లండన్‌లో జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు | Telugu NRIs to celebrate YS Jagan Mohan Reddy Birthday in UK | Sakshi
Sakshi News home page

లండన్‌లో జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు

Published Thu, Dec 10 2015 2:21 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Telugu NRIs to celebrate YS Jagan Mohan Reddy Birthday in UK

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ యూకే, యూరోప్ విభాగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి లండన్‌లోని హాన్స్లో నగరం 764 గ్రేట్ వెస్ట్ రోడ్‌లోని భుకారా బాంకెట్ హాలులో ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ విభాగం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలందరు తప్పకుండా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆ కమిటీ కోరింది.

ఈ నెల 21న జగన్ పుట్టినరోజు కాగా ఆ రోజును పురస్కరించుకుని ఈ నెల 12 సాయంత్రం 4.30 గంటలకు హాన్స్లో నగరంలో వేడుక జరుపుతున్నట్టు ఆ విభాగం సభ్యులు వాసు, ఓబుల్‌రెడ్డి, సురేష్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, లోక్‌సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్ కె రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చలమలశెట్టి సునీల్ తదితరులు పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement