సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ జరిగి 7 రోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కిడ్నాపర్‌ను పట్టించిన వారికి రూ. 1లక్ష నజరానా ప్రకటించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి కిడ్నాపార్ల కోసం తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో గాలింపు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అనుమానం వచ్చిన ప్రతి క్లూని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో కిడ్పాపర్ల ఆచూకీపై పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. నిన్న నల్లమల్ల అడవుల్లో ఆచూకీ ఉన్నట్లు పోలీసులు అనుమానం. ఇవ్వాళ కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 23న సోనీని కార్లో కిడ్నాప్ చేసిన రవి శేఖర్ మోస్ట్ వాంటెడ్ కిడ్నాపర్ కావడంతో హయత్ నగర్ కిడ్నాప్ కేసు పోలీసులకు సవాలుగా మారింది.
కిడ్నాప్ జరిగిన రోజు, తరువాత రోజు మొత్తం 7 ఫుటేజ్లలో క్లూస్ క్లియర్గా లభ్యమయ్యాయి. ఘటన జరిగి వారం కావస్తున్నా, నిందితుడి వాహనం పైనే ఆధారపడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంతకూ ఆచూకీ లభ్యంకాకపోవడంతో, పోలీసుల విచారణ తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పోలీసులు ఏమి చెప్పకపోవడంతో సోనీ తలిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment