
కుబుంబ సభ్యులతో జితేంద్ర(ఫైల్)
లండన్: కుటుంబ సభ్యులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై జితేంద్ర లాడ్(49) గురించి దిగ్భ్రాంతికర వాస్తవం వెలుగు చూసింది. తనవారిని ఎలా చంపాలి, తర్వాత తాను ఎలా ఆత్మహత్య చేసుకోవాలనే దానిపై అతడు ఇంటర్నెట్ లో శోధించాడని అధికారులు వెల్లడించారు. కుంగుబాటు(డిప్రెషన్), గొంతు కోయడం గురించి అతడు అంతర్జాలంలో వెతికాడని తెలిపారు.
జితేంద్ర తన భార్య దక్షాబెన్(44), కుమార్తెలు త్రిష(19), నిష(16) లను కత్తితో పొడిచి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంగ్లండ్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో గతేడాది అక్టోబర్ 25న ఈ దారుణం జరిగింది. దీనికి కొద్దిరోజుల ముందు ఇంటర్నెట్ లో హత్య ఎలా చేయాలనే దాని గురించి వెతికినట్టు దర్యాప్తులో తేలింది. ఐటీ మేనేజర్ గా పనిచేసిన జితేంద్ర కుంగుబాటుకు గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడైంది.