధికి సంబంధించి మరింత అవగాహన కల్పించాలని తీర్మానించారు .

ఈ సందర్భంగా పలువురు ఎన్‌ఆర్‌ఐలు మాట్లాడుతూ, వైయస్సార్‌సీపీ తాను చేసిన పనులను చెప్పుకుంటూ, ఓట్లను అభ్యర్థిస్తుండగా , ప్రతిపక్షాలు మాత్రం వారు గతంలో చేసిందేమీ లేక కేవలం తిట్లు , పరుషవాక్యాలతో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఈ వ్యత్యాసం గ్రహించలేని అజ్ఞానులు ఏమాత్రం కాదని , అది ఎన్నికల ఫలితాలలో నిరూపించబడుతుంది  అన్నారు .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement