దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా అమెరికాలో పలు నగరాల్లో వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఐలు రక్తదాన, అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్హామ్ నగరంలో చర్చ్ ఆఫ్ రీకాన్సిలెర్లో అన్నదాన సేవ కార్యక్రమం నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ అలబామా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి యర్ర బోతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో నీరజరెడ్డి యర్రబోతుల, బసివిరెడ్డి కళ్లం, సుజనేంద్ర ఎరబోలు, శోభన్ అన్నెపు, రమణ మెట్ట, ధీరజ్ శర్మ, ఇంకా.. కృష్ ఎరబోలు, హేమంత్ కళ్లం పాల్గొని సేవచేశారు.