హయత్‌నగర్ : రాజీవ్ విద్యామిషన్ బిల్లులు చెల్లించాలని ఒక వ్యక్తి డీఈవో ఆఫీస్ ఎదుట గురువారం ఆందోళన చేపట్టాడు. మండల కేంద్రంలోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముంటున్న జి.గిరిష్ రాజీవ్ విద్యామిషన్‌లో విద్యార్థులకు యూనిఫామ్‌లు కుట్టాడు. అయితే అతనికి గత కొద్ది సంవత్సరాలుగా ప్రభత్వం నుంచి డబ్బులు మంజూరు కాలేదు.
ఈ క్రమంలో కలెక్టరు, డీఈవోలను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం అధికారులను సంప్రదించి బిల్లులు ముంజూరు చేయాలని కోరాడు. అయితే అధికారులు మేం ఎప్పుడో బిల్లులు చెల్లించామని, ఇప్పుడు ఏమి చేయలేమని చేతులెత్తేశారు. గిరిష్ తనకు రావాల్సిన రూ.10 లక్షల బిల్లులను చూపించిన అధికారులు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన గిరిష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు సిద్ధమయ్యాడు.