వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండించిన సౌతాఫ్రికా ప్రవాసాంధ్రులు | YSRCP South Africa Wing Condemns Attacks On YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 28 2018 7:32 PM | Last Updated on Sun, Oct 28 2018 7:34 PM

YSRCP South Africa Wing Condemns Attacks On YS Jagan Mohan Reddy - Sakshi

జోహాన్స్‌బర్గ్ ‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ సౌతాఫ్రికా విభాగ నేతలు, తెలుగువారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ సౌతాఫ్రికా నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అడ్డు వస్తారని ప్రణాళిక ప్రకారం హత్య చేయించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసు వ్యవస్థను భాగం చేసి ప్రభుత్వ సంస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన వెంటనే టీడీపీ మంత్రులు ప్రవర్తించిన తీరు చాలా హేయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షతత్వాన్ని చంద్రబాబు మరోసారి భయటపెట్టుకున్నారని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే నిజాలు భయటకు రావని, కేంద్ర ప్రభుత‍్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హత్యాయత్నం వెనుక ఉన్న అసలు కుట్ర దారులు ఎవరో బయట పెట్టాలన్నారు. వైస్‌ జగన్‌ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సౌతాఫ్రికా వైఎస్సార్‌సీపీ అభిమానులు కల్లా నరసింహ రెడ్డి,కొత్త రామకృష్ణ,కుమార్ రెడ్డి మల్రెడ్డి,సూర్య రామిరెడ్డి,మురళీ సోమిశెట్టి, అంజిరెడ్డి సానికొమ్ము,రామ్మోహన్ పూల బోయిన, రాంబాబు తిరుమల శెట్టి,శ్రీ క్రిష్ణారెడ్డి, వెంకటరెడ్డి నల్ల గుండ్ల, అరుణ్ రెడ్డి,నరేంద్ర మోహన్ కేసవరపు, దుర్గా ప్రసాద్ చింతపల్లి,దినేష్ రెడ్డి, సౌతాఫ్రికా తెలుగువారు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement