లండన్‌లో జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ యూకే, యూరోప్ విభాగం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి లండన్‌లోని హాన్స్లో నగరం 764 గ్రేట్ వెస్ట్ రోడ్‌లోని భుకారా బాంకెట్ హాలులో ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ విభాగం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలందరు తప్పకుండా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆ కమిటీ కోరింది.
ఈ నెల 21న జగన్ పుట్టినరోజు కాగా ఆ రోజును పురస్కరించుకుని ఈ నెల 12 సాయంత్రం 4.30 గంటలకు హాన్స్లో నగరంలో వేడుక జరుపుతున్నట్టు ఆ విభాగం సభ్యులు వాసు, ఓబుల్‌రెడ్డి, సురేష్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, లోక్‌సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్ కె రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చలమలశెట్టి సునీల్ తదితరులు పాల్గొంటున్నారు.