
కిడ్నాపైన ఉదయకిరణ్ దారుణహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బాటసింగారంలో ఓ దారుణం చోటుచేసుకుంది. 7వ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. కిడ్నిప్ చేసిన దుండగులు విద్యార్థిని గొంతు నులుమి హత్య చేశారు. బుధవారం నుంచి కనిపించకుండా పోయిన ఉదయ్ వనస్థలిపురం చింతలకుంట చెరువులో శవమై తేలాడు.
రంగంలోకి దిగిన సరూర్ నగర్ పోలీసులు మాజీ హోంగార్డుతోపాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ తగదాలే కారణమని పోలీసులు తెలిపారు. విద్యార్థి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు స్నేహితులను, బంధవులను ఆరా తీశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.