![TRS Corporator Sama thirumal Reddy Dance On road - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/10/hyathnagar-corporator-dance.jpg.webp?itok=ST6YIvoA)
సాక్షి, హైదరాబాద్: ఆయన గ్రేటర్‌లో కార్పొరేటర్.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. పౌరుల సమస్యలపై విభిన్నంగా స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసించారు. అయితే సదరు కార్పొరేటర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లారు.
అక్కడ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ హైవేపై ఆగి అనుచరులతో కలిసి తీన్మార్ ఆడారు. ఇరువైపులా వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా.. కారులో పాటలు పెట్టుకుని నడిరోడ్డుపై చిందులేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇపుడు వైరల్‌గా మారింది. ఓ ప్రజాప్రతినిధి రోడ్డుపై కారు ఆపి ఇలా డ్యాన్సులు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment