Hayat nagar
-
హయత్‌నగర్‌లో విషాదం.. స్కూల్ గేటు విరిగిపడి బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. హయత్నగర్జిల్లా పరిషత్ హైస్కూల్లో సోమవారం సాయంత్రం పాఠశాల గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థిపై పడింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. బాలుడు స్థానిక ముదిరాజ్ కాలనీకి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. -
TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్ సీరియస్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ బస్సు డిపో పరిధిలో ఓ మహిళ టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ.. చేయిచేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది. ఈ ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా స్పందించారు. ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనపై సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో..‘హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు… pic.twitter.com/SAZ2gPxSGY — Telugu Scribe (@TeluguScribe) January 31, 2024 Video Credentials: Telugu Scribe మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024 అయితే, హయత్‌నగర్ డిపో-1 పరిధిలో మద్యం సేవించిన ఓ మహిళ మత్తులో దుర్భాషలాడింది. బస్సులో తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కండక్టర్‌పై దాడికి దిగింది. కాగా, మహిళా కండక్టర్‌ను తన్నిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రూ.500లకు చిల్లర లేకపోవడంతో దిగిపోవాలని కండక్టర్ సూచించినట్లు తెలిసింది. దీంతో, సదరు ప్రయాణికురాలు హల్చల్ చేసింది. -
హైదరాబాద్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, సరూర్ నగర్, ఘట్ కేసర్, ఫిర్జాదిగూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం నగరం అంతటా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఇప్పటికే చాలా చోట్ల భానుడు ఉగ్ర రూపం చూపిస్తుండగా.. కొన్ని చోట్ల మాత్రమే వరుణుడు ప్రభావం చూపించాడు. చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. మరికొన్ని చోట్ల కేవలం ఈదురు గాలులకే పరిమితం కావొచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది. Rain at LBNAGAR pic.twitter.com/A0f2sUhszS — M.shanthibhushan (@msbhushan1) May 10, 2023 #HyderabadRains : Clouds are moving towards Southern parts of #GHMC charminar area to Shamshabad area#Hyderabad #WeatherUpdate pic.twitter.com/IKC3a3LGQF — Anusha Puppala (@anusha_puppala) May 10, 2023 #Thunder Showers with lightening in southern parts of #GHMC Area, #LBnagar, #Uppal, #Charminar area. #HyderabadRains pic.twitter.com/xoMMwo8tTR — Iqbal Hussain⭐ اقبال حسین (@iqbalbroadcast) May 10, 2023 -
హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్లో 8వ తరగతి విద్యార్థిని అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్లో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించింది. అంతేగాక క్లాస్‌లో అల్లరి చేయడం గమనించిన టీచర్ అక్షయను తరగతి గది బయట మోకాళ్లపై నిల్చోబెట్టింది. దీంతో తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపం చెందిన విద్యార్థిని.. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మ హత్య చేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు విగతా జీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే టీచర్ మందలించడం వల్లే అక్షయ చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మరణానికి స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాప బంధువులు ఆగ్రహంతో స్కూల్‌పై రాళ్ల దాడి చేయడంతో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఆయన భార్య శంకరమ్మ శనివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కొంత కాలంగా హయత్‌నగర్ డివిజన్ సూర్యానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీకాంతాచారి తండ్రి వెంక టచారి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ నెల 1న పనిమీద బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వెంకటచారి తిరిగి రాలేదు. 2వ తేదీన సోషల్ మీడియా ద్వారా అతను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా ఎత్తలేదు. వెంకటచారి ఎంతకీ తిరిగి రాపోవడంతో ఆయన కేఏ పాల్ వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హైదరాబాద్: స్టేషన్ ఇక్కడ.. ఫైర్‌ఇంజిన్లు అక్కడ!
సాక్షి, హైదరాబాద్: అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తు సమయాల్లో ప్రజలను, వారి ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైర్స్టేషన్లు ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల సరైన సేవలు అందిచలేకపోతున్నాయి. ఫైర్స్టేషన్ను తమ పరిధికి దూరంగా తరలించడంతో ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. ► హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్ 20 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. సొంత భవనం లేకపోవడంతో స్థానిక మండల పరిషత్ ఆవరణలో కొంత కాలం కొనసాగింది. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ప్రభుత్వం స్థలం కేటాయించడంతో అక్కడ సొంత భవనం నిర్మించారు. భవనాన్ని లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో ప్రతి వర్షాకాలంలో ఫైర్ స్టేషన్ మునిగియి సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడేవారు. చదవండి: ఫోన్లో బుకింగ్.. ర్యాపిడోపై డెలివరీ.. మూడోసారి దొరికిన మురుగేశన్ 4 నెలల క్రితం భవన నిర్మాణం షురూ... అగ్నిమాపక సిబ్బంది పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో నాలుగు నెలల క్రితం కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఫైర్ స్టేషన్ కూల్చి వేయడంతో సిబ్బందిని వాహనాలను ఇక్కడికి సుమారు 12 కిలోమీర్ల దూరంలో ఉన్న ఉప్పల్ స్టేషన్ (ఇంకా ప్రారంభం కాలేదు)కు తరలించారు. ► అటు సరూర్‌నగర్ మండలం, ఇటు చౌటుప్పల్, సాగర్రోడ్డలో తుర్కయాంజాల్ వరకు హయత్‌నగర్ ఫైర్‌స్టేషన్ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాలలో జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఇక్కడి సిబ్బంది వెళ్లాల్సి వస్తోంది. ► ప్రస్తుతం హయత్‌నగర్ ఫైర్ స్టేషన్ ఇక్కడి నుంచి తరలించడంతో ఆయా ప్రాంతాలలో జరిగే ప్రమాదాల నివారణకు సరైన సమయంలో వెళ్లలేక పోతున్నారు. ► ఆటోనగర్‌లో ఇటీవల జరిగిన ప్రమాద స్థలానికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా వచ్చారనే ఆరోపణలు వినిపించాయి. స్టేషన్ పరిధికి సిబ్బంది దూరంగా ఉండటంతో ప్రమాదం జరిగిన తర్వాత బూడిదను ఆర్పడానికే సిబ్బంది వస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అవకాశం ఉన్నా ఉపయోగించలేదు... ఫైర్ సిబ్బంది, వాహనాలు నిలిపేందుకు హయత్‌నగర్‌లో పలు చోట్ల అవకాశం ఉన్నా అధికారులు వాటిని ఉపయోగించుకోలేదని స్థానికులు ఆరోపి స్తున్నారు. మండల పరిషత్ ఆవరణ, పోలీస్టేషన్, రేడియో స్టేషన్, ప్రభుత్వ పాఠశాల, మదర్ డెయిరీతో పాటు పలు ప్రైవేట్ స్థలాల్లో సిబ్బంది ఉండేందుకు అవకాశం ఉంది. ఈ అవకాశాలను కాదని దూరంగా ఉన్న ఉప్పల్ స్టేషన్‌కు తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ సహకరించలేదు ఫైర్ స్టేషన్ సిబ్బందికి, వాహనాలు నిలిపేందుకు అవసరమై వసతులు కల్పించాలని మండల పరిషత్ అధికారులతో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశాం. ఎవరూ సహకరించలేదు. దీంతో సిబ్బందిని ఉప్పల్ స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది. నెల రోజుల్లో ఇక్కడ భవన నిర్మాణం పూర్తవుతుంది. వెంటనే సిబ్బందిని ఇక్కడికి తరలిస్తాం. -శీనయ్య, ఫైర్ స్టేషన్ అధికారి, హయత్‌నగర్ -
రెండేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. కేకలు వేయడంతో..
సాక్షి హయత్‌నగర్: అభం శుభం ఎరుగని రెండేళ్ళ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గుల్షన్ సహాని (26) పెయింటింగ్ పనులు చేస్తూ హయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ఈ నెల 12న సమీపంలో నివసించే ఓ రెండేళ్ళ బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బస్సు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతి నాగోలు: ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైడ్డ్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్బీనగర్ చిత్రలేవుట్ కాలనీలో నివాసం ఉండే కజ్జం మల్లయ్య(76) రిటైర్డ్ ఉద్యోగి. బుధవారం సాయంత్రం శివగంగ కాలనీ నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వైపు పల్సర్ బైక్‌పై తిరిగి వస్తున్నాడు. సిరీస్ రోడ్డు ఎస్బీఐ ఏటీఎం వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. దీంతో మల్లయ్య తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి మల్లయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్బీనరగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అల్వాల్‌లో ప్రత్యక్షం.. ఉప్పల్‌లో అదృశ్యం -
ఆర్టీసీ ఆదాయానికి గండి.. 4 గంటల్లో విజయవాడకు’ అంటూ..
హయత్‌నగర్‌కు చెందిన రామకృష్ణ విజయవాడలో ఓ శుభకార్యానికి అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది. ఎల్బీనగర్లో బస్సులు నిలిపే చోటుకి వెళ్లాడు. ‘ఆర్టీసీ బస్సులో వెళ్తే 6 గంటలు పడుతుంది. కారులో 4 గంటలే.. రండి’ అని పిలుపు వినపడటంతో అటు చూశాడు. వరుసగా 10 వరకు కార్లు ఆగి ఉన్నాయి. వాటి డ్రైవర్లూ ఇలాగే అరుస్తున్నారు. వెంటనే వెళ్లి ఓ ఇన్నోవాలో కూర్చున్నాడు. తిరుగు ప్రయాణంలోనూ ఇన్నోవాలోనే వచ్చాడు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ మధ్య ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 700 కార్లు షటిల్ సర్వీసుల్లా తిరుగుతున్నాయి. ఆర్టీసీకి సమాంతరంగా మరో రవాణా వ్యవస్థనే నిర్వహిస్తున్నాయి. ‘తక్కువ సమయంలో గమ్యం’ పేరుతో ప్రయాణికులను లాగేసుకుంటున్నాయి. దీంతో పెద్దమొత్తంలో ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోతోంది. ప్రైవేటు ట్రావెల్స్ స్టేజీ క్యారియర్ల అవతారమెత్తటంతో సాలీనా రూ.2వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్టు ఆర్టీసీ గతంలోనే తేల్చింది. ఇప్పుడు ఆ బస్సులకు తోడు కార్లూ ఆర్టీసీకి ప్రమాదకరంగా మారాయి.నిత్యం దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ స్టేజీల వద్ద బస్సులు ఆగే బస్‌బేలలోనే నిలిపి దర్జాగా ప్రయాణికులను కార్లు తన్నుకుపోతున్నాయి. ట్రాఫిక్‌తో ప్రయాణ సమయం పెరిగి.. విజయవాడ హైవే విస్తరించాక ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గింది. కానీ కొంతకాలంగా కార్లు, ఈ రోడ్డు మీదుగా వెళ్లే ఇతర వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. రెండేళ్లలో ఈ వాహనాల సంఖ్య మరీ పెరిగి ఇప్పుడు బస్సు విజయవాడ చేరేందుకు 6 గంటలకుపైగా పడుతోంది. దీంతో జనం కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికులను కార్లు మళ్లించుకుపోతున్నా ఆర్టీసీ మాత్రం పట్టించుకోవట్లేదు. గత దసరా రోజు తాత్కాలికంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రవాణా శాఖ ఆధ్వర్యంలో 55 కేసులు నమోదు చేయించి చేతులు దులిపేసుకుంది. చదవండి: నుమాయిష్‌పై కోవిడ్ ఎఫెక్ట్.. ఈ ఏడాది పూర్తిగా రద్దు.. నిత్యం 214 సర్వీసులు తిరగాల్సి ఉన్నా.. విజయవాడ వైపు నిత్యం 214 తెలంగాణ సర్వీ సులు తిరగాలి. వీటిల్లో 115 నాన్ ఏసీ బస్సులు, మిగతావి రాజధాని, గరుడ, గరుడ ప్లస్ సర్వీసులుండాలి. కానీ 20 సర్వీసులకు డీజిల్ ఖర్చుకు సరిపడా డబ్బులు కూడా రావట్లేదు. ఇలాంటి వాటిని విజయవాడకు కాకుండా రాష్ట్రంలోనే అంతర్గతంగా తిప్పుతున్నారు. ప్రస్తుతం సగటున 160 సర్వీసులే రోజూ విజయవాడ తిరుగుతున్నాయి. వీటి సగటు ఆక్యుపెన్సీరేషియో 55% మాత్రమే. విజయవాడ–హైదరాబాద్ మధ్య ఏపీ బస్సులు 225 వరకు తిరుగుతున్నాయి. మరో 230 ప్రైవేటు బస్సులున్నాయి. వీటికి తోడు ఇప్పుడు వందల సంఖ్యలో కార్లు తిరుగుతుండటంతో నష్టాలు పెరుగుతున్నాయి. ట్యాక్సీ ప్లేట్ లేని కార్లు కూడా షటిల్ సర్వీసుల్లో ఉంటున్నాయి. కో ఆర్డినేట్ చేస్తూ.. కార్లు ఎక్కిస్తూ.. కార్లను కో ఆర్డినేట్ చేసేందుకు కొందరు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓ డ్రైవరు తనకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటే మరో కారుకు వారిని సమన్వయంతో పంపిస్తున్నారు. కారు డ్రైవరు తిరుగుప్రయాణానికి కూడా ప్రయాణికులకు విజయవాడ నుంచి మరో కారులో సీట్ బుక్ చేస్తున్నారు. ఇందుకు కమీషన్ తీసుకుంటున్నాడు. ఇంత పక్కాగా నడుస్తున్నా ఆర్టీసీ కళ్లు తెరవటం లేదు. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. వనమా రాఘవ అరెస్ట్ ఓలా, ఉబర్ల నుంచి వైదొలిగి.. ఇంతకుముందు హైదరాబాద్‌లో ఓలా, ఉబర్ లాంటి సంస్థల్లో దాదాపు 70 వేలకుపైగా కార్లు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య సగానికి పడిపోయింది. డీజిల్ భారంతో మిగులు అంతగా లేదని వాటి నుంచి వైదొలిగి డ్రైవర్లు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అలా కొందరు షటిల్ సర్వీసులపై దృష్టి సారించారు. ఒక్కో కారులో ఐదారుగురిని తరలిస్తున్నారు. విజయవాడకు ఒక్కొక్కరికి రూ.600 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. నిత్యం గిరాకీ ఉంటుండటంతో ఆదాయంపై కచ్చితమైన భరోసా ఉంటోంది. దీంతో ఒకరిని చూసి మరొకరు ఇటు మళ్లుతున్నారు. అలా దాదాపు 2 వేల క్యాబ్‌లు షటిల్ సర్వీసుల్లోకి వచ్చినట్టు అంచనా. -
ప్రేమ, పెళ్లి అంటూ మోసం: ఆటో డ్రైవర్‌పై బీటెక్ స్టూడెంట్ ఫిర్యాదు
హయత్‌నగర్: ప్రేమ, పెళ్లి అంటూ వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువకుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని (22) చంపాపేట్‌కు చెందిన రబ్లావత్ శంకర్(24) అనే ఆటో డ్రైవర్‌ను ప్రేమించింది. రెండేళ్ల పాటు తనను వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత యువతి బుధవారం సాయంత్రం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు యువకుడి ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. -
చెప్పులను పట్టుకోవాలని.. చెరువులోకి వెళ్లిన ఇద్దరు బాలురు
సాక్షి, హయత్‌నగర్/లింగోజిగూడ: జారిన చెప్పులను పట్టుకోవాలని ప్రయత్నించి చెరువులో మునిగి బాలుడు మృతి చెందగా చెట్టుకొమ్మను పట్టుకొని మరో బాలుడు తన ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ ఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టిఅన్నారం హనుమాన్‌నగర్ కాలనీలో నివాసం ఉండే రావుల వాసుదేవరెడ్డి కుమారుడు ధీరజ్‌రెడ్డి భార్య సింధుతో కలిసి గతంలో ఆస్ట్రేలియా వెళ్లారు. వీరికి కుమారుడు రావుల రిషిత్‌రాంరెడ్డి(8). ఆస్ట్రేలియాలో ఉండగానే సింధు మృతి చెందడంతో కుమారుడిని తీసుకొని మూడేళ్ల క్రితం ఇండియాకు తిరిగి వచ్చి తండ్రి వాసుదేవారెడ్డి వద్ద ఉంటున్నారు. అనంతరం ధీరజ్రెడ్డికి బెంగళూర్‌లో ఉద్యోగం రావడంతో తన కుమారుడిని తాత వద్దే వదిలేసి వెళ్లాడు. రిషిత్ ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న ఆయన వారం క్రితమే తిరిగి వెళ్లాడు. చదవండి: నేను ఇవ్వను.. ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు ! మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం రిషిత్ తన స్నేహితుడు మేఘనాథ్‌ను తీసుకొని సైకిల్‌పై బయటకు వెళ్లాడు. కాలనీకి ఆనుకొని తట్టిఅన్నారం ఊర చెరువు ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోకి నీరు వచ్చి చేరింది. రిషిత్ సైకిల్ తొక్కుతుండగా మేఘనాథ్ వెనుక కూర్చున్నాడు. చెరువు సమీపంలోకి రాగానే సైకిల్ అదుపు తప్పి నీటిలో పడ్డారు. రిషిత్ చెప్పులు ఊడిపోవడంతో వాటిని తీసుకునేందుకు ఇద్దరూ చెరువు లోపలికి వెళ్లారు. లోతు ఎక్కువ ఉండటంతో రిషిత్ నీటిలో మునిగిపోగా మేఘనాథ్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ఉండి పోయాడు. సాయంత్రం సమయంలో అక్కడి నుంచి అరుపులు వినిపిస్తుండటంతో స్థానికంగా ఉన్న దేవాలయానికి వచ్చిన వారు బాలుడిని గమనించి స్థానికులకు విషయం చెప్పారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ కృష్ణ, వి.మధు, రాణి తాడు సాయంతో మేఘనాథ్‌ను రక్షించారు. అక్కడే చెట్లలో ఇరుక్కుపోయిన రిషిత్‌ను కూడా బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు -
9 ఏళ్ల బాలిక కిడ్నాప్: సినిమా చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి..
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో సోమవారం కిడ్నాప్ అయిన 9 ఏళ్ల బాలిక ఆచూకీ లభించింది. కిడ్నాప్ అయిన 24 గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివారల్లోకి వెళితే.. తట్టి అన్నారం ఆర్కెపురానికి చెందిన ముస్కాన్ అనే బాలిక సోమవారం మధ్యాహ్నం అపహరణకు గురైంది. కూతురు కనిపించకపోవడంతో తండ్రి ముస్తాఫా హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముస్కాన్ అనే బాలికను ఓ షాపు నుంచి ఓ వ్యక్తి తీసుకొని వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా నిందితుడిని బాలిక పక్కింటి రాజుగా గుర్తించారు. బాలిక కోసం 30 మందితో కూడిన పది పోలీసు బృందాలు గాలించాయి. నిందితుడు హయత్‌నగర్‌లోని కాలనీలో మంగళవారం తిరుగుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సినిమా చూపిస్తానని చెప్పి బాలికను తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను అపహరించిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పేర్కొన్నారు. సినిమా చూపిస్తానని బాలిక కిడ్నాప్, -
కుక్కపిల్ల ప్రాణం ఖరీదు 250!
సాక్షి, హయత్‌నగర్: నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేస్తూ పెంపుడు కుక్కపిల్లను చంపేసి దాని యజమానిపై, వారి కుటుంబ సభ్యులపైనా దాడిచేశారు. ‘చచ్చింది కుక్కేకదా...మనిషి కాదుకదా’ అంటూ పెంపుడు జంతువులపైన తనకున్న చులకన భావన, ద్వేషాన్ని ఓ వ్యక్తి వెల్లగక్కితే.. ఆ కుక్కపిల్ల ప్రాణం ఖరీదు రూ.250కి పోలీసులు పరిమితం చేసిన సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి తెలిపిన వివరాలు ప్రకారం హయత్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు కుటుంబం లాక్డౌన్ సమయంలో ఓ ల్యాబ్‌జాతి కుక్కపిల్లను పెంచుకుంటున్నారు. శనివారం సాయంత్రం మలవిసర్జనకు ఆ కుక్కపిల్లను బెల్టుతో పట్టుకుని ఇంటి ముందుకు రోడ్డు పక్కకు తీసుకురాగా ఆ మార్గంలో మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంగా పి.వెంకటేశం కారు (టీఎస్08 ఈఎస్ 7000) నడుపుతూ కుక్కపిల్లను గుద్దేశాడు. కుక్కను పట్టుకున్న యువతికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం చేసి కారు ఆపకుండా వెళుతుంటే కాలనీకి చెందినవారు, కుక్క యజమాని అడ్డుకున్నారు. కారు ఆపారనే కోపంతో ఊగిపోతూ ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’ అంటూ గొడవకు దిగాడు. కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లమన్నందుకు కుక్కపిల్ల యజమానిపై దాడి చేశారు. (వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..!) సంఘటనా స్థలంలో ఉన్న అదే కారులో కుక్క యజమాని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కారును గుంజుకు పోతావా అంటూ కుక్కపిల్ల యజమాని ఇంటిపై సుమారు 50మందిని నిందితుడు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, యజమాని కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినకట్లు తిడుతూ ఇంటిపైకి దాడి చేశారు. యజమాని కొడుకును, అతని కుటుంబ సభ్యులను చంపుతామంటూ మొబైల్ వ్యాన్ పోలీసుల సమక్షంలోనే వీరంగం చేశారు. దాడిచేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని, పెంపుడు జంతువులపై ద్వేషంతో కుక్కపిల్లను చంపిన వ్యక్తిని యానిమల్ యాక్ట్ ప్రకారం శిక్షంచాలని కుక్కపిల్ల యజమాని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొడవ చేస్తూ ఇంటిపై దొమ్మీ చేస్తుండగా ప్రత్యక్షంగా చూసిన పోలీసులు చట్ట పరిధిలోకి వచ్చే ఏ అంశాలను పట్టించుకోకుండా, సంఘటన జరిగిన సమయంలో కేసును పంచనామ చేయకుండానే ఐపీసీ సెక్షన్ 336 నమోదు చేసి నిందితులను కారుతో సహా పోలీసులు వదిలి వేశారు. (వైరల్: ఆనందం పట్టలేక ఏడ్చేశాడు) పోలీసులు నమోదు చేసిన సెక్షన్ ప్రకారం నిందితులకు మూడు నెలల జైలు లేదా 250 శిక్ష మాత్రమే. అంటే ఓ కుక్కపిల్లకు పోలీసులు రూ.250 ఖరీదు కట్టారు. అల్లారు ముద్దుగా కుక్కపిల్లను పెంచుకుంటున్న ఆ కుటుంబం నిద్రాహారం లేకుండా ఏడుస్తున్నా చలించలేదు. నిందితుల నుంచి పొంచివున్న ప్రాణభయంతో ఆ కుటుం సభ్యులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మూగజీవిపై ద్వేషంతో కుక్కపిల్లను చంపిన వ్యక్తిపై యానిమల్ యాక్టు నమోదుచేయాలని, దాడిచేసిన వారిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. -
డీమార్ట్‌లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు
-
డీమార్ట్‌లో విద్యార్థి మృతి.. కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్ : హయత్ నగర్ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సతీష్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వనస్థలిపురం డిమార్ట్ వద్ద ఆదివారం రాత్రి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. డిమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది కొట్టడం వల్లే తమ కూమారుడు మృతి చెందాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, డిమార్ట్ సెక్యూరిటీ సతీష్‌ను కొట్టలేదని, చాక్లెట్ దొంగిలించాడనే భయంతో అతను కిందపడిపోయి మృతి చెందాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. (చదవండి : చాక్లెట్ నేరం; విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి) ‘షాపింగ్ చేస్తుండగా సతీష్ చాక్లెట్‌ను జేబులో వేసుకున్నాడు. సెక్యూరిటీ గార్డ్ తనిఖీలు చేస్తున్న సమయంలో సతీష్ దానిని కిందపడేశాడు. అయినప్పటికీ ఇంకో మహిళా సెక్యూరిటీ చాక్లెట్‌ను తీసుకొని సతీష్‌ను పట్టుకున్నారు. దీంతో సతీష్ సొమ్మసిల్లి సెక్యూరిటీ గార్డ్ మీద పడిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ ఇదంతా యాక్టింగ్ అని, ఇలాంటి వాళ్లను చాలామందిని చూశానని అన్నారు. అప్పటికే మేమంతా సతీష్ దగ్గరకు వచ్చి కాళ్లు, చేతులు రఫ్ చేశాం. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే సతీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డీ మార్ట్ సెక్యూరిటీ సతీష్‌ను కొట్టలేదు. చాక్లెట్ దొంగిలించినందుకు సతీష్ భయంతో పడిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే ప్రిన్సిపల్‌కు తెలియాజేశాం’ అని సతీష్ తోటి విద్యార్థులు పేర్కొన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించం : ఎల్బీనగర్ డీసీపీ సతీష్ మరణం దురదృష్టకరమని ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఘటనపై సతీష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. డీమార్ట్ సెక్యూరిటీ గార్డ్ ఘర్షణకు దిగి దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్ తండ్రి ఆరోపిస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీమార్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను, సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను కలెక్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తప్పు చేశారని తేలితే ఉపేక్షించేది లేదని డీసీపీ పేర్కొన్నారు. డీమార్ట్ సిబ్బంది దాడి వల్లే మృతి డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని సతీష్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ సతీష్ బంధువులు డీమార్ట్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగానే సతీష్ మృతి చెందారని, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఔటింగ్ పంపించే సమయంతో కాలేజీ యాజమాన్యం తమ అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. అనుమతి తీసుకున్నాం కాలేజీ నుంచి విద్యార్థులను ఔటింగ్ పంపడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకుంటామని హయత్ నగర్ శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపల్ పేర్కొన్నారు. సతీష్‌ని బయటకు పంపేముందు తల్లిదండ్రులకు ఫోన్ చేశామని, వారు లిఫ్ట్ చేయలేదన్నారు. దీంతో సతీష్ నాయక్ బావ అనుమతి తీసుకొని ఔటింగ్‌కు పంపించామని చెప్పారు. గంట పాటు ఔటింగ్‌కు అనుమతి కోరుతూ సతీష్ లెటర్ కూడా ఇచ్చారని తెలిపారు. సతీష్ మృతి పట్ల కళాశాల యాజమాన్యం తప్పులేదన్నారు. సతీష్ చనిపోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చాక్లెట్ చోరీ.. విద్యార్థిపై డీమార్ట్ సిబ్బంది దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎల్. సతీష్(17) వనస్థలిపురంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వనస్థలిపురంలోని డీమార్ట్‌లో షాపింగ్ చేయడానికి ఆదివారం తన స్నేహితులతో వెళ్లిన సతీష్‌కు సెక్యూరిటీతో గొడవ ఏర్పడింది. డీమార్టులో చాక్లెట్ దొంగిలించాడని విద్యార్థిపై సిబ్బంది దాడికి దిగారు. కాసేపటికి సతీష్ మృత్యువాత పడ్డాడు. దీంతో సెక్యూరిటీ వారు దాడి చేయడం వల్లే తన కొడుకు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సతీష్ ఇంటర్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్‌ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
మీడియా ముందుకు శశికుమార్, కీర్తి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీర్తి తల్లి రజిత హత్య కేసులో నిందితులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో హయత్‌నగర్‌కు చెందిన పల్లెర్ల కీర్తి ప్రియుడితో కలిసి కన్నతల్లినే హతమార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కీర్తి, ఆమె ప్రియుడు శశికుమార్‌ను హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పలు కోణాల్లో విచారణ జరిపిన అనంతరం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సీపీ నిందితులను మీడియా ముందుకు తీసుకురానున్నారు.(చదవండి : కీర్తికి మద్యం తాగించి.. రజిత గొంతు నులిమిన శశి) కాగా తల్లిని దారుణంగా హతమార్చి ఆ నేరాన్ని తండ్రిపై నెట్టివేయాలని చూసిన కీర్తి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు యువకులతో ప్రేమలో మునిగిన కీర్తిని తల్లి మందలించడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. మొదట శశికుమార్‌తో ప్రేమలో పడిన కీర్తి.. తర్వాత బాల్రెడ్డికి దగ్గర కావడంతో వారిద్దరికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శశికుమార్ కీర్తితో తాను సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. దీంతో కీర్తి మళ్లీ శశికుమార్‌కు దగ్గరైంది. ఈ నేపథ్యంలో ఈనెల 19న కూరగాయల మార్కెట్ నుంచి కీర్తి తల్లి రజిత ఇంటికి వచ్చిన సమయంలో అక్కడికి చేరకున్న శశికుమార్.. కీర్తికి మద్యం తాగించి తల్లిని హత్య చేసేలా ప్రేరేపించాడు. ఈ క్రమంలో కీర్తి తల్లి ముఖంపై దిండుతో అదిమి పట్టగా.. శశికుమార్ ఆమెకు చున్నీతో ఉరి బిగించి హత్య చేశాడు. ఈ కేసులో కీర్తి మరో ప్రియుడు బాల్‌రెడ్డి హస్తం కూడా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
కీర్తికి మద్యం తాగించి.. రజిత గొంతు నులిమిన శశి
సాక్షి, హైదరాబాద్ : తల్లిని పాశవికంగా హత్య చేసిన కీర్తి ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీర్తితో పాటు ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తన తల్లి రజితను తామిద్దరం కలిసి హతమార్చినట్లు నేరం అంగీకరించిన కీర్తి.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. వివరాలు.. ఈ నెల 19న కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లిన సమయంలో శశి వాళ్లింటికి వచ్చాడు. ఆమె తిరిగి వచ్చేసరికి శశితో కీర్తి కలిసి ఉండటం గమనించిన రజిత వాళ్లిద్దరినీ మందలించింది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన శశి రజిత అడ్డు తొలగించుకుంటేనే తామిద్దరం కలిసి ఉండవచ్చని కీర్తికి చెప్పాడు.( చదవండి : వీడియోలున్నాయ్..చంపేస్తావా లేదా?!) అనంతరం బీర్ బాటిల్స్‌తో కీర్తి ఇంటికి వచ్చాడు. కీర్తి తల్లి రజిత లోపల గదిలో ఉండగా ఇంటి ఆవరణలోనే కీర్తికి శశి మద్యం తాగించి రజితను హత్య చేసేలా ప్రేరేపించాడు. తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగా.. శశి లోపలి నుంచి తలుపు గడియ వేశాడు. పథకం ప్రకారం తల్లి అరవకుండా కీర్తి ఆమె ముఖంపై దిండుతో నొక్కగా.. శశి చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఉరివేసుకున్నట్లుగా అందరినీ నమ్మించారు. అనంతరం మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే పెట్టుకుని గడిపారు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేట్ వద్ద పడేసి ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన విషయాలు పోలీసులు వెల్లడించారు. కీర్తి ఇంట్లో నుంచి మూడు బీర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హత్యలో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు. సొంత కూతురే తల్లిని చంపేలా ఆమె ప్రియుడే చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కీర్తి, శశికుమార్‌ను విచారిస్తుండగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసు ఛేదనలో సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియోలు, వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా కీలకంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కీర్తి నాన్న శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్ కావడంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఒకవేళ ఇంటికొచ్చినా తరచూ మద్యం తాగి భార్య రజితతో గొడవపడేవాడు. ఈ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె కీర్తి అందంగా ఉండడం, ఆమెను ప్రేమలోకి దింపాలని బీటెక్ చదివి జులాయిగా తిరుగుతున్న పొరుగింటి వ్యక్తి శశికుమార్ పథకం పన్నాడు. ఇదే సమయంలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన కీర్తి శశికుమార్‌ను నమ్మింది. ‘మా నాన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఏఈ పర్వతాలు. ఆస్తి బాగానే ఉంది’ అని కీర్తి ముందు శశి బిల్డప్ ఇవ్వడంతో మరింతగా నమ్మేసింది. చివరకు ఆమెను ముగ్గులోకి దించి సన్నిహితంగా ఉన్న సమయంలో కీర్తికి తెలియకుండా వీడియోలు తీశాడు. గర్భం దాల్చిన కీర్తిని మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి శశికుమార్‌నే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శశికుమార్ ఇంట్లో చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వాళ్లు ‘నీ ఇష్టమున్నట్టు చేస్కో’ అని వదిలేశారు. ఇక కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లి రజితకు చెప్పాడు శశికుమార్. అందుకు రజిత నిరాకరించింది. అమ్మాయి చదువుకునేది చాలా ఉందని చెప్పింది. ఇది మనసులో పెట్టుకున్న శశికుమార్ కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో కీర్తికి గతంలో తాము అద్దెకు ఉన్న పక్క కాలనీలో ఉండే బాల్‌రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. బాల్‌రెడ్డి గురించి తెలిసిన కీర్తి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నా రు. ఈ విషయం తెలిసి శశికుమార్.. కీర్తి వెంటపడ్డాడు. ‘నువ్వు నాతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. అందరికీ చూపిస్తాన’ని బెదిరించాడు. చదవండి: కీర్తి ఇలా దొరికిపోయింది.. తనతోనే ఉండాలని వెంటపడినా మొదట్లో నిరాకరించింది. ఆ తర్వాత శశికుమార్ వేధింపులు తారస్థాయికి చేరాయి. కీర్తి పెళ్లి చేసుకునే బాల్రెడ్డికి కూడా చూపిస్తానంటూ బెదిరించాడు. ఓవైపు అమ్మతో చెబుదామంటే భయం, మరోవైపు తండ్రి పట్టించు కోకపోవడంతో శశికుమార్ ఎలా చెబితే అలా చేయడం మొదలెట్టింది కీర్తి. ఇందులో భాగంగానే శశికుమార్ మొదట వీరి ప్రేమకు అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను అంతమొందించాలని నిర్ణయించాడు. కీర్తి సమక్షంలోనే ఆమె చేతుల మీదుగానే రజితను ఈ నెల 19న చున్నీతో ఉరివేసి హత్య చేయించాడు. ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లోనే శవాన్ని ఉంచి కీర్తితో గడిపాడు. దుర్వాసన రావడంతో శవాన్ని కారులో తీసుకెళ్లి రైల్వే పట్టాలపై పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శశికుమార్ చెప్పినట్టుగా నటించిన కీర్తి చివరకు తండ్రితోనే అబద్ధం చెప్పి పోలీసులకు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు ఇచ్చింది. అయితే కూతురు ప్రవర్తన అనుమానంగా ఉందని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. కీర్తి ధైర్యం చేసి అమ్మ రజితకు చెప్పినా, నాన్న శ్రీనివాస్‌రెడ్డికి చెప్పినా, చివరకు షీటీమ్స్‌ను ఆశ్రయించినా పరిస్థితి హత్య వరకు వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం ఏసీబీ చేతికి చిక్కిన మహబూబ్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ పర్వతం మూడో భార్య మూడో కుమారుడు శశికుమార్ అని తెలిసింది. కీర్తికి అబార్షన్ చేయించేందుకు మహబూబ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అతడి తండ్రి ఏమైనా సహకరించాడా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించని పోలీసులు బుధవారం నిందితుల అరెస్టు చూపే అవకాశం ఉంది. చదవండి: తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే.. -
చంటితో కలిసి తల్లికి ఉరేసిన కీర్తి.. ఆపై
సాక్షి, రంగారెడ్డి : కన్నతల్లిని అమానుషంగా హత్య చేసిన కీర్తి గురించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చి... ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు తండ్రిపైనే ఫిర్యాదు చేసిన కీర్తి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రేమ వ్యవహారంలో తనను మందలించిందనే కోపంతో పల్లెర్ల కీర్తి తన తల్లి రజితను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నిందితురాలి తండ్రి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ... డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన కూతురు, భార్య కనిపించకపోవడంతో కీర్తికి ఫోన్ చేసినట్లు తెలిపారు. ‘కీర్తిని ఎక్కడున్నావు అని అడిగాను. తను వైజాగ్ వెళ్లానని చెప్పింది. మరి అమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే తనకు తెలియదంది. అయితే తను చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవడంతో నాకు అనుమానం వచ్చింది. వైజాగ్ ఎవరితో వెళ్లావు అని నిలదీశాను. తను తడబడింది. దీంతో నాకు అనుమానం వచ్చింది. అంతేకాదు నేను తాగి వచ్చి రజితను తిట్టడంతో తను ఎక్కడికో వెళ్లిందని చెప్పింది. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది’ అని శ్రీనివాసరెడ్డి వాపోయారు.(చదవండి : కన్నతల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే) ఉరేసుకుందని చెప్పింది.. ఈ విషయం గురించి కీర్తి బాబాయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... వైజాగ్ వెళ్ళిన విషయంపై గట్టిగా నిలదీయడంతో ఒకసారి కాలేజ్ నుంచి.. మరొకసారి స్నేహితులతో వెళ్లానని చెప్పిందన్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలని అడిగితే అప్పటికప్పుడు డిలీట్ చేసిందని పేర్కొన్నారు. రజిత చనిపోయిందని గుర్తించామని తెలిపారు. బంధువులు అందరం కలిసి కీర్తిని నిలదీయడంతో.. ‘అమ్మ ఉరేసుకుంది’ అని తొలుత తమతో చెప్పిందన్నారు. అనంతరం గట్టిగా నిలదీయడంతో.. చంటి అనే వాడు కాళ్లు పట్టుకుంటే... తానే తల్లికి ఉరివేశాననే విషయం బయటపెట్టిందన్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనే విచారణ చేపట్టారు. -
ఇద్దరితో ‘ప్రేమ’: కన్నతల్లిని హత్య చేసి ఆపై..
-
తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే..
సాక్షి, రంగారెడ్డి : చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లి పట్ల ఓ కూతురు కర్కశంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే మచ్చ తెచ్చింది. ఈ ఘటన హయత్‌నగర్‌లోని మునుగనూరులో చోటుచేసుకుంది. వివరాలు... రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి బతుకు దెరువు నిమిత్తం భార్య రజిత (38), కూతురు కీర్తితో కలిసి నగరానికి వలసవచ్చాడు. ప్రస్తుతం వీరు మునగనూరులో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి లారీ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా రజిత ఇంటివద్దే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ క్రమంలో తమ కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా రజిత గుర్తించింది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూతురిని మందలించింది. దీంతో తల్లిపై ద్వేషం పెంచుకున్న కీర్తి.. తండ్రి డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెను కడతేర్చాలని భావించింది. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి పథకం రచించి తల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని అతడితో పాటు అక్కడే మూడురోజుల పాటు గడిపింది. అయితే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎవరికైనా అనుమానం వస్తుందోమోనని భయపడి... ప్రియుడు శశి సహాయంతో తల్లి మృతదేహాన్ని రామన్నపేట సమీపంలోని రైలు పట్టాల మీద పడేసింది. అనంతరం తాను వైజాగ్ టూర్‌కు వెళ్తున్నానని తండ్రికి చెప్పి... ఇంటి వెనుకాలే ఉండే తన మరో ప్రియుడితో కీర్తి గడిపింది. అంతేకాకుండా తన తల్లి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన తండ్రి తాగి రావడంతో కొన్నిరోజులుగా అమ్మానాన్నల మధ్య గొడవ జరుగుతోందని... ఈ నేపథ్యంలో విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరింది. కాగా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరెడ్డి.. రజిత గురించి కీర్తిని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణలో భాగంగా తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు కీర్తి అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
హయత్‌నగర్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ!
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ జరిగి 7 రోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కిడ్నాపర్‌ను పట్టించిన వారికి రూ. 1లక్ష నజరానా ప్రకటించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి కిడ్నాపార్ల కోసం తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో గాలింపు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అనుమానం వచ్చిన ప్రతి క్లూని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో కిడ్పాపర్ల ఆచూకీపై పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. నిన్న నల్లమల్ల అడవుల్లో ఆచూకీ ఉన్నట్లు పోలీసులు అనుమానం. ఇవ్వాళ కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 23న సోనీని కార్లో కిడ్నాప్ చేసిన రవి శేఖర్ మోస్ట్ వాంటెడ్ కిడ్నాపర్ కావడంతో హయత్ నగర్ కిడ్నాప్ కేసు పోలీసులకు సవాలుగా మారింది. కిడ్నాప్ జరిగిన రోజు, తరువాత రోజు మొత్తం 7 ఫుటేజ్లలో క్లూస్ క్లియర్‌గా లభ్యమయ్యాయి. ఘటన జరిగి వారం కావస్తున్నా, నిందితుడి వాహనం పైనే ఆధారపడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతకూ ఆచూకీ లభ్యంకాకపోవడంతో, పోలీసుల విచారణ తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పోలీసులు ఏమి చెప్పకపోవడంతో సోనీ తలిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
నా కొడుకును చంపేయండి: చిట్టెమ్మ
సాక్షి, విజయవాడ: హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన కిడ్నాప్ కేసులో తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మరోవైపు నిందితుడు రవిశంకర్‌పై అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును చంపేసినా బాధపడమని తల్లి చిట్టెమ్మ తెలిపింది. ‘ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్పు. తప్పు ఎవరు చేసినా అది తప్పే. నా కొడుకును కఠినంగా శిక్షించండి. అటువంటి నీచుడిని కన్నందుకు బాధగా ఉంది. అతడిని చంపేసినా బాధపడను. వాడెప్పుడో చనిపోయాడు. గతంలో నా కొడుకును మారమని చాలాసార్లు చెప్పాను. కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. అయినా పద్ధతి మార్చుకోలేదు. నా కొడుకు తీరుతో మా కుటుంబం తీవ్ర అవమానాలు పడుతున్నాం. ఈ కేసులో అమాయకుడైన నా మనవడు రాజును (రవిశంకర్ కొడుకు) పోలీసులు తీసుకెళ్లారు. నా మనవడు నాకు కావాలి. వాడంటే నాకు ప్రాణం.’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రవిశంకర్ సోదరుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు చాలా దుర్మార్గుడు. వాడిని చంపేసినా మేం బాధపడం. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నా మేము పట్టించుకోం. ఒకవేళ అతడిని చంపేసినా శవాన్ని తీసుకు వెళ్లడానికి కూడా మేం రాము. అలాంటోడిని బతకనిస్తే సమాజానికే ప్రమాదం. ఏం పాపం తెలియని అతడిని కొడుకుని వేధింపులకు గురి చేయడం సరికాదు’ అని అన్నాడు. చదవండి: యువతి కిడ్నాప్; సీసీటీవీ ఫుటేజ్ లభ్యం..! ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశంకర్ జల్సాలకు అలవాటుపడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. అటెన్షన్ డైవర్ట్ చేసి పనికాచ్చేయటంలో దిట్టగా పేరొందాడు. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పట్టుబడి, జైలు జీవితం సైతం అనుభవించాడు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ వృత్తిలోకి దిగేవాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలు చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఓ కేసులో అరెస్టయిన రవిశంకర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి పారిపోయాడు. అప్పటి నుంచి ఏపీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. చదవండి: ఎవరు?..ఎందుకు? ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షం కావటం స్టూడెంట్ సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటంతో మరోసారి తెరపైకి వచ్చాడు. ఇక ఏపీ పోలీసుల సహకారం తీసుకుని రవిశంకర్ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అయితే ఇప్పటివరకు కేవలం దొంగతనాలు మాత్రమే చేసిన రవిశంకర్ ఇప్పుడు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు.?పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా గ్యాంగ్‌తో చేతులు కలిపాడా? కిడ్నీ రాకెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? దుబాయికి అమ్మాయిలని అమ్మే ముఠాలో సభ్యుడయ్యాడా..? ఇందుకోసమే తండ్రిని ట్రాప్ చేసి కూతురు సోనిని కిడ్నాప్ చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. -
యువతి కిడ్నాప్; కీలక ఆధారాలు లభ్యం..!
సాక్షి హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న సోని(21) కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశంకర్‌గా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. 45 పైగా కేసుల్లో రవిశంకర్ నిందితుడిగా ఉన్నట్టు సమాచారం. కిడ్నాప్‌నకు వాడిన కారును బళ్లారిలో నెల రోజుల క్రితం చోరీ చేసినట్లుగా తెలిసింది. కంకిపాడు, తల్లాడ, విజయవాడ, బళ్లారిలో అతనిపై కేసులున్నాయి. రవిశంకర్‌కు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలతో లింకులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం (23వ తేదీ) రాత్రి 8:50 గంటలకు పెద్ద అంబర్‌పేట టోల్గేట్ మీదుగా కిడ్నాపర్ కారు తీసుకెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా శ్రీశైలం వైపుగా ఆ కారు వెళ్లింది. కర్నూలు జిల్లాలో నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ కేసును ఛేదించేందుకు డీసీపి సన్‌ప్రీత్‌సింగ్ పర్యవేక్షణలో ఐదు బృందాలు పనిచేస్తున్నాయని ఏసీపీ గాంధీ నారాయణ తెలిపారు. కూతురురికి ఉద్యోగం ఇస్పిస్తానని నమ్మబలికిన ఓ దుండగుడు ఎలిమినేటి యాదగిరి కూతురు సోనిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. బొంగ్లూర్ గేటు వద్ద యాదగిరి టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. (ఎవరు?..ఎందుకు?) మాయమాటలు చెప్పి.. మోసం : సోని తండ్రి నిందితుడికి సుమారు 35–40 ఏళ్ల్ల వయస్సు ఉంటుంది. శ్రీధర్ రెడ్డిగా పరిచయం చేస్తుకున్నాడు. తను ఉస్మానియాలో డాక్టర్‌ను అని, అతని తల్లిదండ్రులు హైకోర్టులో జడ్జిలని చెప్పాడు. తన సోదరుడు పోలీసు కమిషనర్ అని నమ్మబలికాడు. నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో నిందితుని మాటలు నమ్మాను. ఉదయం 7:30 గంటలకు మా టీ స్టాల్ వద్దకు వచ్చి మచ్చిక చేసుకున్నాడు. అతనితో పాటు ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళి కారును వాషింగ్ కూడా చేయించాను. పోలీసులు నా కూతురిని క్షేమంగా తీసుకురావాలను వేడుకుంటున్నా. తండ్రి అనుమానాలు.. సోని కిడ్నాప్ వ్యవహారంలో ఆమె తండ్రి యాదగిరిపై మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల కోసం యాదగిరి సోనిని అమ్మేశాడని, . పక్కా ప్లాన్‌తోనే జూలై 1న మాల్ మల్లేపల్లి నుంచి యాదగిరి బొంగుళూరుకు నివాసం మార్చినట్టు సందేహాలు వ్యక్తమతున్నాయి. కిడ్నాపర్ రవిశంకర్‌తో కలిసే యాదగిరి ఈ ప్లాన్ వేసినట్టు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ మత్తు బిస్కెట్ ఇచ్చాడనని యాదగిరి చెప్పడం అబద్దంగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు ఉండటంతో పోషణ భారమై యాదగిరి ఈ పథకం వేశాడమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
సాయికుటీర్‌లో దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయికుటీర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. పద్మావతి ఫంక్షన్ హాల్ యజమాని సుజన్ రెడ్డి, ఆయన భార్య హారిక రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య కారణాల వల్లే దంపతులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.