YS Rajasekhara Reddy Foundation
-
నార్త్ కరోలినాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
అమెరికాలో జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం సామూహిక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్ ను అందించినట్లు చెప్పారు. అదే విధంగా వైఎస్సార్ అభిమానులు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, వైఎస్సార్ ఫౌండేషన్ సేవల్ని వినియోగించుకోమని తెలియచేసారు. రాధాకృష్ణ కాలువాయి వైఎస్సార్ సేవల్ని కొనియాడుతూ వైఎస్సార్ అభిమానులకు ఘన స్వాగతం పలికారు. సునీత రెడ్డి మాట్లాడుతు వైఎస్సార్ రైతుల పక్షపాతి అని, ఎప్పుడు రైతుల గురించి వారి భరోసా గురించి ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ రైతులకు స్ఫూర్తిగా వైఎస్సార్ జయంతి నాడు వనభోజనాలు ఏర్పాటుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు వక్తలు వై ఎస్సార్ గారు చేసిన సేవలను కొనియాడారు. కేక్ కట్ చేసి, వై ఎస్సార్ గారి పుట్టినరోజు ని ఘనంగా జరుపుకొన్నారు. ఫుడ్ డ్రైవ్ దాతలకు, వాలంటీర్లకు పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియచేశారు. ఫుడ్ డ్రైవ్ చేయడం, ఆనందం గా వనభోజనాలు నిర్వహించినందుకు వై ఎస్సార్ అభిమానులు నిర్వాహకులను అభినందించారు. వాతావరణంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బా రెడ్డి మేకా, రాధాకృష్ణ కాలువాయి, సునీత రెడ్డి, సురేష్ దేవిరెడ్డి, సంజీవ రెడ్డి, మస్తాన్ రెడ్డి, బాజీ షేక్, ప్రసన్న కూసం, అశోక్ మోర ల సారధ్యంలో పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. దాతలు రాజశేఖర రెడ్డి సున్నం, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, అశోక్ మోర, రౌనక్ రెడ్డి, నారాయణ్ దొంతు, బాజీ షేక్, జగదీష్, సునీత రెడ్డి, రఘునాథ్ కొత్త, రాధాకృష్ణ కలువాయి సుబ్బా రెడ్డి మేకా సహకారం చేశారు. వాలంటీర్లు సురేష్ దేవిరెడ్డి, సునీత రెడ్డి, బాజీ షేక్, మస్తాన్ రెడ్డి, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, చందు రెడ్డి , నారాయణ్ దొంతు, సంజీవ రెడ్డి, దుశ్యంత్ రెడ్డి, జగదీష్ , అశోక్ మోర, ప్రసన్న కూసం, హరినాథ్ చేజెర్ల, వెంకట్ జమ్ముల , శ్రీధర్ రామిరెడ్డి, కిరణ్ అంకిరెడ్డి, వీర రెడ్డి గొట్టివీటి, శంకర్ రెడ్డి తమ్మాలు సేవలందించారు. -
అమెరికా అంతటా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
వాషింగ్టన్: దివంగత మాజీ ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అమెరికాలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) వేడుక కార్యక్రమాలను నిర్వహించనుంది. డాక్టర్ వైయస్ఆర్ అభిమానుల సహాయంతో అమెరికాలోని వివిధ నగరాలు కాలిఫోర్నియా, కనెక్టికట్, డెలావేర్, ఫ్లోరిడా, జార్జియా,ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మిన్నెసోటా, మిస్సౌరీ, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఒహియో, పెన్సిల్వేనియా, టెక్సాస్, వర్జీనియా, వాషింగ్టన్ లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలను నిర్వహించనుంది. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ జయంతి ఉత్సవాలను జరుపనున్నారు. అమెరికాలో వైఎస్ఆర్ అనుచరులు జూలై 8 గురువారం వైఎస్ఆర్ జయంతిని జరుపుకోనున్నారు. జూలై 10, జూలై 11న ముఖ్యమైన కార్యక్రమాలు జరగుతాయని ఫౌండేషన్ నిర్వహకులు తెలిపారు.ఈ సేవ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ అనుచరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు జరిగే నగరాలు సీటెల్ (వాషింగ్టన్) జూలై 9, 2021 (శుక్రవారం), లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా),కనెక్టికట్, డెలావేర్, వర్జీనియా, డల్లాస్ (టెక్సాస్) జూలై 10, 2021 (శనివారం) శాన్ జోస్ (కాలిఫోర్నియా), అట్లాంటా (జార్జియా), చికాగో (ఇల్లినాయిస్), మేరీల్యాండ్, మిన్నియాపాలిస్ (మిన్నెసోటా), సెయింట్ లూయిస్ (మిస్సౌరీ), న్యూజెర్సీ, షార్లెట్ (నార్త్ కరోలినా), రాలీ (నార్త్ కరోలినా), కొలంబస్ (ఒహియో), ఆస్టిన్ (టెక్సాస్), హ్యూస్టన్ (టెక్సాస్) జూలై 11(ఆదివారం) గతంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ (యుఎస్ఎ) పలు కార్యక్రమాలను చేపట్టింది. కరోనా మహమ్మారి సమయంలో కోవిడ్ రిలీఫ్ ఈవెంట్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ కాన్సన్‌టేటర్లు, మెడికల్ కిట్లు, కూరగాయలు, మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు సహాయం చేయడం, కోవిడ్ రోగులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో నిధుల కొరతతో బాధపడుతున్న అనాథాశ్రమాలకు సహాయం చేసింది. డాక్టర్ ప్రేమ్ రెడ్డి సహాకారంతో ఫౌండేషన్ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లను, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటుచేసింది. డాక్టర్ ప్రేమ్ రెడ్డి డాలర్ టూ డాలర్ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతమైంది. ఫౌండేషన్‌కు విరాళాలు అందించిన వారికి కృతజ్ఙతలు తెలిపారు. -
వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరం
ఫిలడెల్పియా : రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదో వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిలడెల్పియాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ గోసల రాఘవ రెడ్డి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కి ఘన నివాళి అర్పించారు. 150 మంది రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అన్నా రెడ్డి, జాయింట్ ట్రెజరర్ శరత్ మందపాటి, శివ మేక, హరి వెళ్కూర్,అంజి రెడ్డి సాగంరెడ్డి, హరి కురుకుండ, ద్వారక వారణాసి, శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి, శ్రీనివాస్ ఈమని, మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, లక్ష్మి నారాయణ రెడ్డి, లక్ష్మీనరసింహ రెడ్డి, పద్మనాభ రెడ్డి, నాగరాజా రెడ్డి , జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు, రవి మరక, అజయ్ యారాట, నరసింహ రెడ్డి, వెంకట్ సుంకిరెడ్డితో పాటు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ‘ఉక్కు’ సంకల్పం
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీకి ఈనాటికి దిక్కులేదు.. పార్లమెంటు సాక్షిగా చట్టం చేసినా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు. విభజన జరిగి ఐదేళ్లు గడిచిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ బీజేపీతో కలిసి నాలుగున్నరేళ్లు కాపురం చేసినా ఉక్కుకు బీజం పడలేదు. బీజేపీతో విడిపోయిన తర్వాత టీడీపీ సర్కార్ ఓట్ల కోసం కొత్త రాజకీయానికి తెర తీసింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్లు.. సీట్లే లక్ష్యంగా చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశారు. ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వమే నెలకొల్పుతుందంటూ ఎత్తులు వేస్తూ గత డిసెంబరు 27న పునాదిరాయి వేశారు. రూ. రెండు కోట్లో నిధులు కేటాయించి ఉసూరుమనిపించారు. అయితే అంతకుముందే ప్రజా సంకల్పపాదయాత్ర సందర్భంగా...ఎన్నికలకు ముందు కూడా మాట ఇచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జులై 8న జమ్మలమడుగుకు వచ్చిన సీఎం జగన్ వైఎస్సార్ రైతు దినోత్సవ సందర్భంగా రానున్న డిసెంబరులోనే ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేసి మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లోనూ నిధులు కేటాయించి ఉక్కు పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేశారు. సాక్షి, కడప : అత్యంత వెనుకబడిన రాయలసీమలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి అనువైన వనరులున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా జిల్లాలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వసతులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఉక్కు పరిశ్రమను జిల్లాలో నెలకొల్పాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉక్కుకు సంబంధించి ముడి సరుకుతోపాటు ఇతర అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఏర్పాటైతే దినదినాభివృద్ది చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. 20–25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా అనుబంధ రంగాలు కూడా కొత్త పుంతలు తొక్కనున్నాయి. జిల్లా రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. ఉక్కు పేరుతో బాబు ఎన్నికల జి(ఎ)త్తులు ‘ఉక్కుఫ్యాక్టరీ శంకుస్థాపన ఎన్నికల స్టంట్‌లో భాగంగా తెరమీదికి తీసుకొచ్చారు. టీడీపీ అధినేత బాబు....రాయలసీమ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున తెలియజేశారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు చిత్తశుద్ధిపై జిల్లా ప్రజలకు నమ్మకం అంతంత మాత్రమేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే 1996, 1998లో సీఎం హోదాలో చంద్రబాబునాయుడు గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లే ‘స్టీల్ఫ్లాంట్ శంకుస్థాపన’గా వర్ణించారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం రూపొందించింది. ఆమేరకు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ప్రజానీకం ఉద్యమించింది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా తక్షణమే స్పందించి విభజన చట్టంలోని అంశాల సాధనకు కషి చేయాల్సిన టీడీపీ నేతలు ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా అప్పట్లో వ్యవహరించారు. ఎన్నికల ఎత్తులో భాగంగా డిసెంబరు 27న మైలవరం మండలంలోని కంబాలదిన్నె వద్ద ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘రాయలసీమ స్టీల్ కార్పోరేషన్ లిమిటెడ్’ఏర్పాటుకు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏపీఎండీసీ, రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ 50:50 వాటాలతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని, అందుకోసం రూ.2కోట్లు మూలధనంతో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేçస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిజంగా టీడీపీ సర్కార్‌కు అప్పట్లో చిత్తశుద్ది ఉంటే అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే శిలాఫలకం వేసి పనులు చేపట్టి ఉండేవారు. అలా కాకుండా ఎన్నికలకు మూడు నెలలు ముందు పునాది రాయి వేయడం....ఎన్నికల జిత్తుగాక మరొకటి కాదు. అందుకే జిల్లా ప్రజలు కూడా విజ్ఞతతో ఓట్లు వేసి టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. బడ్జెట్లో భారీగా నిధులు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానున్న నేపథ్యంలో బడ్జెట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికంగా నిధులు కేటాయించారు. ఉక్కుకు సంబంధించి తొలి విడతలోనే సుమారు రూ.250 కోట్లు కేటాయించారు. డిసెంబరులో శంకుస్థాపన చేయగానే పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది. పనులు ప్రారంభం కావడమే తరువాయి....యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభపరిణామం. వైఎస్ జగన్ ఉక్కు సంకల్పం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉక్కు సంకల్పం నెరవేర్చే దిశగా శ్రీకారం చుట్టారు. ముందుగా శిలాఫలకం వేసే తేదితోసహా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనువెంటనే బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించి జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఏది ఏమైనా ఉక్కు పరిశ్రమకు డిసెంబరులో పునాది రాయి పడడంతోపాటు నిధులు పుష్కలంగా ఉండడంతో పనులు వేగవంతంగా జరుగుతాయని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. -
వైఎస్ వైద్యం.. పేదలకు వరం
సాక్షి, కడప అర్బన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. పేదలకు కూడా మెరుగైన చికిత్స అందాలనే ఆశయంతో ఆయన వైద్య వరమిచ్చారు. కడప నగర శివారులోని పుట్లంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 230 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో ‘రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)’ పేరుతో ఏర్పాటు చేశారు. + రిమ్స్‌ను ప్రారంభంలో రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించాలని 2005 జనవరి 28న శంకుస్థాపన చేశారు. + 2006 సెప్టెంబర్ 27న అప్పటి సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల మీదుగా కడప రిమ్స్ అధునాతన భవనాలు ప్రారంభించారు. + కడప రిమ్స్‌లో 750 పడకలు, 18 విభాగాలు, ఐపీ, ఓపీతోపాటు.. కళాశాల ప్రత్యేక భవనాలతో 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రవేశార్హతతో కళాశాలను ప్రారంభించారు. + సెమీ అటానమస్ విధానాన్ని ప్రవేశ పెట్టి బోధనాధ్యాపకులు, పరిపాలన సిబ్బందిని నియమించారు. + అదే సమయంలో నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి చేశారు. + సోనియాగాంధీ పర్యటన సమయంలోనే 2006 సెప్టెంబర్ 27న 30 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. + 2009 జనవరి 24న 100 వైద్యసీట్లతో 2008 విద్యాసంవత్సరం దంతవైద్య కళాశాలను వైఎస్ఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. + ప్రస్తుతం 14వ వైద్య విద్యా సంవత్సరం విద్యార్థులు తమ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. + 2014 నుంచి పీజీ వైద్య విద్యార్థులు కూడా 9 విభాగాల్లో అభ్యసిస్తున్నారు. + ప్రారంభంలో 400–450 మంది ఓపీకి రోగులు, 250 నుంచి 300 వరకు ఐపీ విభాగంలో రోగులు వైద్యసేవలను అందుకునేవారు. + ప్రస్తుతం రోజూ ఓపీకి 1600 మంది నుంచి 1800 మంది వరకు, ఐపీ విభాగంలో 600 నుంచి 750 వరకు వివిధ విభాగాల్లో వైద్య సేవలు పొందుతున్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన వెంటనే జిల్లాకు వైద్య సేవలను అందించేందుకు రిమ్స్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయం. రోగులు దూరప్రాంతాలైన కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌కు వెళ్లకుండా.. ఆ మహానుభావుని దయవల్లే ఇక్కడే మెరుగైన వైద్యం పొందుతున్నారు. – కె.శ్రీనివాస్, మోచంపేట, కడప అన్నివర్గాల ప్రజలను రప్పించగలిగారు కడప రిమ్స్‌కు పేద ప్రజల నుంచి మధ్య తరగతి వారు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉన్నత స్థాయికి చెందిన వారు వచ్చి వైద్య సేవలు పొంది.. వారు సజావుగా ఇంటికి వెళ్లేందుకు చేసిన పుణ్యం వైఎస్ఆర్దే. ఇప్పటికీ రిమ్స్ ఆవరణలో ఆయన చిరునవ్వు చెరిగిపోకుండా.. ప్రతి రోగి, వారి బంధువుల రూపంలో నిలిచే ఉంటుంది. – ఈశ్వరమ్మ, కడప -
వైఎస్సార్ వర్దంతి సందర్భంగా డల్లాస్‌లో బ్లడ్ డొనేషన్
డల్లాస్: ఏపీ దివంగత ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్దంతిని పురస్కరించుకుని అమెరికాలోని డల్లాస్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. వచ్చే సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ఆర్ ఫౌండేషన్, డల్లాస్ వైఎస్ఆర్సీపీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకు సంబందించి రెడ్ క్రాస్ సొసైటీతో చర్చించి రెండు వారాలు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓ మంచి పని చేయడానికి అందరూ ఎల్లప్పుడూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడానికి వచ్చే ఔత్సాహికులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకొని రావాలని తెలిపారు. ఆసక్తిగల వారు ఈ కింది లింక్ మీద క్లిక్ చేసి బ్లడ్ డొనేషన్‌కు టైమ్ స్లాట్ బుక్‌చేసుకోవచ్చు. http://www.redcrossblood.org/give/drive/driveSearchList.jsp?zipSponsor=drysrfoundation రక్తదాన శిబిరం నిర్వహించే ప్రదేశం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ యోలో క్లబ్, 9456 ఎన్ మ్యాక్ ఆర్తర్ బీఎల్వీడీ. ఇర్వింగ్, టెక్సాస్