కార్తికేయ
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు. ఇటీవల ‘హిప్పి’ అనే సినిమాకు సైన్ చేసిన ఈ యువ హీరో ఇప్పుడు అరుణ్ జంధ్యాల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో హీరోగా నటించడానికి పచ్చజెండా ఊపారు. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో హీరో కార్తికేయ కనిపించనునట్లు చిత్రబృందం పేర్కొంది.
టీవీ రంగంలో మంచి పేరు సాధించుకున్న జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంస్థలు ఈ చిత్రంతో సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. అనిల్ కుమార్, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 27న ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర అరుణ్ జంధ్యాల దాదాపు పదేళ్లపాటు అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. దీన్నిబట్టి బోయపాటి మార్క్ యాక్షన్ ఈ సినిమాలో కూడా ఉంటుందని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment