TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్‌ సీరియస్‌ కామెంట్స్‌ | TSRTC MD Sajjanar Warning To RTC Passengers Over Woman Fighte With Conductor, Video Goes Viral - Sakshi
Sakshi News home page

TSRTC: కండక్టర్‌పై మహిళ దాడి.. సజ్జనార్‌ సీరియస్‌ కామెంట్స్‌

Published Wed, Jan 31 2024 10:05 AM | Last Updated on Wed, Jan 31 2024 10:50 AM

TSRTC MD Sajjanar Warning To RTC Passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హయత్ నగర్ బస్సు డిపో పరిధిలో ఓ మహిళ టీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు కండక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ.. చేయిచేసుకోవడంతో పాటు కాలుతో సైతం తన్నింది. ఈ ఘటనపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా స్పందించారు. ప్రయాణికులకు వార్నింగ్‌ ఇచ్చింది. 

ఈ ఘటనపై సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో..‘హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Video Credentials: Telugu Scribe

మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్‌ విన్నవించినా ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

అయితే, హయత్‌నగర్ డిపో-1 పరిధిలో మద్యం సేవించిన ఓ మహిళ మత్తులో దుర్భాషలాడింది. బస్సులో తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ కండక్టర్‌పై దాడికి దిగింది. కాగా, మహిళా కండక్టర్‌ను తన్నిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రూ.500లకు చిల్లర లేకపోవడంతో దిగిపోవాలని కండక్టర్ సూచించినట్లు తెలిసింది. దీంతో, సదరు ప్రయాణికురాలు హల్‌చల్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement