
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. హయత్‌నగర్‌జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోమవారం సాయంత్రం పాఠశాల గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థిపై పడింది. ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. బాలుడు స్థానిక ముదిరాజ్ కాలనీకి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.