రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై కాంటెస్ట్
జిల్లా, రాష్ట్ర స్థాయిలో వీడియో కాంటెస్ట్
వీడియో రూపకల్పనలో బెస్ట్ వారికి బహుమతులు
ఆన్‌లైన్ పోటీని రూపొందించిన ప్రవాసాంధ్రుడు శరత్
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోటీని ఔత్సాహిక ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ఎన్నారైలు శరత్ ఎత్తపు, తిరుమల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆన్‌లైన్ పోటీని APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి ప్రారంభించి మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో లబ్ధిదారులు పొందిన లబ్ధి గురించి అభిప్రాయాన్ని వీడియో రూపంలో చేసి అందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయాలని కోరారు.
ఎలా చేయొచ్చు అంటే.?
- ఏపీలో సంక్షేమపథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి?
- ఆర్ధిక, మౌలిక వసతుల రంగాల్లో ఏపీకి పునర్జీవనం వచ్చిందా ?
- ప్రజల బతుకుల్లో జగనన్న ప్రభుత్వం నింపిన వెలుగులపై ఏమనుకుంటున్నారు?
- మీ ఫోన్ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాన్ని వీడియో తీయండి, కింద పేర్కొన్న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి
- బెస్ట్ వీడియోకు తగిన గుర్తింపుతోపాటు నగదు పురస్కారం
- https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయండి
ఆసక్తి ఉన్న వారు "మేము సైతం" కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాష్ బహుమతులు గెలవచ్చన్నారు. వీడియోలను అనుభవజ్ఞులైన బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని, మొత్తం రూ.25 లక్షల నగదు బహుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రూ. 25,000, రెండో బహుమతి కింద రూ.15,000, మూడో బహుమతి కింద రూ.10,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5,000, రెండో బహుమతి కింద రూ.3,000, మూడో బహుమతి కింద రూ.2,000 ఇవ్వనున్నట్లు శరత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment