రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు
Published Thu, Aug 25 2016 2:18 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
హైదరాబాద్: హయత్‌నగర్ మండలం బాటసింగారం మౌంట్ ఓపెరా వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement