ప్రేమ, పెళ్లి అంటూ మోసం: ఆటో డ్రైవర్‌పై బీటెక్‌ స్టూడెంట్‌ ఫిర్యాదు | Hayat Nagar Btech Student Complaints On Auto Driver On Love Cheating | Sakshi
Sakshi News home page

ప్రేమ, పెళ్లి అంటూ మోసం: ఆటో డ్రైవర్‌పై బీటెక్‌ స్టూడెంట్‌ ఫిర్యాదు

Published Fri, Nov 19 2021 8:02 AM | Last Updated on Fri, Nov 19 2021 8:02 AM

Hayat Nagar Btech Student Complaints On Auto Driver On Love Cheating - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హయత్‌నగర్‌: ప్రేమ, పెళ్లి అంటూ వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువకుడిపై బాధితురాలు  ఫిర్యాదు చేసింది.  హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని (22) చంపాపేట్‌కు చెందిన రబ్లావత్‌ శంకర్‌(24) అనే ఆటో డ్రైవర్‌ను ప్రేమించింది. రెండేళ్ల పాటు తనను వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత యువతి బుధవారం సాయంత్రం హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసిన పోలీసులు సదరు యువకుడి ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement