డల్లాస్: ఏపీ దివంగత ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్దంతిని పురస్కరించుకుని అమెరికాలోని డల్లాస్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. వచ్చే సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ఆర్ ఫౌండేషన్, డల్లాస్ వైఎస్ఆర్‌సీపీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
ఇందుకు సంబందించి రెడ్ క్రాస్ సొసైటీతో చర్చించి రెండు వారాలు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓ మంచి పని చేయడానికి అందరూ ఎల్లప్పుడూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడానికి వచ్చే ఔత్సాహికులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకొని రావాలని తెలిపారు. ఆసక్తిగల వారు ఈ కింది లింక్ మీద క్లిక్ చేసి బ్లడ్ డొనేషన్‌కు టైమ్ స్లాట్ బుక్చేసుకోవచ్చు. http://www.redcrossblood.org/give/drive/driveSearchList.jsp?zipSponsor=drysrfoundation
రక్తదాన శిబిరం నిర్వహించే ప్రదేశం
డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్
యోలో క్లబ్, 9456 ఎన్ మ్యాక్ ఆర్తర్ బీఎల్‌వీడీ.
ఇర్వింగ్, టెక్సాస్
వైఎస్సార్ వర్దంతి సందర్భంగా డల్లాస్‌లో బ్లడ్ డొనేషన్
Published Wed, Aug 23 2017 10:10 PM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM
Advertisement
Advertisement