Hyderabad Weather Updates: Heavy Rain With Gusty Winds In Hyderabad, Videos Viral - Sakshi
Sakshi News home page

Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షం

Published Wed, May 10 2023 4:01 PM | Last Updated on Wed, May 10 2023 4:51 PM

Heavy rain with gusty winds in Hyderabad Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో బుధవారం పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్‌,  దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌ నగర్‌, ఘట్‌ కేసర్‌, ఫిర్జాదిగూడ, హయత్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం నగరం అంతటా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

నగరంలో ఇప్పటికే చాలా చోట్ల భానుడు ఉగ్ర రూపం చూపిస్తుండగా.. కొన్ని చోట్ల మాత్రమే వరుణుడు ప్రభావం చూపించాడు. చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. మరికొన్ని చోట్ల కేవలం ఈదురు గాలులకే పరిమితం కావొచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement