tirumal reddy
-
జగనన్న సంక్షేమంపై స్పెషల్ కాంటెస్ట్
సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా ‘మేము సైతం’ పేరుతో ప్రత్యేకంగా ఆన్లైన్ పోటీని ఔత్సాహిక ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేశారు. ఎన్నారైలు శరత్ ఎత్తపు, తిరుమల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ పోటీని APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి ప్రారంభించి మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో లబ్ధిదారులు పొందిన లబ్ధి గురించి అభిప్రాయాన్ని వీడియో రూపంలో చేసి అందరికీ తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయాలని కోరారు. ఎలా చేయొచ్చు అంటే.? ఏపీలో సంక్షేమపథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి? ఆర్ధిక, మౌలిక వసతుల రంగాల్లో ఏపీకి పునర్జీవనం వచ్చిందా ? ప్రజల బతుకుల్లో జగనన్న ప్రభుత్వం నింపిన వెలుగులపై ఏమనుకుంటున్నారు? మీ ఫోన్ ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాన్ని వీడియో తీయండి, కింద పేర్కొన్న వెబ్సైట్లో అప్లోడ్ చేయండి బెస్ట్ వీడియోకు తగిన గుర్తింపుతోపాటు నగదు పురస్కారం https://memusaitham.in/ లింక్ ద్వారా రిజిస్టర్ అయి, వీడియోలను షేర్ చేయండి ఆసక్తి ఉన్న వారు "మేము సైతం" కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లి జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాష్ బహుమతులు గెలవచ్చన్నారు. వీడియోలను అనుభవజ్ఞులైన బృందం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని, మొత్తం రూ.25 లక్షల నగదు బహుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి రూ. 25,000, రెండో బహుమతి కింద రూ.15,000, మూడో బహుమతి కింద రూ.10,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5,000, రెండో బహుమతి కింద రూ.3,000, మూడో బహుమతి కింద రూ.2,000 ఇవ్వనున్నట్లు శరత్ చెప్పారు. -
Pakhal Tirumal Reddy: వేయి రేఖల వినూత్న సౌందర్యం
పీటీ రెడ్డిగా విఖ్యాతులైన పాకాల తిరుమల రెడ్డి (1915– 1996) ప్రపంచ స్థాయికి చెందిన తెలంగాణ కళాకారుల్లో అగ్రగణ్యుడు. కరీంనగర్ జిల్లా, అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య చదివే రోజుల్లో ఆయన్ని ప్రోత్సహించింది ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ సుభాని. తన బంధువును కలిసేందుకు ఒక రోజు రెడ్డి హాస్టల్‌కు వెళ్లాడు పీటీ. ఆ రోజు స్కౌట్స్ డే. ముఖ్య అతిథి బాడెన్ పావెల్. బాడెన్ రూపానికి 17 ఏండ్ల పీటీ కాంతి వేగంతో ప్రాణం పోస్తున్నారు. అది గమనించిన కొత్వాల్ పీటీని పిలిపించుకొని తన పెయింటింగ్ వేస్తావా అని అడిగారు! మిడాస్ టచ్!! రెడ్డి హాస్టల్ నిబంధలను సవరించి ప్రతిభావంతులైన కళాకారులకూ స్కాలర్షిప్ ఇవ్వవచ్చని పీటీని ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేర్పించారు కొత్వాల్. ముంబైలోని ఆ వినూత్న ప్రపంచంలో సూజా, కేకే హెబ్బార్, ఎమ్ఎఫ్ హుస్సేన్ తదితరులు సహ విద్యార్థులు. తన 22వ ఏట చిత్రించిన సెల్ఫ్ పోర్ట్రెయిట్ అంతర్ వ్యక్తినీ చూపిందని అధ్యాపకులు మెచ్చుకున్నారు. జేజేలో 1935 నుంచి 42 వరకు చిత్రకళను అభ్యసించి డిప్లొమా పొందారు, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్‌తో! దేశ విభజన సందర్భంలో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాండలికాన్ని తన రచనలలో శాశ్వతం చేసిన యశోదా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కార్పెంటరీ ఇండస్ట్రీ నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ హుందాతనాన్ని తెలిపే ఫర్నిచర్ పీటీ రెడ్డి సమకూర్చిందే. శిల్పీ, దారుశిల్పీ; ఆయిల్, వాటర్ కలరిస్ట్ అయిన పీటీ కళా ప్రపంచానికి కానుకగా ఏమి ఇచ్చారు? ఒక్క మాటలో భారతీయ సాంస్కృతిక తాత్విక సౌందర్య భరిత వేయి దళాల పరిమళ భరిత పుష్పం! మన జ్ఞాపకాల పొరల్లో మసకబారిన ఆ కళారూపాలు చూడవచ్చా? ‘స్వధర్మ’లో మూడు అంతస్తులలోని ప్రత్యేక గ్యాలరీలలో పీటీ రెడ్డి కళా రూపాలు కొలువై ఉన్నాయి. వారి కుమార్తె లక్ష్మీ రెడ్డి దంపతులు ఎంతో శ్రద్ధగా కాపాడుతున్నారు. చిరునామా సులభం. నారాయణగూడ మెట్రో పిల్లర్ 1155. కళాకారులు, చరిత్రకారులు అపా యింట్మెంట్ తీసుకుని సందర్శించవచ్చు. (క్లిక్ చేయండి: అతడి మరణం ఓ విషాదం!) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ (జనవరి 4న పీటీ రెడ్డి జయంతి) -
అది నా ఇమేజ్ కాదు.. సినిమాది!
‘‘హిట్ సాధించిన సినిమాలో నటించిన హీరో చాలా లక్కీ. ఒక యాక్టర్‌గా సినిమాలో నా కృషి పది శాతమే. దర్శకులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఒక సినిమా సక్సెస్‌లో చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఒక హిట్ మూవీ సక్సెస్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది మాత్రం హీరోలే’’ అన్నారు కార్తికేయ. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన విశేషాలు.. ► ఇందులో ఒంగోలులోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గుణ అనే యువకుడి పాత్రలో నటించాను. చీమకుర్తి క్వారీ ఫ్యాక్టరీలో గుణ వర్క్ చేస్తుంటాడు. అతని వీధి చివర ఉండే సెల్‌ఫోన్ షాప్‌లోని అమ్మాయితో ప్రేమలో పడతాడు. హఠాత్తుగా అతను ఖైదీగా మారాల్సి వస్తుంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? వాటినుంచి గుణ ఎలా బయటప డ్డాడు? అన్నదే కథాంశం. దర్శకుడు అర్జున్, నా అభిరుచులు, అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి. ► ‘ఆర్ఎక్స్ 100’లో నేను చేసిన పాత్రకు మంచి మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ‘హిప్పీ’ నాలోని మరో యాక్టింగ్ యాంగిల్‌ని బయటపెట్టింది. ‘గుణ 369’ కూడా నా నటనలోని మరో కోణాన్ని ఆడియన్స్‌కు తెలిసేలా చేస్తుందనుకుంటున్నాను. నేనేం స్టార్ హీరో అయిపోవాలనుకోవడం లేదు. సినిమా హిట్ సాధించినా, ఫెయిల్ అయినా క్యారెక్టర్ కోసం కార్తికేయ వందశాతం కష్టపడ్డాడు అని ఆడియన్స్ గుర్తిస్తే చాలు. మాలాంటి కొత్తవారికి చిరంజీవిగారే స్ఫూర్తి. మాస్ హీరో కావాలని ‘ఆర్ఎక్స్ 100’ సినిమా చేయలేదు. సినిమా విడుదలైన తర్వాత మాస్ హీరో అన్నారు. అయినా అది నా ఇమేజ్ కాదు. మూవీ ఇమేజ్ అనుకుంటున్నాను. ‘ఆర్ఎక్స్ 100’ ఇతర భాషల్లో రీమేక్ అవుతుందంటే గర్వంగా ఉంది. కానీ నాకు రీమేక్ సినిమాలు చేయడం ఆసక్తిగా లేదు. ► నాని ‘గ్యాంగ్‌లీడర్’లో విలన్‌గా చేస్తున్నాను అంటే అది స్పెషల్ క్యారెక్టర్ కాబట్టే. ఆ పాత్ర స్పెషల్ కాకపోయి ఉంటే విక్రమ్‌గారు నన్ను అప్రోచ్ అయ్యేవారు కాదేమో. ప్రస్తుతం శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో హీరోగా చేస్తున్నాను. శ్రీ అనే మరో కొత్త దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాను. -
ఫుల్ రైజింగ్!
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు. ఇటీవల ‘హిప్పి’ అనే సినిమాకు సైన్ చేసిన ఈ యువ హీరో ఇప్పుడు అరుణ్ జంధ్యాల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో హీరోగా నటించడానికి పచ్చజెండా ఊపారు. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో హీరో కార్తికేయ కనిపించనునట్లు చిత్రబృందం పేర్కొంది. టీవీ రంగంలో మంచి పేరు సాధించుకున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంస్థలు ఈ చిత్రంతో సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. అనిల్ కుమార్, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 27న ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర అరుణ్ జంధ్యాల దాదాపు పదేళ్లపాటు అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. దీన్నిబట్టి బోయపాటి మార్క్ యాక్షన్ ఈ సినిమాలో కూడా ఉంటుందని ఊహించవచ్చు. -
నడిరోడ్డుపై టీఆర్ఎస్ కార్పొరేటర్ డ్యాన్స్
-
టీఆర్ఎస్ నేత డ్యాన్స్.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఆయన గ్రేటర్లో కార్పొరేటర్.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. పౌరుల సమస్యలపై విభిన్నంగా స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసించారు. అయితే సదరు కార్పొరేటర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లారు. అక్కడ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ హైవేపై ఆగి అనుచరులతో కలిసి తీన్మార్ ఆడారు. ఇరువైపులా వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా.. కారులో పాటలు పెట్టుకుని నడిరోడ్డుపై చిందులేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇపుడు వైరల్‌గా మారింది. ఓ ప్రజాప్రతినిధి రోడ్డుపై కారు ఆపి ఇలా డ్యాన్సులు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. -
కార్పొరేటర్‌పై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల్‌రెడ్డి తమ ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తమ ఇంట్లో మహిళల వీడియోలను తిరుమల్‌రెడ్డి చిత్రీకరించాడని ఫిర్యాదుదారుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో వనస్థలిపురం పోలీసులు.. 448, 504, 506 సెక్షన్ల కింద కార్పొరేటర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.