హైదరాబాద్: హయాత్‌నగర్‌లోని ఇనామ్‌గూడ వద్ద గురువారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.