హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాల బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం హయత్‌నగర్ లక్ష్మీరెడ్డిపాలెం వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎలాంటి సూచన ఇవ్వకుండా ఇసుక లారీ మలుపు తిరుగుతుండగా.. అటు నుంచి వస్తున్న స్వాతి ఇంజనీరింగ్ కళాశాల బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌తో పాటు 10 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.