యూఏఈలో ఒక్క రోజు ముందుగానే ఎన్నికల సమరం శంఖారావం మోగింది. యూఏఈ పర్యటనలో ఉన్న కడప యువ నాయకులు షేక్ ఉమైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఏఈ విభాగం కన్వీనర్ సయ్యిద్ అక్రం, సభ్యులు జాఫర్ అలీ, ఖాజా అబ్దుల్ ముతాలిబ్, విజయ భాస్కర రెడ్డి, ఫహీం, అబ్దుల్లా, చక్రితో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక, దుబాయ్ నగరంలోని కరమా పార్క్‌లో గణంత్ర దినోత్సవం సందర్భంగా కరమా ప్రాంతంలో ఉన్న ప్రవాసాంధ్రలకు కిరాణా వంట సామాన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కరమా వైఎస్సార్సీపీ నాయకులు ప్రేమ్, యాడ్ర శ్రీనివాస్, శేఖర్, తాడి రమేష్, సతీష్, నాగరాజు, అనిల్, షేక్ చిన్ని, శ్రీలక్ష్మి, దడాల సీత నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప యువ నాయకులు షేక్ ఉమైర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉమైర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు రానున్న ఎన్నికల దృష్ట్యా దిశా నిర్దేశం చేశారు. వేల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్లు.. సరిగ్గా 14 ఏళ్ల కిందట ఒక్కడై వైఎస్సార్‌సీపీని స్థాపించి కడప గడపలో నిలబడి గర్జిస్తే.. దెబ్బకు ఢిల్లీ గడ్డ దద్దరిల్లింది అని గుర్తు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో ప్రజలే తన సైన్యమని భావించి ధైర్యంగా అడుగు ముందుకేసిన జగనన్న.. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు తనొక్కడై, సైన్యమై నిలిచారని, ప్రతీ పనిలోనూ తోడుగా.. ఆపదొస్తే కొండంత అండగా ఉన్నారు. ఆయన సారథ్యంలో కార్యకర్తలుగా పని చేయడం మనందరికీ గర్వకారణం.
ఇడుపుల పాయ మొదలు.. ఇచ్చాపురం వరకు చేపట్టిన ‘ప్రజా సంకల్ప’ యాత్రలో అందరి నాయకుల్లా కళ్లతో కాకుండ మనసుతో ప్రజల కష్టాల్ని దగ్గరుండి చూశారు. అందుకే అధికారంలోకి వచ్చినరోజు నుంచి ప్రజల కష్టాల్ని శాశ్వతంగా తీర్చడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ప్రజల మనసుల్లో మనసున్న సీఎంగా నిలిచిపోయారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా సంక్షేమాన్ని పరవళ్లు తొక్కించారని ఆయన తెలిపారు.
ఈ రోజు విద్యా, వైద్యం.. సంక్షేమం.. అభివృద్ధి.. ఏ రంగంలో చూసినా.. ఏపీ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉంది. కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. సంక్షేమ సారథి అయిన సీఎం జగన్‌ను ఎదురించేందుకు ప్రతిపక్షాలు అందరూ కలిసి ఒక్కటిగా జట్టు కట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్‌ను గెలిపించుకునేందుకు మనమందరం సర్వ శక్తులు ఒడ్డి కృషి చేయాలి. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టు పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధంగానే చూడాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిసే వరకు ఉధృతంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతీ గడపకి చేరవేసే బాధ్యత మన అందరం తీసుకొని తీరాలి. జగనన్న కోసం సైనికుడిగా తన శక్తి మొత్తం పెట్టి పోరాడేందుకు తాను సిద్ధంమన్నారు. మీరు సిద్దమా అని అభిమానులను సమరోత్సాహులను చేశారు.
ఈ సందర్భంగా యూఏఈ వైఎస్సార్సీపీ కన్వీనర్ సయీద్ అక్రం మాట్లాడుతూ.. మరోసారి జగనన్న మన అందరికోసం రావాలని అందుకోసం అందరం ఒక్కటిగా ప్రభుత్వ గళాన్ని గట్టిగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించి.. ఎవరికి కష్టం వచ్చినా సత్వరమే స్పందించి ప్రభుత్వ ఖ్యాతిని ఎంతగానో పెంచుతున్న APNRTS చైర్మన్ మేడపాటి వెంకట్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment