హైదరాబాద్ హయత్ నగర్లో బాలికల వసతి గృహంలో దారుణం జరిగింది. అర్థరాత్రి వసతి గృహంలోకి ప్రవేశించిన దుండగుడు ....బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కత్తితో బెదిరించి బాలికలను దుస్తులు విప్పాల్సిందిగా బెదిరించినట్లు సమాచారం. ఆ సమయంలో హాస్టల్లో వార్డెన్ కూడా లేకపోవటంతో విద్యార్థినులు భయంతో వణికిపోయారు. తమకు రక్షణ కల్పించాలంటూ బోరున విలపించారు. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.