
సాక్షి, రాజమండ్రి: కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై ప్రతినిధులు చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎన్నారై కో ఆర్డినేటర్ హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎన్నారై ప్రతినిధులు ఇంటింటికి తిరిగి.. ప్రజలను కలుసుకొని.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని, ఫ్యాన్‌ను గుర్తుకు ఓటువేసి.. వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ గల్ఫ్, కువైట్ కన్వీనర్ ఇలియాస్ బీహెచ్, ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, గల్ఫ్ ప్రతినిధులు షేక్ నాసర్, జీఎస్ బాబు రాయుడు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లలితరాజ్, సలహాదారులు అబూ తురాబ్, యూత్ ఇన్‌చార్జ్ మర్రి కళ్యాణ్, వైస్ ఇన్‌చార్జ్ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎన్నారైలు వజ్ర శేఖర్‌రెడ్డి, బాలరాజు, సత్తార్, ఇంతియాజ్, మురళీమోహన్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ఆనంద్, భరత్, సిద్ధూ, వెంకట్ రెడ్డి, రమణారెడ్డి, రాజు, డానీ, జయకర్ రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇలియాస్, బాలిరెడ్డి, హర్షవర్ధన్ మాట్లాడుతూ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోవింద్ నాగరాజు, నరసారెడ్డి మాట్లాడుతూ ఎన్నకల సమయంలో అబద్ధాలు చెప్పడం చంద్రాబుకు అలవాటు అని, 2014 ఎన్నికల్లోనూ ఎన్నో అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలో వచ్చి.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment